SV Krishna Reddy: మళ్లీ మెగా ఫోన్ పట్టనున్న ఎస్వీ కృష్ణారెడ్డి - సౌత్ కొరియా హీరోయిన్‌తో డ్రీమ్ ప్రాజెక్ట్ 'వేదవ్యాస్'
Vedavyas Movie: దాదాపు రెండేళ్ల తర్వాత డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి మరో ఢిపరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్నారు. 'వేదవ్యాస్' డ్రీమ్ ప్రాజెక్ట్ చేయబోతుండగా... సౌత్ కొరియన్ హీరోయిన్ను పరిచయం చేస్తున్నారు.

SV Krishna Reddy Dream Project Vedavyas Started: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్స్‌తో మంచి హిట్స్ అందించిన దిగ్గజ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ఆయన లాస్ట్‌గా 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు' మూవీని తెరకెక్కించగా... దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టనున్నారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ 'వేదవ్యాస్' పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో గురువారం లాంఛనంగా ప్రారంభమైంది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ వీవీ వినాయక్, అనిల్ రావిపూడి, మురళీ మోహన్ ఈ వేడుకకు హాజరయ్యారు. ముహూర్తపు సీన్‌కు వీవీ వినాయక్ క్లాప్ కొట్టగా... అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ జెమిని కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ చిత్రాన్ని కె.అచ్చిరెడ్డి సమర్పణలో సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ పార్టీ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు.
సౌత్ కొరియా హీరోయిన్‌తో...
ఎస్వీ కృష్ణారెడ్డి కెరీర్‌లో ఇది 43వ సినిమా కాగా... సౌత్ కొరియా హీరోయిన్ జున్ హ్యూన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆద్యంతం వినూత్నంగా జరిగిన ఈ ప్రారంభోత్సవంలో ప్రముఖ నటులు మురళీ మోహన్, అలీ, జుబేదా అలీ, సాయికుమార్, కెమెరామెన్ శరత్ ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి తదితరులు పాల్గొన్నారు.
కుటుంబ కథా చిత్రమ్
'వేదవ్యాస్' ఓ మెసేజ్ ఓరియెంటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. 'నేను అదృష్టవంతుడిని. మీ అందరి ఆదరణతో 43వ సినిమా "వేదవ్యాస్" చేస్తున్నాను. నా లైఫ్‌లో ఎన్ని సినిమాలైతే చేయగలనో అన్ని సినిమాలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డితో చేస్తాను. తొలిసారి తెలుగు మూవీలో ఒక కొరియన్ హీరోయిన్ను పరిచయం చేస్తున్నా. జున్ హ్యున్ జీ మా మూవీలో నటించడం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచినా, మా టీమ్ అందరికీ మాత్రం గొప్ప అవకాశంగా భావిస్తున్నా.' అని అన్నారు.
'వేదవ్యాస్' సినిమా కోసం తనను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్న దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు హీరోయిన్ జున్ హ్యూన్. 'ఇండియన్ కల్చర్ నేర్చుకుని ఈ సినిమాలో నటిస్తుండటం సంతోషంగా ఉంది. ఫస్ట్ టైమ్ ఇండియన్ మూవీలో సౌత్ కొరియా నుంచి హీరోయిన్‌గా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. నన్ను వెల్ కమ్ చేసిన దిల్ రాజు గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నా. ఈ మూవీతో నన్ను తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారని కోరుకుంటున్నా.' అని చెప్పారు.
Also Read: లుక్కు మార్చిన రాజ్ తరుణ్... 'గాడ్స్ అండ్ సోల్జర్'తో హిట్టు మీద గురి - టైటిల్ టీజర్ చూశారా?
ఈ కాంబో అంటేనే హిట్
ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి కాంబో అంటేనే సూపర్ హిట్ అని స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు. 'మేము బ్యాగులతో స్కూలుకు వెళ్లిన టైంలోనే ఎస్వీ గారు బ్లాక్ బస్టర్ హిట్స్ తీశారు. ఆయన ఓ ఇన్‌స్పిరేషన్. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు ఆయన ఓ బ్రాండ్.' అంటూ చెప్పారు. 'వేద వ్యాస్' సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు డైరెక్టర్ వివి వినాయక్, నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఎస్వీ కృష్ణారెడ్డికి ఈ మూవీతో మంచి విజయం దక్కాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రముఖ నటుడు మురళీమోహన్ తెలిపారు.
మరో 10 రోజుల్లో...
కొరియా వెళ్లి మూవీకి పర్ఫెక్ట్ హీరోయిన్ 'జున్ హ్యూన్ జీ'ని ఎంపిక చేసుకున్నామని ప్రొడ్యూసర్ కె.అచ్చిరెడ్డి తెలిపారు. ''వేదవ్యాస్' ఎస్వీ కృష్ణారెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్. సాయికుమార్, మురళీ మోహన్ వంటి ఆర్టిస్టులను కూడా పాత్రలకు సరిగ్గా సరిపోయేలా తీసుకున్నారు. హీరో ఎవరనేది మరో వారం పది రోజుల్లో వెల్లడిస్తాం. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభిస్తాం. విలన్‌గా చాలా సెర్చ్ చేసి మంగోలియన్ ఆర్టిస్ట్‌ను సెలెక్ట్ చేసుకున్నాం. విలన్ చాలా డిఫరెంట్‌గా ఉంటారు.' అని అన్నారు.
వేదవ్యాస్ నటీనటులు - జున్ హ్యున్ జీ, మురళీ మోహన్, సుమన్, సాయికుమార్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రఘుబాబు, పృథ్వీ, రాజశ్రీ నాయర్, విద్యుల్లేఖ రామన్, దేవి శ్రీ, నవీనా రెడ్డి, ఐమ్యాక్స్ వెంకట్, బేబి సహస్రశ్రీ, మాస్టర్ మురారి, మాస్టర్ మోక్షజ్ఞ, మాస్టర్ రాయన్, తదితరులు.
టెక్నికల్ టీమ్ - వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ - ఆకుల సునీల్, మేకప్ - రాఘవ రాపర్తి, కాస్ట్యూమ్స్ - గుబ్బల నరసింహారావు, చందాన రామకృష్ణ,
స్టిల్స్ - మనీషా ప్రసాద్, పబ్లిసిటీ డిజైనర్ - ధని ఏలె, ప్రొడక్షన్ కంట్రోలర్ - ఉదయభాస్కర్, లిరిక్ రైటర్స్ - భువనచంద్ర, డా.వెనిగళ్ల రాంబాబు, డ్యాన్స్ మాస్టర్ - సుచిత్ర చంద్రబోస్, ఎడిటర్ - ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ - బ్రహ్మ కడలి, డీవోపీ - శరత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - మేడపాటి శ్రీనివాస్ రెడ్డి, సమర్పణ - కె. అచ్చిరెడ్డి, నిర్మాత - కొమ్మూరి వి ప్రతాప్ రెడ్డి.






















