Image Credit: Tamanna/Twitter
Tamanna: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది తమన్నా. తన అందం, అభినయంతో మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఆమె ఇండస్ట్రీకు వచ్చి దాదాపు దశబ్దకాలం పైనే అవుతున్నా ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో డాన్స్ బాగా చేసే కొద్దిమంది హీరోయిన్లలో తమన్నా కూడా ఒకరు. ఆమె నటన, గ్లామర్ షో తోనే కాకుండా తన డాన్స్ తో కూడా ఎంతో మంది అభిమానుల్ని కూడా సంపాదించుకుంది. ‘రచ్చ’ సినిమాలో రామ్ చరణ్ తో అయినా ‘బద్రినాథ్’ సినిమాలో బన్నితో అయినా ‘ఊసరవెల్లి’ సినిమాలో ఎన్టీఆర్ తో అయినా హీరోలతో పాటు డాన్స్ చేయడంలో తమన్నా స్టైలే వేరు. అందుకే ఆమెకు క్రేజ్ తగ్గలేదు. నిజానికి తమన్నాకు డాన్స్ అంటే సినిమాల్లోకి వచ్చిన తర్వాత కాదు చిన్నపటి నుంచే ఇష్టమట. ఈ విషయాన్ని తమన్నా ఇటీవల ఆమె చిన్నతనంలో డాన్స్ చేస్తున్న ఫోటో ఒకటి షేర్ చేస్తూ చెప్పుకొచ్చింది.
తమన్నా డాన్స్ చేస్తే ఎవరైనా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. అంత అందంగా డాన్స్ చేస్తుంది మిల్కీ బ్యూటీ. అయితే ఆమెకు డాన్స్ అంటే చిన్నప్పటి నుంచీ ఇష్టమట. ఈ విషయాన్ని ఓ పోస్ట్ ద్వారా తెలిపింది తమన్నా. ఆ పోస్ట్ లో తమన్నా చిన్నప్పుడు స్టేజీ పై డాన్స్ చేస్తున్న ఫోటో అది. ఆ ఫోటోకు కొనసాగింపుగా సముద్రం ఒడ్డున డ్రింక్ తాగుతూ సరదాగా డాన్స్ చేస్తున్న వీడియోను కలిపి పోస్ట్ చేసింది. అప్పుడైనా ఇప్పుడైనా తనకు డాన్స్ అంటేనే ఇష్టమని ఆ పోస్ట్ తో చెప్పింది తమన్నా. దానితో పాటు ఓ చిన్న నోట్ కూడా రాసుకొచ్చింది. చిన్నప్పటి నుంచి తనకు డాన్స్ అంటే ఇష్టమని, డాన్స్ చేయడం తప్ప తనకు మరేది అంత ఆనందం కలిగించలేదని, ఈ ఫోటోతో పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయని రాసుకొచ్చింది.
తమన్నా ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తోంది. అదే గ్లామర్ ను మెయిన్టైన్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంది. గతేడాది ‘ఎఫ్ 3’, ‘ప్లాన్ ఏ ప్లాన్ బి’, ‘గుర్తుందా శీతాకాలం’ వంటి సినిమాల్లో నటించిన తమన్నా ఈ ఏడాది తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ సినిమాలో నటించనుంది. ఈ సినిమాతో పాటు రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న ‘జైలర్’ సినిమాలో కూడా నటిస్తోంది తమన్నా. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లో భాగం కానుంది.
Read Also : అవును, లావణ్యతో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నారు - త్వరలో పెళ్లి, రేపే ఎంగేజ్మెంట్
వెబ్ సిరీస్ లలోనూ దూసుకుపోతున్న మిల్కీ బ్యూటీ..
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు వరుసగా వెబ్ సిరీస్ లలో నటిస్తోంది తమన్నా. ఆమె నటించిన ‘11th అవర్’, ‘నవంబర్ స్టోరీ’ వెబ్ సిరీస్ ల తర్వాత ఇప్పుడు తమన్నా నటించిన ‘జీ కర్దా’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ జూన్ 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అంతేకాదు ‘లస్ట్ స్టోరీస్’లో సైతం బోల్డ్‌గా కనిపించనుంది.
This throwback reminded me that since childhood nothing made me a happy as dancing to my favourite songs. No matter what happens… just dance!#JeeKardaThrowback
— Tamannaah Bhatia (@tamannaahspeaks) June 8, 2023
Show me your then and now… I’d love to hear your story.
Watch #JeeKardaOnPrime on June 15 only on @primevideoin pic.twitter.com/fq4lF4zEhA
Naveen Polishetty: ‘జవాన్’తో పోటీనా? తప్పు చేస్తున్నారని భయపెట్టారు- కానీ, అద్భుతం జరిగింది- నవీన్ పొలిశెట్టి
Jagapathi Babu: కుర్రాడిగా మారేందుకు జగ్గూ భాయ్ పాట్లు.. ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉందా?
VVS Laxman - 800 Pre Release : ముత్తయ్య కోసం ముంబైలో సచిన్ - ఇప్పుడు హైదరాబాద్‌లో వీవీఎస్ లక్ష్మణ్
Ram - Double Ismart Movie : రవితేజ 'ఈగల్' తర్వాత రామ్ 'డబుల్ ఇస్మార్ట్'లో గ్లామరస్ లేడీ!
Brahmamudi Serial : 'బ్రహ్మముడి' సీరియల్ హీరో హీరోయిన్ల మానస్, దీపిక మధ్య బ్రేకప్
Telangana BJP : తెలంగాణ ఏర్పాటుపై మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు - కాంగ్రెస్కు ప్లస్ అవుతోందా ?
Rajamundry Jail: రాజమండ్రి జైలులో ఖైదీ మృతిపై జైళ్ల శాఖ కీలక ప్రకటన - అసలు ఏం జరిగిందో చెప్పిన డీఐజీ
Adilabad News: అంబులెన్స్ సిబ్బందికి హ్యాట్సాఫ్ - వర్షంలో రెండు కిలో మీటర్లు కాలినడకన వెళ్లి మహిళకు డెలివరీ
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై కుస్తీ, ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మీటింగ్
/body>