News
News
X

Kajal Aggarwal: కాజల్‌ను తీసినందుకు కొరటాల చెల్లించక తప్పలేదు భారీ మూల్యం

'ఆచార్య' సినిమాలో చిరంజీవికి జంటగా తొలుత కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఆమె పాత్రను తొలగించారు. అందుకు కొరటాల శివ భారీ మూల్యం చెల్లించక తప్పలేదట.

FOLLOW US: 

Kajal Aggarwal Effect On Acharya Movie Losses: 'ఆచార్య'లో కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ ఉంటే సినిమా నష్టం కొంత తక్కువ అయ్యేదా? అంటే కచ్చితంగా అని చెప్పాలి. కాజల్ సీన్స్ ఉంటే సినిమా విజయం సాధించేదా? కాజల్ కోసం, ఆమెను చూడటం కోసం కొంత మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేవారా? అంటే... ఎవరికీ తెలియదు. కానీ, కాజల్ లేకపోవడం వల్ల నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా వచ్చే మొత్తంలో కొంత కోత పడిందని తెలుస్తోంది.

'ఆచార్య' శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్మినప్పుడు (డీల్ కుదిరినప్పుడు) సినిమాలో కాజల్ అగర్వాల్ ఉంది. సినిమా కంప్లీట్ అయ్యేసరికి సినిమాలో ఆమె లేదు. కాజల్ క్యారెక్టర్ లేని కారణంగా ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం కంటే పది కోట్ల రూపాయలను తక్కువ ఇచ్చారని తెలిసింది. ఈ లాస్‌కు కాజల్ రెమ్యూనరేషన్ అదనం. పైగా, ఆమెపై కొన్ని రోజులు సీన్స్ తీశారు. వారం రోజులు షూటింగ్ / ప్రొడక్షన్ కాస్ట్ కూడా లాస్ అన్నమాట.

షూటింగ్ చేసిన ప్రతి సీన్ సినిమాలో ఉండాలని రూల్ ఏదీ లేదు. సినిమా అంతా తీశాక... ఫ్లో దెబ్బ తింటుందని, ఫలానా సీన్ ఉండటం వల్ల గ్రాఫ్ పడుతుందని  దర్శక - నిర్మాతలు, హీరోలు అనుకుంటే కొన్ని సీన్స్ తీసేస్తారు. అది రెగ్యులర్‌గా జరిగే ప్రాసెస్. అయితే... 'ఆచార్య' సినిమా థియేట్రికల్ బాక్సాఫీస్ దగ్గర భారీ పరాజయం పాలవడంతో ఇప్పుడు ఇటువంటి నష్టాలు అన్నీ డిస్కషన్ టాపిక్ అవుతుంది.

Also Read : అది రూమరే, కొరటాల శివ ఆ పని చేయడం లేదట!
 
'ఆచార్య' నష్టాలు భర్తీ చేయాలని డిస్ట్రిబ్యూటర్లు గొడవ చేయడంతో వాళ్ళకు కొంత మొత్తం ఇవ్వడానికి దర్శకుడు కొరటాల శివ, నిర్మాత నిరంజన్ రెడ్డి అంగీకరించారు. సినిమాలో కాజల్ ఉండి ఉంటే... డిజిటల్, శాటిలైట్ రైట్స్ అమౌంట్‌లో పది కోట్లు ఎక్కువ వచ్చేది. కొంత హెల్ప్ అయ్యేది. నిజానికి... 'ఆచార్య' విడుదలకు ముందే సినిమాను కొరటాల శివ కొన్నారని, ఆయనే అమ్మకాలు సాగించారని, అనధికారికంగా సినిమాకు ఆయనే నిర్మాత అని ఫిల్మ్ నగర్ గుసగుస. అందువల్ల, డిస్ట్రిబ్యూటర్లు కొరటాల శివ దగ్గర పంచాయతీ పెట్టారు.      

Also Read: డెలివరీ తర్వాత ముంబై నుంచి మొదటిసారి బయటకొచ్చిన కాజల్ అగర్వాల్ - అబ్బాయ్‌తో

View this post on Instagram
 
A post shared by Matinee Entertainment (@matineeents)

Published at : 18 Jul 2022 12:54 PM (IST) Tags: chiranjeevi ram charan kajal aggarwal Koratala siva Kajal Effect On Acharya Loss

సంబంధిత కథనాలు

Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

Bimbisara Collections: 'బింబిసార' 13డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - బాక్సాఫీస్ షేక్!

Bimbisara Collections: 'బింబిసార' 13డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - బాక్సాఫీస్ షేక్!

టాప్ స్టోరీస్

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?