Thandel Release Date: అక్కినేని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్... సంక్రాంతికి 'తండేల్' లేనట్టేనా? డైరెక్ట్‌గా షాక్ ఇచ్చిన డైరెక్టర్
Chandoo Mondeti on Thandel Release: అక్కినేని ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... "తండేల్" రిలీజ్ డేట్ పై డైరెక్టర్ ఓ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చారు. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ కానుందో తెలుసుకుందాం పదండి.
అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో నాగ చైతన్య (Naga Chaitanya) పాన్ ఇండియా మూవీ 'తండేల్' (Thandel Movie) కూడా ఒకటి. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చాలా రోజుల నుంచి రూమర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవుతుందని అన్నారు. ఆ తర్వాత లేదు లేదు సంక్రాంతికి రిలీజ్ అవుతుందని టాక్ నడిచింది. కానీ ఇప్పుడేమో ఈ రెండూ కాదని తేల్చేశారు డైరెక్టర్ చందూ మొండేటి.
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య లీడ్ రోల్ పోషిస్తున్న తాజా మూవీ 'తండేల్'. ఈ సినిమాలోసాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ తో పాటు ఎసెన్స్ ఆఫ్ తండేల్ అనే గ్లిమ్స్ కు ఆడియన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ దొరికింది. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో డైరెక్టర్ చందు మొండేటి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఓ సినిమా ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా హాజరైన డైరెక్టర్ చందూ మొండేటి మూవీ రిలీజ్ పై స్పందించారు. 'తండేల్' మూవీని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా డైరెక్టర్ చందూ మొండేటి కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఆయన మాట్లాడుతూ "సంక్రాంతి బరిలో మేము కూడా ఉన్నాము" అని చెప్పి షాక్ ఇచ్చారు. ఇప్పటికే సంక్రాంతిపై బాలయ్య, వెంకటేష్, రాంచరణ్ లాంటి స్టార్ హీరోలు కర్చీఫ్ వేసిన సంగతి తెలిసిందే. దీంతో చందూ మొండేటి ఇచ్చిన స్టేట్మెంట్ తో మూవీ లవర్స్ కాస్త టెన్షన్ పడ్డారు. కానీ అంతలోనే ఆయన తన స్పీచ్ కంటిన్యూ చేస్తూ "తండేల్ షూటింగ్ పూర్తి కావచ్చింది. మరో 10 రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది. ఒకవేళ చరణ్ ఉన్నాడు కదా అని మూవీ నిర్మాత అరవింద్ గారు, వెంకీ మామ సినిమా వస్తోందని చైతు గారు ఆలోచిస్తే మాత్రం కష్టమే" అని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా డిసెంబర్ కి రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని ఆయన తేల్చి చెప్పారు.
తండేల్ మూవీ స్టేటస్ ఏంటో చెప్పిన డైరెక్టర్ చందు మొండేటి
— Sathish Dandaveni (@UrsDandaveni) October 29, 2024
ఇంకా 10 రోజులు మాత్రమే షూటింగ్ ఉన్నట్లు చందు వెల్లడి
జనవరి 26న తండేల్ రాదని క్లారిటీ ఇచ్చిన చందు మొండేటి#Thandel #ThandelRelease #ThandelUpdate@chay_akkineni @Sai_Pallavi92 @GeethaArts #Netflix pic.twitter.com/T9moFpzQKf
దీంతో మొత్తానికి చందూ మొండేటి మాటలు వింటుంటే అక్కినేని నాగ చైతన్య "తండేల్" మూవీ ఇప్పట్లో రిలీజ్ అయ్యే సూచనలు కనిపించట్లేదు. మరి ఈ మూవీ రిలీజ్ విషయంలో నిర్మాత అల్లు అరవింద్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఒకవేళ డైరెక్టర్ చందూ మొండేటి అన్నట్టుగా ఈ మూవీని సంక్రాంతికి కాకుండా ఆ తర్వాత ఎప్పుడైనా పెట్టుకుంటాం అని మేకర్స్ అనుకుంటే ఇది నిజంగా అక్కినేని ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూసే.