అన్వేషించండి

Taapsee Pannu: హీరోకు నచ్చలేదు మార్చేశాం అన్నారు, నేనైతే ఎప్పటికీ అలా చేయను - దక్షిణాది సినిమాలపై తాప్సీ వ్యాఖ్యలు

Taapsee Pannu: తెలుగులో హీరోయిన్‌గా పరిచయమయిన తాప్సీ.. ఇప్పటికే చాలాసార్లు సౌత్ సినిమాలపై, హీరోలపై కాంట్రవర్షియల్ స్టేట్‌మెంట్స్ ఇచ్చింది. తాజాగా మరోసారి అదే పనిచేసింది.

Taapsee Pannu: బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత సౌత్ సినిమాలపై బురద జల్లడం చాలామంది నటీనటులకు కామన్‌గా మారిపోయింది. ఇప్పటికే ఎందరో నటీమణులు.. టాలీవుడ్‌లో హీరోయిన్స్‌గా పరిచయమయ్యి, యాక్టింగ్‌లో బేసిక్స్ నేర్చుకొని, తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయారు. అలా వెళ్లినవారిలో చాలామంది తెలుగు మేకర్స్‌పై, ముఖ్యంగా తెలుగు హీరోలపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన హీరోయిన్ తాప్సీ పన్ను. ఇప్పటికే తెలుగు హీరోలపై, మేకర్స్‌పై తాప్సీ పలుమార్లు నెగిటివ్ కామెంట్స్ చేసింది. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మరోసారి సినిమాల్లో హీరోయిన్స్‌కు ప్రాధాన్యతపై మాట్లాడుతూ సౌత్‌లో తాను ఎదుర్కున్న ఇబ్బంది గురించి బయటపెట్టింది.

అలా చేయను అని చెప్పేశాను..

‘‘నేను నా సౌత్ సినిమాల్లోని ఒక సినిమాకు డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఒక డైలాగ్‌ను మార్చాలని నాకు చెప్పారు. సినిమాలో నేను అది చెప్పలేదు. నేను సినిమాలో ఏం చెప్పానో అదే డబ్ చేయాలి కదా. కానీ నన్ను అది మార్చమని చెప్పారు ఎందుకంటే నేను చెప్పిన డైలాగ్ హీరోకు నచ్చలేదు. అందుకే మార్చమని అన్నారు. నేనెందుకు మార్చాలి, నేను ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు హీరో ఉన్నాడు కదా. ఇప్పుడెందుకు మార్చమంటున్నారు అని అడిగాను. ఎందుకంటే హీరో సార్ అడిగారని.. నాకు క్లోజ్‌గా ఉన్న షాట్‌లో డబ్బింగ్ సమయంలో డైలాగ్ మారిస్తే లిప్ సింక్ ఉండదు. అందుకే నేను అది చేయడానికి ఒప్పుకోలేదు. మీకు నచ్చకపోతే మ్యూట్‌గా వదిలేయండి, కానీ నేను మాత్రం తప్పు డైలాగ్ డబ్ చేయను అని చెప్పాను’’ అంటూ ఒక సౌత్ సినిమాకు డబ్బింగ్ చెప్తున్న సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని గుర్తుచేసుకుంది తాప్సీ.

అలా డిమాండ్ చేయలేదు..

‘‘ఆ తర్వాత నేను సినిమా చూసినప్పుడు నాకు అర్థమయ్యింది. వాళ్లు ప్రత్యేకంగా ఆ డైలాగ్‌ను హీరో సార్‌కు నచ్చినట్టుగా మార్చడం కోసం డబ్బింగ్ ఆర్టిస్ట్‌ను తీసుకొచ్చి డబ్బింగ్ చెప్పించారు. ఎందుకిలా చేశారని అడిగాను. ఇదే హీరో కావాలనుకున్నాడు అని చెప్పారు. అంతే అయిపోయింది’’ అని తాప్సీ చెప్పుకొచ్చింది. ఇలా సౌత్ సినిమాల్లో తనకు నచ్చే స్వేచ్ఛ లేదని ఈ భామ చెప్పడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇప్పటికే టాలీవుడ్‌లో స్టార్ దర్శకులతో సైతం తనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయని ఓపెన్‌గా స్టేట్‌మెంట్స్ కూడా ఇచ్చింది. ఇక సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ఉన్న ప్రాధాన్యతపై కూడా తాప్సీ వ్యాఖ్యలు చేసింది. ‘‘నేను ఈమధ్య హీరో ప్రెజెన్స్‌కంటే హీరోయిన్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉండే సినిమాలు చేస్తాను. కానీ నేనెప్పుడూ నా కో యాక్టర్ ఏం చేయాలి, ఏం చేయకూడదు అని డిమాండ్ చేయలేదు. ఇంకెవరో ఆ పాత్ర చేయాలి అనుకోలి క్యాస్టింగ్ విషయంలో ఇబ్బందులు పెట్టడం లాంటివి ఎప్పుడూ చేయలేదు’’ అంటూ తన సినిమాల సెలక్షన్ గురించి మాట్లాడింది తాప్సీ.

మార్పు రాలేదు..

‘‘అలాగే మార్పు వస్తుంది. అదే చేస్తూ ఉంటే ఎప్పటికీ ముగిసిపోదు. అందుకే నేను అలా చేయాలని అనుకోవడం లేదు. నాకు కొంచెం పవర్ ఉన్నప్పుడు దానిని సరైన పద్ధతిలో ఉపయోగించాలని అనుకుంటున్నాను’’ అంటూ ఫీమేల్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్స్‌పై తన అభిప్రాయం తెలిపింది తాప్సీ. అయితే ఈమధ్య మార్పు వస్తుందని ‘డియర్ జిందగీ’, ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ వంటి చిత్రాల్లో షారుఖ్, అమీర్‌లాంటి హీరోలు సైతం చిన్న పాత్రల్లో కనిపించారని గుర్తుచేయగా.. దానికి తాప్సీ షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ఆ సినిమాలను ఆ హీరోలు నిర్మించారు కాబట్టి చిన్న పాత్రలు అయినా చేశారని, ఒకవేళ తానే నిర్మాతగా ఒక సినిమా చేసినా.. తాను ఒక చిన్న పాత్ర చేయడానికి ఒప్పుకుంటానని చెప్పింది. అలా నిర్మాతలుగా వ్యవహరించకుండా ఏ హీరో కూడా చిన్న పాత్రలు చేయలేదని స్టేట్‌మెంట్ ఇచ్చింది.

Also Read: ‘ఫోన్ పే’లో మహేశ్ బాబు - మీరు డబ్బులేస్తే, ఇది వినొచ్చు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actress Kasturi : తమిళనాడులోని తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళనాడులోని తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
Andhra Pradesh News: సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ మద్దతుదారులపై కేసులు- పోలీసులకు జగన్ వార్నింగ్
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ మద్దతుదారులపై కేసులు- పోలీసులకు జగన్ వార్నింగ్
BC Census: తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Jeevan Pramaan Patra: లైఫ్‌ సర్టిఫికెట్ల ప్రాసెస్‌ ప్రారంభం - ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఎలా సబ్మిట్‌ చేయాలి?
లైఫ్‌ సర్టిఫికెట్ల ప్రాసెస్‌ ప్రారంభం - ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఎలా సబ్మిట్‌ చేయాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఎందుకయ్యా నీకు రాజకీయాలు, మంత్రి వాసంశెట్టికి క్లాస్ పీకిన చంద్రబాబుRohit Sharma Virat Kohli Failures |  హిట్ మ్యాను, కింగు ఇద్దరూ ఆడకపోతే ఎవరిని అని ఏం లాభం | ABP DesamIndia Strategical Failures vs NZ Test Series | గంభీర్ సారు గారి దయతో అప్పన్నంగా అప్పచెప్పాం | ABP DesamRishabh pant out Controversy | రిషభ్ పంత్ అవుటా..నాట్ అవుటా..వివాదం మొదలైంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actress Kasturi : తమిళనాడులోని తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళనాడులోని తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
Andhra Pradesh News: సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ మద్దతుదారులపై కేసులు- పోలీసులకు జగన్ వార్నింగ్
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ మద్దతుదారులపై కేసులు- పోలీసులకు జగన్ వార్నింగ్
BC Census: తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Jeevan Pramaan Patra: లైఫ్‌ సర్టిఫికెట్ల ప్రాసెస్‌ ప్రారంభం - ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఎలా సబ్మిట్‌ చేయాలి?
లైఫ్‌ సర్టిఫికెట్ల ప్రాసెస్‌ ప్రారంభం - ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఎలా సబ్మిట్‌ చేయాలి?
Chittoor News: పెద్దిరెడ్డిని కాదని కరుణాకర్‌రెడ్డికి జై కొట్టిన జగన్- అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం
పెద్దిరెడ్డిని కాదని కరుణాకర్‌రెడ్డికి జై కొట్టిన జగన్- అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం
Chiranjeevi: చిరంజీవికి నేషనల్ అవార్డు వచ్చేది.. చివరిక్షణంలో రాకుండా కుట్ర చేశారన్న నిర్మాత శ్రీరామ్
చిరంజీవికి నేషనల్ అవార్డు వచ్చేది.. చివరిక్షణంలో రాకుండా కుట్ర చేశారన్న నిర్మాత శ్రీరామ్
Kurnool News: నేడు కప్పట్రాళ్ళకు కర్నూలు జిల్లా యంత్రాంగం, శాస్త్రవేత్తలు- యురేనియం తవ్వకాలపై ప్రజలతో చర్చలు
నేడు కప్పట్రాళ్ళకు కర్నూలు జిల్లా యంత్రాంగం, శాస్త్రవేత్తలు- యురేనియం తవ్వకాలపై ప్రజలతో చర్చలు
TET Notification: తెలంగాణలో నేడు టెట్ నోటిఫికేషన్ విడుదల, జాబ్ క్యాలెండర్ ప్రకారమే పరీక్ష నిర్వహణ!
తెలంగాణలో నేడు టెట్ నోటిఫికేషన్ విడుదల, జాబ్ క్యాలెండర్ ప్రకారమే పరీక్ష నిర్వహణ!
Embed widget