HBD Venkatesh: వారి వల్లే జీవితమంటే ఏంటో అర్థమయ్యింది, ఆ హిట్లు సంతోషాన్ని ఇవ్వలేదు - విక్టరీ వెంకటేష్
Venkatesh Birthday: విక్టరీ వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఒక ఆసక్తికర విషయాన్ని గుర్తుచేసుకున్నారు ఫ్యాన్స్.
Happy Birthday Victory Venkatesh: సినీ పరిశ్రమలో అసలు హేటర్స్ లేని నటీనటులు ఉండడం చాలా కష్టం. నటీనటులంతా ప్రేక్షకులను మెప్పించడానికి ఎంత కష్టపడినా.. ఏదో ఒక పాయింట్‌లో వారిపై ప్రేక్షకులకు అయిష్టం కలుగుతుంది. కానీ అసలు హేటర్సే లేకుండా ఇన్ని దశాబ్దాలకు హీరోగా వెలిగిపోతున్నారు విక్టరీ వెంకటేశ్. అందుకే ఫ్యాన్స్ ఆయనను ముద్దుగా వెంకీ మామ అని పిలుచుకుంటారు. అలాంటి వెంకీ మామ గురించి ఫ్యాన్స్‌కు తెలియని విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి ఆయనకు దైవభక్తి ఎక్కువ. ఆ తర్వాత మెల్లగా ఆయన ఆధ్యాత్మికను నమ్మడం మొదలుపెట్టారు. ఈ విషయం పలు సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది కూడా.
పర్సనల్ లైఫ్ ఎప్పుడూ ప్రైవేట్‌గానే..
డిసెంబర్ 13న విక్టరీ వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా అంతా ఆయనకు విషెస్‌తో నిండిపోయింది. ఇన్నేళ్లుగా ఆయన ప్రేక్షకులకు అందించిన ఎవర్‌గ్రీన్ క్లాసిక్ సినిమాలను గుర్తుచేసుకోవడానికి ఇది ప్రత్యేకమైన రోజు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ‘బొబ్బిలి రాజా’లాంటి మాస్ కమర్షియల్ సినిమాల్లో మాత్రమే కాకుండా ‘చంటి’లాంటి డిఫరెంట్ ప్రేమకథల్లో కూడా నటించి ఎంతోమంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నారు వెంకీ మామ. మామూలుగా సినీ సెలబ్రిటీల గురించి ఏ చిన్న విషయం అయినా వెంటనే ప్రేక్షకులకు తెలిసిపోతుంది. కానీ అలా తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా ఎవరికీ తెలియకుండా ప్రైవట్‌గా ఉండడానికి ఇష్టపడ్డారు వెంకటేశ్. అలా ఆయన ఓపెన్‌గా మాట్లాడిన చాలా తక్కువ సందర్భాల్లో తనకు దేవుడి మీద ఉన్న నమ్మకం గురించి బయటపెట్టారు.
సక్సెస్ వల్ల సంతోషం రాలేదు..
యాక్టింగ్ అనేది అసలు తన ఆలోచనలోనే లేదని ఇప్పటికే పలుమార్లు రివీల్ చేశారు వెంకటేష్. ముందుగా బిజినెస్‌లోకి అడుగుపెట్టాలనుకొని.. అది ఫెయిల్ అవ్వడంతో యాక్టింగ్‌లోకి దిగారు. అందుకే జీవితం నుంచి తనకు ఏం కావాలన్నా ఆధ్యాత్మికతను నమ్ముకునేవాడిని అని వెంకీ మామ తెలిపారు. ‘‘మనం జీవితంలో కోరుకునేది, మనకు జీవితంలో దక్కేది.. రెండు వేర్వేరు విషయాలు అని నేను తెలుసుకున్నాను. 1997లో ‘ప్రేమించుకుందాం రా’ సినిమా సమయంలో నాకు బ్యాక్ టు బ్యాక్ హిట్లు వచ్చాయి. కానీ అవేవి నాకు సంతోషాన్ని ఇవ్వలేవు. అసలు ఎందుకిలా ఫీల్ అవ్వలేకపోతున్నానని నాకే ఆశ్చర్యంగా అనిపించింది. అందుకే ఆధ్యాత్మికతను ఎంచుకున్నాను. హిమాలయాలకు వెళ్లాను. అందుకే ఇప్పుడు నేను ఆధ్యాత్మికతను, మనిషిగా నా బాధ్యతను బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను’’ అని బయటపెట్టారు.
వాళ్లు నన్ను అర్థం చేసుకోలేకపోయారు..
తన జీవితంలో ఆధ్యాత్మికతకు ప్రత్యేకమైన స్థానం దక్కడానికి రమణ మహర్షి, వక్తలు కారణమని వెంకటేశ్ తెలిపారు. వారి వల్లే తనకు జీవితం అంటే ఏంటో అర్థమయ్యిందని, కానీ ఒక నటుడిగా తనకు ఎప్పుడూ కష్టాలు ఎదురవుతూ ఉండేవని అన్నారు. మొదట్లో వెంకటేశ్‌కు దైవభక్తి ఎక్కువగా ఉండేది కాదు, కానీ ఉన్నట్టుండి ఆయన ఆధ్యాత్మికతను నమ్ముకోవడంతో తన కుటుంబ సభ్యులు సైతం ఆశ్చర్యపోయారు. ‘‘నిజం అనేది మనలోని ఉంటుందని నేను నమ్ముతాను. ఈ విషయం తెలుసుకున్న తర్వాత మళ్లీ పుట్టినట్టు అనిపిస్తుంది. కర్మానుసారంగా ప్రతీ ఒక్కరికి తమ దారి ఏంటో తెలుస్తుంది. మా అన్నకు, నాన్నకు దీని గురించి చెప్పినప్పుడు వాళ్లు నన్ను అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పట్టింది. కానీ నేను నా దారిలో, వారు వారి జీవితాల్లో సంతోషంగా ఉన్నాం’’ అని వెంకీ మామ తన బ్లాగ్‌లో చెప్పుకొచ్చారు. ఇప్పటికీ మనశ్శాంతి కోసం హిమాలయాలకు వెళ్లిపోవడం వెంకీ మామకు అలవాటే.
Also Read: హ్యాపీ బర్త్ డే వెంకటేష్ - వెంకీమామ మన అందరివాడు, ఈ ప్రత్యేకతలు ఆయనకే సొంతం