Taapsee Pannu: వాళ్ల వల్ల నాకు సినిమా అవకాశాలేవీ రావు? ఫొటోగ్రాఫర్లతో వివాదంపై స్పందించిన తాప్సీ
తాప్సీ.. తను అనుకుందే చేస్తుంది.. తనకు ఏమనిపిస్తే అది మాట్లాడుతుంది. అలా చాలాసార్లు కాంట్రవర్సీల్లో ఇరుక్కుంది కూడా తాప్సీ. ఇక ఇప్పుడు ఫొటోగ్రాఫర్ల వివాదంపై తన మనసులోని మాట చెప్పారు తాప్సీ.
Taapsee Pannu doesn't want to 'appease' paparazzi: తాప్సీ.. ఈ సొట్ట బుగ్గల చిన్నది వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. అయితే, తను అనుకున్నది చేస్తుంది. తన మనసులో ఏమనుకుంటుందో అది కచ్చితంగా బయటికి చెప్తుంది. నిజానికి ఆమె సినిమాలు కూడా అలానే ఉంటాయి. ప్రాక్టికల్ అంశాలపై ఆమె సినిమాలు తీస్తుంటారు. ఇక ఇటీవల ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చాలా కామెంట్స్ చేశారు. ఫొటో గ్రాఫర్లతో వివాదంపై ఆమె స్పందించారు.
పాజిటివ్ న్యూస్ చూసి ఎన్నిరోజులైంది?
సెలబ్రిటీలు ఏదైనా పార్టీకి వెళ్లినా? ఏదైనా ఫంక్షన్ కి అటెండ్ అయినా, వాళ్లు ఎయిర్ పోర్ట్ కి వెళ్లినా ఫొటో గ్రాఫర్లు వాళ్ల వెంట పడుతుంటారు. ఫొటోలకు ఫోజులు ఇవ్వమని అడుగుతుంటారు. కానీ, తాప్సీ ఎప్పుడూ వాళ్లను పట్టించుకోదు. వాళ్లకు దొరక్కుండా వెళ్లిపోతుంది. దీంతో ఆమెతో వాళ్లు గొడవపడుతూ ఉంటారు. ఆ వివాదంపై స్పందించింది తాప్సీ. ఫీవర్ fmతో మాట్లాడిన తాప్సీ.. తీవ్ర కామెంట్స్ చేశారు. వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని, వాళ్ల వల్ల తనకేమీ సినిమా ఛాన్సులు రావు అని అన్నారు.
తాప్సీ నటించిన 'ఫిర్ ఆయి హసీన్ దిల్ రుబే' అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన తాప్సీ ఆ వివాదంపై స్పందించారు. పాజిటివ్ న్యూస్ మీద ఎవరు క్లిక్ చేస్తారు చెప్పండి? మీరు పాజిటివ్ న్యూస్ చూసి ఎన్ని రోజులు అయ్యింది? అందుకే, ఇలాంటి వార్తలు ఎక్కువగా వైరల్ అవుతాయి. ఆమె ఫొటో గ్రాఫర్లతో రూడ్‌గా ప్రవర్తించింది, ఆమె వీడియోలు ఇవ్వకుండా పరిగెత్తించింది లాంటి వార్తలే అందరికీ నచ్చుతాయి. ఏమైందో చూద్దాం అని అనుకుంటారు. ఆడియెన్స్ కి అలాంటి ఎగ్జైటింగ్ వార్తలే కావాలి. అలాంటి విషయాలేమీ నాకు సినిమాలు తెచ్చిపెట్టడం లేదు. నా సినిమాలే వాటికి సమాధానం చెప్తాయి. మీడియా అని చెప్పుకుని తిరిగే అలాంటి వాళ్లకి నేను సమాధానం చెప్పాల్సిన పనిలేదు. వాళ్లను నేను మీడియా అని కూడా అనను. ఎందుకంటే మీడియా అలాంటి వీడియోలు, ఫొటోలు బయటపెట్టదు కాబట్టి అని తాప్సీ అన్నారు.
2022లో వివాదం..
ఒక ఈవెంట్ కి అటెండ్ అయిన తాప్సీ ఫొటోలకు ఫోజు ఇవ్వకుండా వెళ్లిపోయారు. అప్పుడు చెలరేగింది వివాదం. అప్పుడు ఫొటో గ్రాఫర్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. దీంతో తాప్సీ.. “మీరు మాత్రమే కరెక్టా? యాక్టర్ కరెక్ట్ కాదా ? అంటూ” అతనిపై విరుచుకుపడింది. దానిపై మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఫొటో గ్రాఫర్లు అయిపోయారని అన్నారు. దాంతో కొన్ని వీడియోలు మిస్ యూజ్ అవుతున్నాయని, వన్ సైడెడ్ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు అని అందుకే తను ఇవ్వనన్నీ క్లారిటీ ఇచ్చారు గతంలో.
ఇక సినిమాల విషయానికొస్తే..
సినిమాల విషయానికొస్తే తాప్సీ నటించిన 'ఫిర్ ఆయి హసీన్ దిల్ రుబే' సినిమా ఆగస్టు 9న రిలీజ్ కానుంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో సన్నీ కౌశల్, విక్రాంత్ మాసీ తదితరులు ఉన్నారు. ప్రస్తుతం ఆమె పారిస్ ఒలింపిక్స్ లో ఉన్నారు. తన భర్తతో కలిసి వెళ్లారు ఆమె.