అన్వేషించండి

Saif Ali Khan : నా కొడుకు తైమూర్‌ను హీరోగా కాదు, అలా చూడాలనుకుంటున్నా: సైఫ్ అలీ ఖాన్

Saif Ali Khan : బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తాజా ఇంటర్వ్యూలో తన కొడుకు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Saif Ali Khan About His Son : సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలు తమ వారసులను హీరోగా పరిచయం చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇండస్ట్రీలో తమ లెగసి కంటిన్యూ చేయాలని ఆరాటపడుతుంటారు. ఎవరో కొందరు హీరోలు మాత్రమే వారసులను సినిమా ఇండస్ట్రీకి దూరంగా పెంచుతారు. బాలీవుడ్ విషయానికొస్తే దాదాపు అందరు హీరోలు వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ మాత్రం తన కొడుకు విషయంలో ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్, కరీనాకపూర్ దంపతుల ముద్దుల కొడుకు తైమూర్ అలీ ఖాన్ కెరియర్ గోల్స్ గురించి తండ్రి సైఫ్ అలీ ఖాన్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

కొడుకుని అలా చూడాలనుకుంటున్న సైఫ్

సైఫ్ అలీ ఖాన్ తాజా ఇంటర్వ్యూలో తన కొడుకు హీరో కాకుండా గిటారిస్ట్, ఫుట్ బాల్ ప్లేయర్ కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కొడుకు సక్సెస్ ఫుల్ ఫుట్ బాల్ ప్లేయర్ కావడానికి త్వరలోనే అర్జెంటీనాకు వెళ్లనున్నట్లు తెలిపాడు. ఇక ఇదే ఇంటర్వ్యూలో కరీనా కపూర్ సైతం తన కొడుకుని గొప్ప ఫుట్ బాల్ ప్లేయర్ గా చూడాలని అనుకుంటున్నట్లు తెలిపింది. అంతేకాదు ఫుట్ బాల్ లో మెస్సీ అంతటి వాడవ్వాలని తన ఆశాభావాన్ని వ్యక్తపరిచింది.

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా బిజీ అవుతున్న సైఫ్ కూతురు

సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్ 2018లో 'కేదార్ నాథ్' సినిమాతో బాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె పోషించిన ముక్కు పాత్రకు మంచి పేరొచ్చింది. అంతేకాదు మొదటి సినిమాతోనే బెస్ట్‌ డెబ్యూట్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకుంది. ఆ తర్వాత 'సింబా', 'లవ్‌ ఆజ్‌ కల్‌' 'కూలీ నంబర్‌ వన్‌' తర్వాత ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో ఆమె 'అత్రాంగి రే' వంటి సినిమాలతో స్టార్ స్టేటస్ అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసుకుంటూ వస్తుంది. సారా చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి.

ఎన్టీఆర్ 'దేవర' లో విలన్ గా

హీరో ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు సైఫ్ అలీ ఖాన్. ఈ సినిమాలో రావణుడి పాత్రలో కనిపించారు. గత ఏడాది భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం సైఫ్ తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' సినిమాలో విలన్ రోల్ చేస్తున్నారు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సైఫ్ అలీ ఖాన్ తాలూకు ఫస్ట్ లుక్ మంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. త్వరలోనే దేవర కొత్త రిలీజ్ డేట్ ని మూవీ టీం అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

Also Read : ఓటీటీలోకి మెగాస్టార్ ఎంట్రీ - వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్

టాప్ హెడ్ లైన్స్

Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Embed widget