Bold Look: బోల్డ్ ఫస్ట్ లుక్‌తో 'యావరేజ్ స్టూడెంట్ నాని' - 'యానిమల్' ఇన్‌స్పిరేషనా?
Average Student Nani Movie: 'యావరేజ్ స్టూడెంట్ నాని' పేరుతో తెలుగులో ఓ సినిమా రూపొందుతోంది. రీసెంట్‌గా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 'యానిమల్' ఇన్‌స్పిరేషన్‌తో షూట్ చేసినట్టు ఉన్నారు.
Merise Merise movie director Pawan Kumar K makes his acting debut with Average Student Nani: 'మెరిసే మెరిసే' సినిమా గుర్తు ఉందా? నారా రోహిత్ 'ప్రతినిధి 2'లో ముఖ్యమంత్రి కుమారుడిగా కనిపించిన దినేష్ తేజ్ హీరోగా నటించారు. ఆ చిత్రానికి పవన్ కుమార్ కొత్తూరి దర్శకత్వం వహించారు. మెగాఫోన్ పట్టిన ఆయన ఇప్పుడు మేకప్ వేసుకుంటున్నారు. కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఎస్... పవన్ కుమార్ హీరోగా మారారు.
'ఏవరేజ్ స్టూడెంట్ నాని'తో హీరోగా...
దర్శకుడు పవన్ కుమార్ కొత్తూరి హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'ఏవరేజ్ స్టూడెంట్ నాని'. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. ఒకరు స్నేహా మాలవియా, మరొకరు సాహిబా భాసిన్, వివియా సంత్ ఇంకొకరు. ఇటీవల సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆ బోల్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే...
'యానిమల్' సినిమా గుర్తు ఉందిగా! అందులో బెడ్ మీద రణబీర్ కపూర్, తృప్తి దిమ్రి సీన్ బాగా వైరల్ అయ్యింది. ఆ సీన్ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నట్టు ఉన్నారు. పవన్ కుమార్ కొత్తూరి (Pavan Kumar K) సైతం కథానాయికతో కలిసి బెడ్ మీద టాప్ లెస్ ఫోజు ఇచ్చారు. ముగ్గురు హీరోయిన్లలో ఆ బెడ్ మీద ఉన్నది స్నేహా మాలవియా. ఈ స్టిల్ చూస్తేంటే సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్లు ఉన్నట్టు అర్థం అవుతోంది. యువతను ఎట్రాక్ట్ చేసేలా స్టిల్ డిజైన్ చేశారు. నానిగా పవన్, సారాగా స్నేహ నటించారు.
Also Read: మిరల్ రివ్యూ: రెండేళ్లకు తెలుగులో రిలీజైన 'ప్రేమిస్తే' భరత్ సినిమా - హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
View this post on Instagram
'యావరేజ్ స్టూడెంట్ నాని' సినిమాలో హీరోగా నటించడమే కాదు... దర్శకత్వం కూడా వహిస్తున్న పవన్ కుమార్, ఈ సినిమాతో నిర్మాతగానూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి పతాకంపై బిషాలి గోయెల్ భాగస్వామ్యంతో సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.
యాక్షన్ & ఫ్యామిలీ బాండింగ్ కూడా!
'యావరేజ్ స్టూడెంట్ నాని' ఫస్ట్ లుక్ చూసి సినిమాలో బోల్డ్ కంటెంట్ మాత్రమే ఉంటుందని అనుకోవద్దని... ఇందులో ఈతరం యువత ప్రేమలో ఎలా పడుతున్నారు? వాళ్లు ప్రేమించే విధానం ఎలా ఉంటుంది? ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉంది? వంటి విషయాలను ఎంటర్‌టైనింగ్‌గా చెప్పామని పవన్ కుమార్ కె చెప్పారు.
Also Read: సితార పాపకు భక్తి ఎక్కువ - మహేష్ కూతురి మెడలో లాకెట్ చూశారా?
పవన్ కుమార్ కొత్తూరి హీరోగా, స్నేహా మాలవ్య, సాహిబా భాసిన్, వివియా సంత్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఝాన్సీ, రాజీవ్ కనకాల, 'ఖలేజా' గిరి వంటి సీజనల్ ఆర్టిస్టులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి పోరాటాలు: నందు, కూర్పు: ఉద్ధవ్ ఎస్ బి, ఛాయాగ్రహణం: సజీష్ రాజేంద్రన్, నృత్య దర్శకత్వం: రాజు మాస్టర్, సంగీత దర్శకత్వం: కార్తీక్ బి కొడకండ్ల, నిర్మాణం: పవన్ కుమార్ కె - బిషాలి గోయెల్, రచన, దర్శకత్వం: పవన్ కుమార్ కొత్తూరి.