Shilpa Shirodkar: 'జటాధర'లో మహేష్ బాబు వదిన - ఫస్ట్ లుక్ రివీల్
Jatadhara: యంగ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ 'జటాధర' నుంచి మరో ఇంటెన్స్ లుక్ వచ్చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు వదిన శిల్పా శిరోద్కర్ రివీల్ చేయగా ఆకట్టుకుంటోంది.

Shilpa Shirodkar's First Look In Jatadhara Movie: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ సూపర్ నేచరల్ థ్రిల్లర్ 'జటాధర' రోజురోజుకూ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్, టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తుండగా... తాజాగా మరో లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
మహేష్ బాబు వదిన
ఈ మూవీలో మహేష్ బాబు వదిన శిల్పా శిరోద్కర్ కీలక పాత్ర పోషిస్తుండగా... భయపెట్టే ఆమె లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ మూవీతోనే శిల్పా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా... ఆమె 'శోభ' అనే పాత్రలో కనిపించనున్నారు. ఏవో పూజలు చేస్తున్నట్లుగా ఎగిసిపడే మంట ముందు కూర్చుని నాలుక బయటపెట్టి ఇంటెన్స్ లుక్‌లో భయపెట్టారు. దీంతో ఆమె పాత్రపై ఆసక్తి నెలకొంది.
View this post on Instagram
Also Read: సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు... వచ్చేది ఎవరు? వెనక్కి వెళ్లేది ఎవరు? హిట్టు కొట్టేది ఎవరు?
ఎప్పుడూ డిఫరెంట్ స్టోరీస్‌తో ఎంటర్‌టైన్ చేసే యంగ్ హీరో సుధీర్ బాబు కాస్త గ్యాప్ తర్వాత ఓ డిఫరెంట్ సర్వైవల్ థ్రిల్లర్ 'జటాధర'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాలకు థ్రిల్లింగ్ అంశాలతో ముడి పెట్టినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. వీరితో పాటే రైన్ అంజలి, శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తుండగా... జీ స్టూడియోస్ సమర్పణలో కే ఆర్ బన్సల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుధీర్ కెరీర్‌లోనే ఓ భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతుండగా... ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ వేరే లెవల్‌లో ఉంది.
స్టోరీ అదేనా?
దేశంలోనే ఓ ప్రముఖ ఆలయం చుట్టూ ఈ స్టోరీ సాగనున్నట్లు తెలుస్తుండగా... ఓ నిధి అన్వేషణ, దానికి కాపలాగా ఉండే ఓ పవర్... సాక్షాత్తు శివుని అవతారంలో ఉండే ఓ యువకుడు భారీ హైప్ క్రియేట్ చేశాయి. టీజర్‌లో సోనాక్షి సిన్హా లుక్, సుధీర్ బాబు ఎంట్రీతో ఎలివేషన్స్ అదిరిపోయాయి. ఓ కామన్ మ్యాన్ పవర్ ఫుల్ మహిళతో ఎందుకు పోరాడాల్సి వచ్చింది. అసలు ఆ నిధి వెనుక రహస్యం ఏంటి? ఆ ప్రముఖ ఆలయం ఎక్కడ ఉంది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. త్వరలోనే తెలుగుతో పాటు ఇతర భాషల్లోనే మూవీ రిలీజ్ కానుంది.






















