సంక్రాంతికి తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలి - దిల్ రాజుకు నిర్మాతల మండలి షాక్!
తెలుగు నిర్మాత మండలి సంక్రాంతి సినిమాల విడుదలపై ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది.
ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు టాలీవుడ్ నిర్మాతల మండలి షాక్ ఇచ్చింది. 2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, రవితేజ నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలు విడుదల కానున్నాయి. వీటితో పాటు అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ కూడా సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన తమిళ సినిమా ‘వారిసు’ను తెలుగులో ‘వారసుడు’ పేరుతో డబ్ చేసి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
మొదట ఈ సినిమాను బైలింగ్వల్‌గా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ హీరో విజయ్, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి వేర్వేరు సందర్భాల్లో ఇది డైరెక్ట్ తమిళ సినిమా అని చెప్పారు. ఆగస్టులో తెలుగు సినిమాల షూటింగ్ నిలిపివేసిన సమయంలో కూడా ఇది డైరెక్ట్ తమిళ సినిమా అని చెప్పి దిల్ రాజు షూటింగ్ కొనసాగించారు.
ఇప్పుడు ‘వారసుడు’ని స్ట్రయిట్ తెలుగు సినిమాల కంటే పెద్దస్థాయిలో విడుదల చేయాలనుకుంటున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఒక ప్రకటన విడుదల చేసింది. 2017లో జరిగిన సమావేశంలో సంక్రాంతి, దసరా పండుగలకు కేవలం స్ట్రయిట్ తెలుగు సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో నొక్కి చెప్పారు.
2019లో దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ పండుగలకు స్ట్రయిట్ సినిమాలు ఉన్నప్పుడు డబ్బింగ్ సినిమాలకు థియేటర్స్ ఎలా ఇస్తామని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా అలాగే స్ట్రయిట్ సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చి మిగిలిన థియేటర్లను మాత్రమే డబ్బింగ్ సినిమాలకు కేటాయించాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఇది దిల్ రాజుకు ఇచ్చిన కౌంటర్ అని నెటిజనం అభిప్రాయపడుతున్నారు.
View this post on Instagram
View this post on Instagram