By: ABP Desam | Updated at : 13 May 2023 01:59 PM (IST)
ప్రమోద్ సావంత్ (Image Credits: CM Pramod Sawant/Twitter)
Goa CM Pramod Sawant : కాంట్రవర్శియల్ మూవీగా పేరు తెచ్చుకున్న 'ది కేరళ స్టోరీ' రోజూ ఏ ఒక వార్తతో ట్రెండింగ్ లో నిలుస్తోంది. కేరళకు చెందిన మహిళలను ఇస్లామిక్ స్టేట్ అనే ఉగ్రవాద సంస్థ బలవంతంగా మతమార్పిడి చేసి రిక్రూట్‌మెంట్ చేసుకునే నేపథ్యంలో ఈ సినిమాను చిత్రీకరించారు. అదా శర్మ నటించిన ఈ చిత్రానికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీపై పలుచోట్ల నిషేధాలు, నిరసనలు ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని కైవసం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
ప్రపంచంలో ఉగ్రవాదం ఎలా మొదలైందో తెలుసుకోవడానికి తల్లిదండ్రులు, యుక్తవయస్కులు 'కేరళ స్టోరీ' సినిమా చూడాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కోరారు. "ఈ చిత్రం తీవ్రవాదానికి సంబంధించి నిజమైన కథను చిత్రీకరిస్తుంది. మతమార్పిడి, ఉగ్రవాదంలో ISIS ఎలా పాల్గొంటుంది, అది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, సిరియా, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలతో సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కావచ్చు. ఇది నిజమైన కథ. అందుకే తల్లిదండ్రులు, యుక్తవయసులో ఉన్నవారు కేరళ కథా చిత్రాన్ని చూడాలి...’’ అని సావంత్ అన్నారు. "వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. ఉగ్రవాదం వ్యాప్తి గురించి అప్రమత్తంగా ఉండాలి. అటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఈ స్లో పాయిజనింగ్ ఆగిపోతుంది" అని ఆయన అన్నారు.
సావంత్ ప్రకారం, యువకులు ఉగ్రవాద చక్రంలో ఎలా చిక్కుకున్నారో ప్రేక్షకులకు స్పష్టత వస్తుంది. "టెర్రరిజం నెట్‌వర్క్ పెరుగుతోంది. దానిని అరికట్టడానికి ప్రయత్నాలు జరగాలి. బ్రెయిన్ వాష్, హిప్నాటిజం ద్వారా ప్రజలు దానికి ఎలా లొంగిపోతున్నారో మనం తెలుసుకోవాలి. అలా ట్రాప్ లో పడి వారు మోసపోతున్నారు" అని సావంత్ అన్నారు. మీ ప్రభుత్వం ఈ సినిమాను పన్ను రహితంగా చేస్తుందా అని అడిగిన ప్రశ్నకు, సావంత్ ఇలా బదులిచ్చారు: "పన్ను రహితంగా రూపొందిస్తే ప్రజలు చూస్తారని కాదు. ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి వారు దీన్ని చూడాలి. గరిష్టంగా ప్రజలు తమ యుక్తవయస్సులోని పిల్లలతో పాటు ఈ సినిమాను చూడాలని చెప్పారు.
సినిమాపై నిషేధం వాక్ స్వాతంత్య్రానికి భంగం కలిగిస్తుందని, ఉగ్రవాదానికి సంబంధించిన అంశంతో తీసిన ఈ చిత్రాన్ని.. మతతత్వ కోణంలో చూడరాదని సావంత్ చెప్పారు. అంతకు ముందు సావంత్‌తో పాటు ఎమ్మెల్యే జిత్ అరోల్కర్, రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి దాము నాయక్ కలిసి 'కేరళ స్టోరీ' సినిమాను వీక్షించారు.
Also Read : 'న్యూసెస్' వెబ్ సిరీస్ రివ్యూ : జర్నలిస్టులు డబ్బుకు దాసోహం అయితే?
'ది కేరళ స్టోరీ' సినిమాపై దేశవ్యాప్తంగా వివాదం కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో ఈ సినిమాపై నిషేధం విధించారు. పశ్చిమ బెంగాల్ లో ఈ సినిమాపై నిషేధం విధించారు. మమతా బెనర్జీ ఈ మూవీపై నిషేధం విధిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి వివాదాల్లో చిక్కుకున్న ఈ మూవీ.. కేరళకు చెందిన 32వేల మంది బాలికలు అదృశ్యమయ్యారని, ఆ తర్వాత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో చేరారని ట్రైలర్‌పై విమర్శలు వచ్చాయి. "పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 'కేరళ స్టోరీ' చిత్రాన్ని నిషేధించాలని నిర్ణయించింది. ద్వేషం, హింసాత్మక సంఘటనలను నివారించడానికి ఈ నిర్ణయం" తీసుకున్నట్ల మమతా చెప్పారు.
Also Read : ఎట్టకేలకు ఆ మూడు చిత్రాలకు మోక్షం - ఇన్నాళ్లు ఆగినందుకు ఆశించిన ఫలితం దక్కేనా?
'యూత్ ను ఎంకరేజ్ చేయాలే, ధమ్ ధమ్ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!
OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే
SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!
Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!
PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!
4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం
CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!
MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?
Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?