News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Vijay in Jawan: షారుఖ్ 'జవాన్'లో దళపతి విజయ్ - గట్టిగానే ప్లాన్ చేసిన అట్లీ!

షారుక్ ఖాన్ 'జవాన్' తలపతి విజయ్ క్యామియో రోల్ చేస్తున్నట్లు ఇప్పటికే విషయం తెలిసిందే. అయితే ఒకవేళ సినిమాలో విజయ్ కనిపించకపోయినా ఆయన తాలూకు స్టఫ్ ని అట్లీ గట్టిగానే ప్రిపేర్ చేశారట.

FOLLOW US: 
Share:

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ - అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'జవాన్' సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'పఠాన్' వంటి సంచలన విజయం తర్వాత షారుక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో షారుక్ ఖాన్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాకుండా ఇందులో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తో పాటు దళపతి విజయ్ సైతం క్యామియో రోల్ చేస్తున్నట్లు వార్తలు రావడంతో ఇప్పుడు దీనిపైనే అందరి దృష్టి ఉంది. దీనికి సంబంధించి మూవీ టీం నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు, కానీ డైరెక్టర్ అట్లీ దళపతి విజయ్ కి వీరాభిమాని అనే విషయం తెలిసిందే.

అందుకే తను తెరకెక్కిస్తున్న 'జవాన్' లో విజయ్ క్యామియో రోల్ గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఒకవేళ 'జవాన్' లో విజయ్ నటించకపోయినా, సినిమాలో ఆయన రిఫరెన్సులు మాత్రం చాలానే ఉన్నాయని లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి అట్లీ ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ లో  హింట్ కూడా ఇచ్చాడు. దళపతి విజయ్ ఐకానిక్ పోజ్ ని షారుక్ ఖాన్ అనుకరించే ఓ షాట్ 'జవాన్' ప్రివ్యూలో అది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఒక్కటే కాకుండా సినిమా మొత్తం విజయ్ మేనరిజమ్స్, స్టైల్ ని షారుక్ ఖాన్ అనుకరించబోతున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఓ స్టార్ హీరో మేనేజర్స్ ని మరో స్టార్ హీరో అనుకరించడం ఫ్యాన్స్ కి థ్రిల్లింగ్ ట్రీట్ గా ఉంటుందని చెప్పొచ్చు. అంతేకాకుండా అలాంటి సన్నివేశాలు సినిమాని నెక్స్ట్ లెవెల్ కి ఎలివేట్ చేస్తాయి.

డైరెక్టర్ అట్లీ 'జవాన్' లో తలపతి విజయ్ డైలాగ్ డెలివరీ ని, ఆయన సిగ్నేచర్ మేనరిజమ్స్ ని తిరిగి షారుక్ ఖాన్ ద్వారా రీ క్రియేట్ చేయబోతున్నారట. ఒకవేళ ఇదే కనుక నిజమైతే తమిళ ఆడియన్స్ లో షారుక్ 'జవాన్' కి మరింత ఆదరణ దక్కుతుందని చెప్పొచ్చు. ఇక ఈ వార్తలు 'జవాన్' లో తలపతి విజయ్ క్యామియో రోల్ పై మరింత అంచనాలను పెంచుతున్నాయి. మరోవైపు షారుక్ ఖాన్ తో దళపతి విజయ్ ఉన్న ఫోటో గత సంవత్సరం చివరిలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి షారుక్ ఖాన్ 'జవాన్' లో విజయ్ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒకవేళ 'జవాన్' లో దళపతి విజయ్ నటించకపోయినా, ఆయన తాలూకు స్టఫ్ ని అట్లీ కుమార్ గట్టిగానే ప్రిపేర్ చేశాడని అంటున్నారు. కాబట్టి దళపతి ఫ్యాన్స్ కూడా 'జవాన్' సెలబ్రేషన్స్ కి రెడీ అవ్వచ్చు.

ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. రెడ్ చిల్లిస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే అతిధి పాత్రలో కనిపించనుంది. సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Also Read : రామ్ చరణ్ సలహాతో వరుణ్ తేజ్ కెరీర్ ప్రమాదంలో పడిందా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 28 Aug 2023 10:23 AM (IST) Tags: thalapathy vijay JAWAAN Shah Rukh Khan Atlee Kumar Sharukh Khan Jawaan

ఇవి కూడా చూడండి

శివకార్తికేయన్ 'అయలాన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

శివకార్తికేయన్ 'అయలాన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!

'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!

అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!

అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!

‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

టాప్ స్టోరీస్

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ