Taapsee Pannu Sangeet Video: తాప్సీ వెడ్డింగ్ లీక్స్ - సంగీత్‌లో భర్తతో హీరోయిన్ రొమాంటిక్ డ్యాన్స్, వీడియో చూశారా?
Taapsee Pannu: తాప్సీ పెళ్లి వేడుకులకు సంబంధించిన మరో వీడియో లీక్ అయ్యంది. రీసెంట్ పెళ్లీ వీడియో బయటకు రాగా.. తాజాగా సంగీత్ వీడియో లీక్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Taapsee Pannu Sangeet Video Sangeet Party Video: కొద్ది రోజులుగా స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను పెళ్లి విషయమే హాట్‌టాపిక్ అవుతుంది. తన లాంగ్ టైం బాయ్‌ఫ్రెండ్, బ్యాట్‌మెంటన్ ప్లేయర్ మథియాస్ బోతో గుట్టుచప్పుడు కాకుండ పెళ్లి చేసుకుందంటూ వార్తలు ఇప్పటికే బయటకు వచ్చాయి. కానీ ఇంతవరకు దీనిపై ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేదు. కనీసం పెళ్లి ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేయలేదు ఈ భామ. దీంతో అంతా ఆమె పెళ్లి గురించే చర్చించుకుంటున్నారు. అదేంటి ఇంకా పెళ్లి చేసుకున్నట్టు తాప్సీ నుంచి కబురే లేదంటూ అంతా గుసగుసలాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు లీక్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో వచ్చాక ఏ విషయం గుట్టుచప్పుడుగా ఉండటం లేదు. ఏం జరిగిన క్షణాల్లో లీక్ అవుతుంది. ఇక తాప్సీ పెళ్లి మ్యాటర్ కూడా అంతే. చాలా రహస్యంగా తన వెడ్డింగ్‌ను ప్లాన్ చేసుకుంది తాప్సీ. మీడియాకు కూడా ఎలాంటి సమాచారం లేదు. ఇక పెళ్లి ఫోటోలు, వీడియో బయటకు రాకుండ కెమెరాలను అనుమతించలేదు. పెళ్లి విషయంలో అంత గొప్యత పాటించింది తాప్సీ. ఇక పెళ్లి చేసుకున్న ఇంకా ఫోటోలు ఏవి షేర్ చేయడం లేదు. కానీ, తాప్సీ పెళ్లి వీడియోలు, ఫోటోలు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయి. రీసెంట్ గా వెడ్డింగ్ వీడియో ఒకటి బయటకు రాగా.. తాజాగా సంగీత్ పార్టీకి సంబంధించిన వీడియో లీక్ అయ్యింది.
#TaapseePannu and badminton coach #MathiasBoe share a romantic dance at their sangeet ceremony pic.twitter.com/3p4johhgES
— Bollywood Buzz (@BollyTellyBuzz) April 4, 2024
సంగీత్ వేడుకకు సంబంధించి రెండు వీడియోలు బయటకు వచ్చాయి. అందులో తాప్సీ తన భర్త మథియాస్ బోతో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఇద్దరు రొమాంటిక్ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తున్న వారిద్దరి కెమిస్ట్రీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఆమె సంగీత్ పార్టీలో తాప్సీ చేసిన సందడి, డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇక సంగీత్ వీడియో లీక్ అవ్వడంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నాయి. అయితే ఆఫీషియల్ తాప్సీ నుంచి ఇంకా ప్రకటన రాకపోవడంపై అంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇంక ఎన్ని రోజులు దాస్తావు అని, పెళ్లి కబురు ఎప్పుడు చెప్తావ్ అంటూ నెటిజన్లు ఆమెను ప్రశ్నిస్తున్నారు. కాగా రీసెంట్‌గా లీక్ అయిన పెళ్లి వీడియోలో తాప్సీ డిఫరెంట్‌గా తయారైంది.
ఇతర సెలబ్రిటీలా ఆమె రెడ్, పింక్ లెహంగా లాంటిది వెయలేదు. రెడ్ కలర్ షెరార ధరించి చేతి నిండా గాజులు ధరించింది. పంజాబీ సంప్రదాయంలో ఈ పెళ్లి వేడుక జరిగినట్టు తెలుస్తోంది. ఈ వీడియోలో మథియాస్ బో సంప్రదాయ దుస్తుల్లో కనిపించాడు. ఇక ఆమె పెళ్లి రాజాస్థాన్ ఉదయ్‌పూర్‌లో జరిగినట్టు సమాచారం. కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో గ్రాండ్‌గా ఆమె పెళ్లి వేడుక జరిగినట్టు సన్నిహితవర్గాల నుంచి సమాచారం. ఇలా పెళ్లీ వీడియోలు, సంగీత్ వేడుకల వీడియోలు బయటకు రావడంతో తాప్సీ పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్‌గానే జరిగినట్టు తెలుస్తోంది. మొత్తానికి తాప్సీ పెళ్లీ పీటల ఎక్కిందనేది మాత్రం కన్ఫర్మ్ అవ్వడంతో అంతా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read: రెండో పెళ్లిపై ట్రోల్స్, మిమ్స్ - ఎట్టకేలకు స్పందించిన 'దిల్' రాజు, ఏమన్నారంటే