Balayya Is No More: టాలీవుడ్‌లో విషాదం, సీనియర్ నటుడు బాలయ్య మృతి

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు మన్నవ బాలయ్య ఇక లేరు.

FOLLOW US: 

Mannava Balayya Is No More: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. కథా రచయిత, దర్శక - నిర్మాత, నటుడు బాలయ్య ఈ రోజు ఉదయం (శనివారం, ఏప్రిల్ 9) మృతి చెందారు. ఆయన వయసు 94 ఏళ్ళు. హైదరాబాద్, యూసఫ్‌గూడలోని గల ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. పుట్టినరోజు నాడు ఆయన మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

మన్నవ బాలయ్య కంటే ఎమ్. బాలయ్యగా ఆయన సుపరిచితులు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని వైకుంఠపురములో గ్రామం. ఆయన డిగ్రీ (బి.ఈ) చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళు కాకినాడ కాలేజీ, మద్రాసు పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్‌గా పాఠాలు బోధించారు.  ఖాళీ సమయాల్లో నాటకాలు వేసేవారు. స్నేహితులందరూ హిందీ సినిమా హీరోలా ఉన్నావని ప్రశంసిస్తూ, ప్రోత్సహించడంతో సినిమాల్లోకి వచ్చారు.

'ఎత్తుకు పైఎత్తు' చిత్రంతో బాలయ్య కథానాయకుడిగా పరిచయం అయ్యారు. కొన్ని సినిమాల్లో హీరోగా చేసినా... సరైన విజయాలు దక్కలేదు. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. ఎన్టీఆర్‌తో ఆయనకు మంచి అనుబంధం ఉంది. 'ఇరుగు - పొరుగు', 'బొబ్బిలి యుద్ధం', 'పాండవ వనవాసం', 'వివాహ బంధం', 'శ్రీక్రిష్ణ పాండవీయం', 'నేనే మొనగాణ్ణి' - ఎన్టీఆర్ హీరోగా రూపొందిన పౌరాణిక, జానపద, సాంఘీక చిత్రాల్లో బాలయ్య నటించారు. 'నేనే మొనగాణ్ణి'లో ఆయన విలన్ వేషం వేశారు. సుమారు 300కి పైగా చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించారు. కృష్ణ 'అల్లూరి సీతారామరాజు'లో అగ్గిరాజు పాత్ర ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది.

బాలయ్య నటుడు మాత్రమే కాదు... రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా! శోభన్ బాబు కథానాయకుడిగా కె. విశ్వనాథ్ దర్శకత్వంలో 'చెల్లెలి కాపురం' సినిమా నిర్మించారు. ఆ చిత్రానికి గొల్లపూడి మారుతి రావుతో కలిసి కథ రాశారు. 'చెల్లెలి కాపురం' ఉత్తమ చిత్రంగా నంది  పురస్కారం అందుకుంది. నిర్మాతగా ఆయనకు నంది వచ్చింది.  ఆ తర్వాత విశ్వనాథ్ దర్శకత్వంలో కృష్ణ హీరోగా 'నేరము - శిక్ష' నిర్మించారు. చిరంజీవితో హీరోగా స్వీయ దర్శకత్వంలో 'ఊరికిచ్చిన మాట' చిత్రాన్ని నిర్మించారు. దీనికి ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు అందుకున్నారు.

నందమూరి బాలకృష్ణ 'శ్రీరామరాజ్యం' సినిమా నటుడిగా ఎమ్. బాలయ్యకు చివరి సినిమా. అందులో వసిష్ఠుని పాత్రలో కనిపించారు. బాలయ్య కుమారుడు తులసీరామ్ కథానాయకుడిగా కొన్ని చిత్రాల్లో నటించారు. కుమారుణ్ణి హీరోగా పరిచయం చేస్తూ తీసిన 'పసుపు తాడు' బాలయ్య దర్శక - నిర్మాతగా చివరి సినిమా. ఆ తర్వాత నటనకు పరిమితం అయ్యారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Also Read: 'గని' సినిమా రివ్యూ: బాక్సింగ్ పంచ్ అదిరిందా? లేదా?

Also Read: 'కథ కంచికి మనం ఇంటికి' రివ్యూ: 'చీకటి గదిలో చితకొట్టుడు'తో త్రిగుణ్ మీద పడిన మచ్చ పోతుందా?

Published at : 09 Apr 2022 10:30 AM (IST) Tags: Balayya Balayya Is No More M Ballayya Passes Away Artist Balayya Death Mannava Balayya Mannava Balayya Death Mannava Balayya Passed Away Mannava Balayya Dies At 94

సంబంధిత కథనాలు

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్

NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?

NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?

Pooja Hegde: ‘కేన్స్‌’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!

Pooja Hegde: ‘కేన్స్‌’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Revant Reddy : కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !

Revant Reddy :  కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !

BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత

BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత

Thailand Open: ప్చ్‌.. సింధు! చెన్‌యూఫీ అనుకున్నంత పనీ చేసేసింది!

Thailand Open: ప్చ్‌.. సింధు! చెన్‌యూఫీ అనుకున్నంత పనీ చేసేసింది!

Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !

Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !