By: ABP Desam | Updated at : 23 May 2023 11:21 AM (IST)
Photo Credit: Vijay/Instagram
కరోనా లాక్ డౌన్ తర్వాత బాలీవుడ్ సినిమాలతో పోల్చితే సౌత్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్నాయి. గత కొంత కాలంగా ఒకటి, రెండు బాలీవుడ్ చిత్రాలు మినహా, మిగతా చిత్రాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి. రీసెంట్ గా ‘పఠాన్’ మూవీ హిట్ అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించింది. కానీ, సౌత్ నుంచి వచ్చిన ‘RRR’, ‘KGF’, ‘కాంతార’ లాంటి సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కనీవినీ ఎరుగని రీతిలో కలెక్షన్లు సాధించాయి. ‘RRR’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటింది. ఆస్కార్ లాంటి అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నాయి.
రెమ్యునరేషన్ విషయంలోనూ సౌత్ స్టార్ హీరోలు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. తాజాగా సౌత్ స్టార్ హీరో దళపతి విజయ్ రెమ్యునరేషన్ విషయంలో సరికొత్త రికార్డు సాధించబోతున్నారు. ఇండియాలో ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోకు సాధ్యం కాని రీతిలో పారితోషికం తీసుకోబోతున్నారు. ఒక్క చిత్రానికి ఏకంగా రూ. 200 కోట్లు అందుకోబోతున్నారు. తమిళ చిత్రసీమలో కరిష్మాటిక్ స్టార్ అయిన తలపతి విజయ్‌కి తమిళనాడులోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలో కూడా అభిమానులు ఉన్నారు. ఆయనకున్న ఫ్యాన్ బేస్ ను ఆధారంగా చేసుకుని రెమ్యునరేషన్ విషయంలో ఏమాత్రం వెనుకాడ్డం లేదు ఫిల్మ్ మేకర్స్. విజయ్ చివరి చిత్రం ‘వారిసు’కు గాను రూ. 120 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్, ‘లియో’ కోసం రూ. 200 కోట్లు వసూళు చేస్తున్నారట. ఈ వార్తలు వాస్తవం అని తేలితే, ప్రభాస్, సల్మాన్ ఖాన్ సహా ఇతర స్టార్ హీరోలను వెనక్కినెట్టి దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోలలో నెంబర్ వన్ గా నిలువనున్నారు.
విజయ్ అసాధారణమైన మార్కెట్ అప్పీల్ తో పాటు స్థిరమైన బాక్సాఫీస్ హిట్లు దక్కడంతో, అతడి సినిమాల డిజిటల్, శాటిలైట్ రైట్స్ కు భారీ మొత్తంలో బిజినెస్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. కథాంశంతో సంబంధం లేకుండా విజయాన్ని అందించగల సామరథ్యం విజయ్ సొంతం కావడంతో నిర్మాతలు ఖర్చుకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. విజయ్ నటించిన ‘లియో’ ఈ ఏడాది అక్టోబర్ 19న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన ఆయన, తదుపరి సినిమాల కోసం చర్చలు జరుపుతున్నారు. ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఆయన సినిమా చేయనున్నారు. తాజాగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. అటు అట్లీ, గోపీచంద్ మలినేని కూడా విజయ్ తో సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
Read Also: గోపీచంద్‌తో 'రెడ్' బ్యూటీ - ఇద్దరికీ ఫ్లాపులే, హిట్ వస్తుందా?
మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!
Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ
సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!
Arjun Kapoor-Malaika Arora: బెడ్‌పై అర్ధనగ్నంగా బాయ్ ఫ్రెండ్ - మలైకా అరోరాపై మండిపడుతున్న నెటిజన్స్!
‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్
AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా
Jogi Ramesh: డర్టీ బాబు, టిష్యూ మేనిఫెస్టో - మంత్రి వ్యాఖ్యలు, చించేసి చెత్తబుట్టలో వేసి మరీ
Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !
Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!