అన్వేషించండి

Akkineni Naga Chaitanya : నాగ చైతన్య X అకౌంట్ హ్యాక్... అనుమానాస్పద ట్వీట్ తో విషయం వెలుగులోకి.. 

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయినట్టుగా తెలుస్తోంది. ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చిన ఓ ట్వీట్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

గత కొన్ని రోజుల నుంచి కొండా సురేఖ వివాదంతో వార్తల్లో నిలుస్తున్న అక్కినేని నాగ చైతన్య ట్విట్టర్ ఎకౌంటు తాజాగా హ్యాక్ అవ్వడం గమనార్హం. తాజాగా ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చిన ఓ ట్వీట్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. మరి ఆ ట్వీట్ ఏంటి? అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం 'తండేల్' మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న అక్కినేని నాగ చైతన్య పలు అనూహ్యమైన కారణాల వల్ల వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్టుగా తెలుస్తోంది.

తాజాగా ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చిన ఒక ట్వీటే దానికి కారణం. అందులో 'నేను 50 డాలర్లకు 100 బిట్ కాయిన్లను 2013లో కొనుగోలు చేశాను. ఇక ఇప్పుడు వాటి విలువ 6 మిలియన్ డాలర్లు. ఇప్పుడు గివ్ అవే ఇవ్వాలా వద్దా ఓట్ చేయండి' అంటూ తన ఫ్యాన్స్ ను నాగ చైతన్య కోరినట్టుగా ఆయన అకౌంట్ నుంచి వచ్చిన ఆ ట్వీట్ లో ఉంది. అయితే ఇది నిజంగానే నాగ చైతన్య చేసాడేమో అనుకుని ఇప్పటికే చాలామంది ఫాలోవర్లు ఓటింగ్ కూడా చేశారు. కానీ నిజానికి ఇలాంటి బిట్ కాయిన్ వ్యవహారాల గురించి ఎక్కువగా హ్యాకర్లు మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటారు. దీంతో ఇప్పుడు నాగ చైతన్య ఎకౌంట్ హ్యాక్ అయ్యిందా అనే అనుమానాలు మొదలయ్యాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ ట్వీట్ దాదాపు 24 గంటలపాటు ఆయన అకౌంట్లో దర్శనం ఇచ్చింది. కాసేపటి క్రితమే దాన్ని డిలీట్ చేశారు. 2017లో నాగ చైతన్య ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయగా, ఆయనకు ప్రస్తుతానికి 2.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. మరి ఈ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ పై నాగ చైతన్య ఎలా స్పందిస్తారో చూడాలి. అభిమానులు గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇలాంటి వ్యవహారాలను హీరోలు ఎప్పుడూ తెరపైకి తీసుకురారు. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే అలాంటి వాటికి దూరంగా ఉండటమే బెటర్. అయితే ఇప్పటిదాకా నాగచైతన్య ఈ వ్యవహారం పై స్పందించకపోవడం గమనార్హం. ఇలాంటివి జరిగినప్పుడు సెలబ్రిటీలు ఇతర మార్గాలలో తమ అభిమానులను అప్రమత్తం చేస్తారు. కానీ చై ఇంకా రియాక్ట్ కాకపోవడం అక్కినేని ఫ్యాన్స్ ను అయోమయంలో పడేసింది. మరి ఇంకా విషయం చై దృష్టికి వెళ్లలేదా? అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. 

కాగా కొన్ని రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీపై షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. నాగ చైతన్య, సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటూ ఆమె చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. దీంతో టాలీవుడ్ మొత్తం ఏకమై ఆమె వ్యాఖ్యలను ఖండించారు. ఈ నేపథ్యంలోనే నాగర్జున 'ఆమె సమంతకు సారీ చెప్తే సరిపోతుందా? నా కుటుంబం పరిస్థితి ఏంటి?' అంటూ ఫైర్ అవుతూ నాంపల్లి కోర్టులో సురేఖపై క్రిమినల్ కేసు వేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కొండా సురేఖ వెనకడుగు వేయకపోవడం గమనార్హం. మరి ఈ కేసు వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, న్యాయస్థానం ఈ వివాదంపై ఎలాంటి తీర్పును ఇస్తుందో చూడాలి. 

Read Also : Nayanthara: రెండేళ్ల తరువాత నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోకి నయనతార, విఘ్నేష్‌ల పెళ్లి... ఆ వివాదం కూడా - రన్ టైమ్ ఎంతంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On Haryana : హర్యానా ఎన్నికలపై అనుమానాలు - బ్యాలెట్లతోనే ప్రజాస్వామ్యం సేఫ్ - జగన్ ట్వీట్ వైరల్
హర్యానా ఎన్నికలపై అనుమానాలు - బ్యాలెట్లతోనే ప్రజాస్వామ్యం సేఫ్ - జగన్ ట్వీట్ వైరల్
Central Cabinet Decisions : పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇక ఉచితంగా ఫోర్టిఫైడ్ బియ్యం
పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇక ఉచితంగా ఫోర్టిఫైడ్ బియ్యం
Chandrababu: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు చంద్రబాబు మద్దతు, మరో ఎన్నికలు సైతం నిర్వహణపై యోచన
వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు చంద్రబాబు మద్దతు, మరో ఎన్నికలు సైతం నిర్వహణపై యోచన
TGPSC: అక్టోబరు 21 నుంచి 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షలు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?
అక్టోబరు 21 నుంచి 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షలు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌కి ఆర్టికల్ 370 మళ్లీ వస్తుందా, మోదీ ఉండగా సాధ్యమవుతందా?రాహుల్‌కి కిలో జిలేబీలు పంపిన బీజేపీ, విపరీతంగా ట్రోలింగ్Amalapuram News: అమ్మవారి మెడలో దండ వేసే గొప్ప ఛాన్స్, వేలంలో రూ.లక్ష పలికిన అవకాశంJammu and Kashmir: ముస్లిం ఇలాకాలో హిందూ మహిళ సత్తా! ఈమె గురించి తెలిస్తే కన్నీళ్లే!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On Haryana : హర్యానా ఎన్నికలపై అనుమానాలు - బ్యాలెట్లతోనే ప్రజాస్వామ్యం సేఫ్ - జగన్ ట్వీట్ వైరల్
హర్యానా ఎన్నికలపై అనుమానాలు - బ్యాలెట్లతోనే ప్రజాస్వామ్యం సేఫ్ - జగన్ ట్వీట్ వైరల్
Central Cabinet Decisions : పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇక ఉచితంగా ఫోర్టిఫైడ్ బియ్యం
పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇక ఉచితంగా ఫోర్టిఫైడ్ బియ్యం
Chandrababu: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు చంద్రబాబు మద్దతు, మరో ఎన్నికలు సైతం నిర్వహణపై యోచన
వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు చంద్రబాబు మద్దతు, మరో ఎన్నికలు సైతం నిర్వహణపై యోచన
TGPSC: అక్టోబరు 21 నుంచి 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షలు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?
అక్టోబరు 21 నుంచి 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షలు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?
Nobel Prize 2024: రసాయనశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌, ప్రొటీన్ పై పరిశోధలకు అత్యున్నత పురస్కారం
రసాయనశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌, ప్రొటీన్ పై పరిశోధలకు అత్యున్నత పురస్కారం
Akkineni Naga Chaitanya : నాగ చైతన్య X అకౌంట్ హ్యాక్... అనుమానాస్పద ట్వీట్ తో విషయం వెలుగులోకి.. 
నాగ చైతన్య X అకౌంట్ హ్యాక్... అనుమానాస్పద ట్వీట్ తో విషయం వెలుగులోకి.. 
SC Classification : తెలంగాణలో ఇక ఉద్యోగ  ప్రకటనలు ఎస్సీ వర్గీకరణ తర్వాతనే - కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో ఇక ఉద్యోగ ప్రకటనలు ఎస్సీ వర్గీకరణ తర్వాతనే - కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra Ministers : వరద సాయంపై అదేపనిగా వైసీపీ తప్పుడు ప్రచారం - ఖర్చు వివరాలు రిలీజ్ చేసిన మంత్రులు
వరద సాయంపై అదేపనిగా వైసీపీ తప్పుడు ప్రచారం - ఖర్చు వివరాలు రిలీజ్ చేసిన మంత్రులు
Embed widget