Malvika Nair: ‘కల్కి 2898 AD’లో మాళవికా నాయర్ క్యారెక్టర్ అదే - ట్రైలర్‌లో మహాభారతం రిఫరెన్స్
Kalki 2898 AD: ఇటీవల విడుదలయిన ‘కల్కి 2898 AD’ ట్రైలర్‌లో చాలామంది నటీనటుల గ్లింప్స్‌ను చూపించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అందులో మాళవికా నాయర్ పాత్ర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
Malvika Nair In Kalki 2898 AD: అత్యంత భారీ బడ్జెట్‌తో, హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో, స్టార్ క్యాస్టింగ్‌తో తెరకెక్కిన చిత్రమే ‘కల్కి 2898 AD’. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ సినిమా విడుదలకు ఇంకా వారం రోజులే సమయం ఉంది. దీంతో ఒక్కొక్కటిగా అప్డేట్‌ను రివీల్ చేస్తూ ‘కల్కి 2898 AD’పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలయ్యింది. సినిమాలో నటించిన నటీనటులు అంతా దాదాపుగా ఈ ట్రైలర్‌లో కనిపించారు. అందులో మాళవికా నాయర్ కూడా ఒకరు. ‘కల్కి 2898 AD’లో మాళవికా పాత్ర ఇదేనంటూ ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతోంది.
మాళవికా గ్లింప్స్..
‘కల్కి 2898 AD’ మూవీ ట్రైలర్‌లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ సీన్స్ ఆడియన్స్‌కు ఫీస్ట్ ఇచ్చాయి. ఇక వీరితో పాటు సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నటీనటులను మొత్తంగా ఈ ట్రైలర్‌లో చూపించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అలా మాళవికా నాయర్ కూడా ఒక సీన్‌లో కనిపించింది. ట్రైలర్ విడుదలకు ముందు ‘కల్కి 2898 AD’లో మాళవికా నాయర్ ఉందనే విషయం కూడా చాలామందికి తెలియదు. మేకర్స్ కూడా తన గురించి ఎక్కడా రివీల్ చేయలేదు. ప్రమోషన్స్‌లో కూడా తను పాల్గొనలేదు. దీంతో ట్రైలర్‌లో మాళవికాను చూసిన తర్వాత తన పాత్ర ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక చర్చ వైరల్ అవుతోంది.
తనే ఉత్తర..
‘కల్కి 2898 AD’ ట్రైలర్‌లో మాళవికా నాయర్ గెటప్ చూస్తుంటే తను మహాభారతంలోని ఉత్తర పాత్రను పోషిస్తుందని ప్రేక్షకులు గెస్ చేస్తున్నారు. ఉత్తర అంటే అభిమాన్యుడి భార్య. అర్జునుడి కుమారుడే అభిమన్యుడు. కురుక్షేత్రం మొదలయిన తర్వాత అర్జునుడు, అశ్వద్ధామ మధ్య భీకర యుద్ధం జరుగుతుంటుంది. అదే సమయంలో అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తారు. అదే సమయంలో నారదుడు, వ్యాసుడు అక్కడికి వచ్చి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తే విశ్వం నాశనం అయిపోతుందని, అందుకే ఉపయోగించవద్దని సూచిస్తారు. ఆ మాట విన్న అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వదిలేస్తాడు. కానీ అశ్వద్ధామ మాత్రం వదలడు. కావాలనే తన చేతిలోని బ్రహ్మాస్త్రాన్ని ఉత్తరపై వదులుతాడు.
అశ్వద్ధామ దాడి..
ఉత్తర కడుపులో పెరుగుతున్న అభిమన్యుడి కుమారుడిని చంపగలిగితే పాండవుల వంశం ముగిసిపోతుందని అశ్వద్ధామ అనుకుంటాడు. అప్పుడే శ్రీ కృష్ణుడు రంగంలోకి దిగి ఉత్తర కడుపులోని బిడ్డను కాపాడి.. జీవితాంతం అశ్వద్ధామ గాయాలతోనే ఉండాలని శపిస్తాడు. అందుకే అశ్వద్ధామ ఇంకా బ్రతికే ఉన్నాడని చాలామంది నమ్ముతారు. ఇక ‘కల్కి 2898 AD’ ట్రైలర్‌లో బ్రహ్మాస్త్రం వచ్చి మాళవికా నాయర్‌ను దాడి చేయడం స్పష్టంగా చూపించారు. ఇక మహాభారతాన్ని బట్టి తనే ఉత్తర అని ప్రేక్షకులు నమ్ముతున్నారు. ఇక ఈ మూవీ ట్రైలర్ విషయానికొస్తే ఇందులో మరో హైలెట్‌గా నిలిచారు కమల్ హాసన్. మొదటిసారి చూసినప్పుడు అసలు అది కమల్ హాసనే అని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. జూన్ 27న ‘కల్కి 2898 AD’ థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
Also Read: కొండపల్లిని తాకిన ‘కల్కి‘ క్రేజ్ - భైరవ, బుజ్జి బొమ్మలు వచ్చాయి చూశారా?