Revanth Reddy: రేవంత్ రెడ్డి దగ్గరకు 'సీతా కళ్యాణ వైభోగమే' టీమ్ - ట్రైలర్ చూసి తెలంగాణ సీఎం అభినందన
Seetha Kalyana Vaibhogame Movie: 'దిల్' రాజు సోదరుని కుమారుడు హర్షిత్ రెడ్డి కజిన్ సుమన్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'సీతా కళ్యాణ వైభోగమే'. ఈ చిత్ర బృందం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది.
'దిల్' రాజు బంధువు, ఆయన సోదరుని కుమారుడు & 'బలగం' నిర్మాతల్లో ఒకరైన హర్షిత్ రెడ్డి కజిన్ సుమన్ తేజ్ (Suman Tej Actor) కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా 'సీతా కళ్యాణ వైభోగమే' (Seetha Kalyana Vaibhogame Movie). సతీష్ పరమవేద దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గరీమా చౌహన్ కథానాయిక. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ నిర్మించారు. ఈ నెల (జూన్) 21న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy)ని చిత్ర బృందం కలిసింది.
ప్రచార చిత్రాలు చూసి అభినందించిన సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 'సీతా కళ్యాణ వైభోగమే' టీజర్, ట్రైలర్, పాటలను చిత్ర బృంద సభ్యులు చూపించారు. ప్రచార చిత్రాలు బాగున్నాయని, ఈ సినిమా పెద్ద విజయం సాధించి చిత్ర బృందానికి మంచి పేరు తీసుకు రావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. చిత్ర నిర్మాత రాచాల యుగంధర్ (Rachala Yugandhar)ను రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సభ్యుల్లో 'సీతా కళ్యాణ వైభోగమే' నిర్మాత రాచాల యుగంధర్, దర్శకుడు సతీష్ పరమవేద, 'నీరూస్' ప్రతినిధి అసీమ్, హీరో హీరోయిన్లు సుమన్ తేజ్, గరీమా చౌహాన్, విలన్ రోల్ చేసిన గగన్ విహారి, ఛాయాగ్రాహకుడు పరశురామ్, వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఉన్నారు.
తెలుగు సంస్కృతి చాటేలా... సీతా కళ్యాణ వైభోగమే
Seetha Kalyana Vaibhogame Trailer: 'సీతా కళ్యాణ వైభోగమే' ట్రైలర్ ఇటీవల హర్షిత్ రెడ్డి చేతుల మీదుగా విడుదలైంది. రెగ్యులర్ మాస్ మసాలా కమర్షియల్ అంశాలతో పాటు తెలుగు నేటివిటీని, మన తెలుగింటి ఆచార సంప్రదాయాలు చూపిస్తూ దర్శకుడు సతీష్ పరమవేద ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. పురాణ ఇతిహాస గ్రంథం రామాయణం ప్రేరణతో ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించారని తెలిసింది.
Also Read: హైదరాబాద్ రేప్ కేసుపై బాలీవుడ్ సినిమా - కరీనా, ఆయుష్మాన్ జంటగా!
ఏపీ, తెలంగాణ... జూన్ 21న రెండు తెలుగు రాష్ట్రాల్లో 'సీతా కళ్యాణ వైభోగమే' చిత్రాన్ని వందకు పైగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని, ప్రేక్షకులు అందరూ వెండితెరపై సినిమా చూడాలని నిర్మాత రాచాల యుగంధర్ రిక్వెస్ట్ చేశారు.
Also Read: మిస్టర్ బచ్చన్ రాంపేజ్... హరీష్ శంకర్ మార్క్ మాస్ మహారాజా యాక్షన్ షురూ
సుమన్ తేజ్, గరీమా చౌహన్ హీరో హీరోయిన్లుగా నటించిన 'సీతా కళ్యాణ వైభోగమే' సినిమాలో యువ నటుడు గగన్ విహారి విలన్ రోల్ చేశారు. నాగినీడు, శివాజీ రాజా, ప్రభావతి, వెంకీ మంకీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. చరణ్ అర్జున్ సంగీతం అందించిన పాటలు కొన్ని విడుదల కాగా... శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పరుశురామ్, కూర్పు: డి. వెంకట ప్రభు, నృత్య దర్శకత్వం: భాను మాస్టర్ - పోలకి విజయ్, నిర్మాణం: రాచాల యుగంధర్, దర్శకత్వం: సతీష్ పరమవేద.