Akhanda 2 Release Date : ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ వాయిదా - క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్... 'అఖండ 2' రిలీజ్ వాయిదాపై రియాక్షన్
Akhanda 2 : 'అఖండ 2' రిలీజ్ వాయిదా పడడంతో 'ది రాజా సాబ్' విషయంలో వస్తోన్న ఊహాగానాలకు ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ చెక్ పెట్టారు. 'అఖండ 2' రిలీజ్ వాయిదా పడడం తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు.

Producer TG Vishwa Prasad About Akhanda 2 Movie Postponed : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ 'అఖండ 2' మూవీ రిలీజ్ వాయిదా పడడంపై ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. 'అఖండ 2' విడుదల సమస్య తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. విడుదలకు ముందే సినిమాలు ఆగిపోవడం దురదృష్టకరమని చెప్పారు. అలాగే, 'ది రాజా సాబ్' రిలీజ్‌పై వస్తోన్న రూమర్లపైనా క్లారిటీ ఇచ్చారు.
లాస్ట్ మినిట్‌లో అలా చేస్తే...
పెద్ద సినిమాలు చెప్పిన టైంకు రిలీజ్ కాకుంటే దాని ప్రభావం పరిశ్రమలోని ఇతర వ్యక్తులపై కూడా పడుతుందని అన్నారు విశ్వప్రసాద్. 'చిన్న సినిమా నిర్మాతలు తమ సినిమాలను పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్‌తో కంపేర్ చేస్తూ సరైన టైంకు రిలీజ్ చేసేందుకు వెయిట్ చేస్తున్నారు. అఖండ 2 రిలీజ్ సమస్య నన్ను తీవ్రంగా కలిచివేసింది. రాజాసాబ్ విడుదల చుట్టూ అనేక ఊహాగానాలు ఉన్నాయి. మూవీ రిలీజ్‌కు లాస్ట్ మినిట్‌లో ప్రయత్నించడం చాలా దురదృష్టకరం. ఇలాంటి చర్యలు తీవ్రంగా ఖండించదగినవి.
ఈ అవాంతరాలు డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నికల్ టీం ఇలా వ్యవస్థలో వేలాది మందిని ప్రభావితం చేస్తాయి. భవిష్యత్తులో థర్డ్ పార్టీస్ చేసే లాస్ట్ మినిట్ అంతరాయాలను నివారించడానికి చట్టపరమైన గైడ్ లైన్స్ రూపొందించడం చాలా ముఖ్యం. దీని కోసం ఇండస్ట్రీ పెద్దలు కృషి చేయాలి.' అని అన్నారు.
Also Read : 35 ఏళ్ల తర్వాత నందమూరి హీరో రీ ఎంట్రీ - 'ఛాంపియన్' మూవీలో పవర్ ఫుల్ పాత్రలో...
'ది రాజా సాబ్' రిలీజ్‌పై
ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ చుట్టూ కూడా అనేక ఊహాగానాలు ఉన్నాయని... ఈ మూవీ కోసం సేకరించిన ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ అంతర్గత నిధుల ద్వారా క్లియర్ చేస్తామని స్పష్టం చేశారు విశ్వప్రసాద్. మిగిలిన వడ్డీ కూడా రిలీజ్‌కు ముందే క్లియర్ చేస్తామని అన్నారు. 'అఖండ 2 గ్రాండ్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ది రాజా సాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారీ, జన నాయగన్, పరాశక్తి మూవీస్ సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించాలి.' అని ఆకాంక్షించారు.
'అఖండ 2' రిలీజ్ ఎప్పుడు?
బాలకృష్ణ 'అఖండ 2' రిలీజ్ ఎప్పుడు అనేదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆర్థిక కారణాలతో ఈ నెల 5న రిలీజ్ కావాల్సిన మూవీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చర్చలు ముగిశాయని... సమస్య ఓ కొలిక్కి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీలో పెద్దలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మూవీ రిలీజ్ చేసేందుకు శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు తేదీలు వైరల్ అవుతుండగా... ఫైనల్‌గా ఈ నెల 12న కానీ లేదా క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న కానీ మూవీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వీటిపై త్వరలోనే క్లారిటీ రానుంది. 'అఖండ 2' కోసం బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





















