Mirai Vs Kishkindhapuri: కిష్కింధపురి మీద మిరాయ్ పిగుడు... బెల్లంకొండ వసూళ్లకు గండి కొట్టిన తేజా సజ్జా
Mirai Impact On Kishkindhapuri: ఉరిమి ఉరిమి పిడుగు మీద పడినట్టు అయ్యింది 'కిష్కింధపురి' పరిస్థితి. ఆ సినిమా కలెక్షన్స్ మీద 'మిరాయ్' ప్రభావం గట్టిగా పడింది.

మీడియమ్ బడ్జెట్ సినిమాలకు సోలో రిలీజ్ ఎంత ఇంపార్టెంట్ అనేది 'కిష్కింధపురి' కలెక్షన్లతో మరోసారి తేటతెల్లం అయ్యింది. సెప్టెంబర్ 12న ఆ సినిమా రిలీజ్ అని అనౌన్స్ చేసిన టైంకి మరో మూవీ ఏదీ లేదు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాకు సోలో రిలీజ్ దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ మూవీ మీద 'మిరాయ్' పడింది. బెల్లంకొండ సినిమా వసూళ్లకు గండి పడింది.
'మిరాయ్'కు పోయింది ఏమీ లేదు...
లాస్ అంతా 'కిష్కింధపురి' సినిమాకే!
వాస్తవానికి సెప్టెంబర్ 5న 'మిరాయ్' విడుదల కావాల్సి ఉంది. కానీ ఒక్క వారం వెనక్కి వచ్చి సెప్టెంబర్ 12న థియేటర్లలోకి వచ్చింది. అప్పటికే ఆ డేట్ అనౌన్స్ చేసిన 'కిష్కింధపురి' మేకర్లకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నిర్మాత సాహు గారపాటి, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమను 'మిరాయ్' టీమ్ అసలు సంప్రదించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పాన్ ఇండియా మైథాలజీ ఫిల్మ్ వచ్చి తెలుగు స్టేట్స్ టార్గెట్ చేస్తూ తీసిన హారర్ థ్రిల్లర్ మీద పడటంతో చిన్న సినిమాకు అన్యాయం జరిగింది.
'మిరాయ్'తో పాటు థియేటర్లలోకి రావడం వల్ల 'కిష్కింధపురి'కి ఎక్కువ నష్టం జరిగింది. 'మిరాయ్' గ్రాండ్ స్కేల్ ఉన్న సినిమా. లార్జర్ దేన్ లైఫ్ కథతో తీశారు. మరోవైపు 'కిష్కింధపురి' హారర్ థ్రిల్లర్. అందువల్ల మొదటి రోజు 'మిరాయ్' చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ దగ్గర అది స్పష్టంగా కనిపించింది.
Also Read: 'మిరాయ్'ను బీట్ చేసిన జపనీస్ యానిమే... ఇండియాలో సైలెంట్‌గా దెబ్బ కొట్టిన 'డీమన్ స్లేయర్'!
'మిరాయ్'కు మొదటి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హిట్ టాక్ వచ్చింది. ఈ మూవీ తెలుగు వెర్షన్ 10 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. 'కిష్కింధపురి' 2 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. 'మిరాయ్' బడ్జెట్ 60 కోట్ల కంటే ఎక్కువ. 'కిష్కింధపురి' బడ్జెట్ రూ. 20 కోట్లు. ఆ లెక్క చూస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాకు డీసెంట్ ఓపెనింగ్ వచ్చింది. కానీ, థియేటర్లలో మరొక సినిమా ఉండటం వల్ల లాస్ అయ్యింది. అదే సోలో రిలీజ్ దక్కి ఉంటే మరొక రెండు మూడు కోట్లు ఎక్కువ వచ్చేది.
థియేటర్ల దగ్గర 'కిష్కింధపురి'కి అన్యాయం!
థియేటర్స్ దగ్గర కూడా 'కిష్కింధపురి'కి అన్యాయం జరిగిందని టాక్. 'మిరాయ్' కంటే బెల్లంకొండ మూవీకి తక్కువ స్క్రీన్స్ వచ్చాయి. తిరుపతి లాంటి ఏరియాలో రోజు మొత్తంలో రెండు షోస్ పడ్డాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని సి సెంటర్లలో థియేటర్లు లేవట. 'మిరాయ్' కంటే ఒక్క రోజు ముందు మూవీని రిలీజ్ చేస్తే ఓపెనింగ్ వచ్చేది. కానీ రెండో రోజు నుంచి మళ్ళీ థియేటర్స్ తగ్గేవి. ఈ క్లాష్ వల్ల 'మిరాయ్' నిర్మాతలకు పోయింది ఏమీ లేదు గానీ 'కిష్కింధపురి' ప్రొడ్యూసర్లు లాస్ అయ్యారు.





















