Thalapathy Vijay : ధనుష్ డైరెక్టర్‌తో తలపతి విజయ్ లాస్ట్ మూవీ?
Thalapathy Vijay : దళపతి విజయ్ లాస్ట్ మూవీ కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ తో ఉండబోతుందని లేటెస్ట్ న్యూస్ బయటికి వచ్చింది.
కోలీవుడ్ అగ్ర హీరో తలపతి విజయ్ తాజాగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా తన పార్టీ పేరును అధికారికంగా అనౌన్స్ చేసి 2026 ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఇక విజయ్ రాజకీయాల్లోకి రావడంతో సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారు. విజయ్ పూర్తిస్థాయి రాజకీయాలతో బిజీ కానున్న నేపథ్యంలో ఆయన చివరగా ఒకే ఒక్క ప్రాజెక్ట్ చేసి సినిమాలకు విరామం తీసుకోబోతున్నారు.
ఈ క్రమంలోనే ఆయన లాస్ట్ మూవీ విషయంలో రోజుకో వార్త కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో దళపతి విజయ్ లాస్ట్ సినిమా ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం కార్తిక్ సుబ్బరాజ్, హెచ్. వినోద్ లాంటి కోలీవుడ్ డైరెక్టర్స్ పరిశీలనలో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. ఇక తాజాగా ఈ లిస్టులో మరో కోలీవుడ్ డైరెక్టర్ చేరాడు.
వెట్రిమారన్ తో విజయ్ లాస్ట్ మూవీ
తమిళంలో 'వడ చెన్నై', 'అసురన్', 'విడుదలై' వంటి సినిమాలతో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెట్రి మారన్ ఇప్పుడు దళపతి విజయ్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి కమర్షియల్ అంశాలు లేకుండా రా అండ్ రస్టిక్ సినిమాలు తీసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వెట్రిమారన్ తో సినిమా చేయాలని తలపతి విజయ్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాడు.
ఇక ఎట్టకేలకు తన చివరి చిత్రాన్ని ఈ దర్శకుడితోనే చేయబోతున్నట్లు కోలీవుడ్ మీడియా ద్వారా సమాచారం అందుతోంది. దళపతి విజయ్ పొలిటికల్ ఎలిమెంట్స్ తో కూడిన కథతోనే తన చివరి సినిమా చేయాలని అనుకుంటున్నారట. ఇప్పుడు ఆ అవకాశాన్ని వెట్రిమారన్ కి ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టును అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
2025 సంక్రాంతి కి రిలీజ్
DVV దానయ్య - తలపతి విజయ్ కాంబినేషన్ ప్రాజెక్టుని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 2025 సంక్రాంతికి ఇప్పటికే టాలీవుడ్ నుంచి మెగాస్టార్ విశ్వంభర, నాగార్జున బంగార్రాజు పార్ట్-3 తో పాటూ హనుమాన్ సీక్వెల్ 'జై హనుమాన్' వంటి సినిమాలు రాబోతున్నాయి. ఇక ఈ సినిమాలకు పోటీగా తలపతి విజయ్ - DVV దానయ్య ల ప్రాజెక్ట్ ని రిలీజ్ చేయబోతుండటం గమనార్హం. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం దానయ్య దళపతి విజయ్ కి భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
'గోట్' రిలీజ్ అప్పుడే
గత ఏడాది 'లియో' మూవీతో భారీ సక్సెస్ అందుకున్న తలపతి విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో గోట్(Greatest Of All Time) సినిమా చేస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో రూపొందుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‍గా నటిస్తున్నారు. జయరాం, మిక్ మోహన్, ప్రభు దేవ, యోగిబాబు కీరోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఈ ఏడాది జూన్ లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read : గోపీచంద్ సినిమా టైటిల్ కన్ఫర్మ్ చేసిన హీరోయిన్ కావ్య థాపర్