Suriya: కమెడియన్ డైరెక్టర్‌గా సూర్య కొత్త మూవీ - టైటిల్ ఏంటో తెలుసా?
Suriya 45 Movie: కోలీవుడ్ స్టార్ సూర్య కొత్త మూవీ టైటిల్‌ను తాజాగా ఫిక్స్ చేశారు. డైరెక్టర్ ఆర్జే బాలాజీ బర్త్ డే సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేస్తూ విషెష్ చెప్పారు.

Suriya Rj Balaji New Movie Title Announced: కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా తమిళ కమెడియన్ ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టైటిల్‌ను తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు. డైరెక్టర్ ఆర్జే బాలాజీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు విషెష్ చెబుతూ టైటిల్‌తో పాటు ఓ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు.
డిఫరెంట్ 'టైటిల్'
ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతుండగా.. 'కరుప్పు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. 'గర్వం, ఉత్సాహంతో మేము ఈ టైటిల్ అందిస్తున్నాం. 'కరుప్పు' మన కథ. మన ఆత్మను ప్రతిబింబించే పేరు.' అంటూ రాసుకొచ్చారు. సోషల్ మీడియా వేదికగా టైటిల్ పోస్టర్ షేర్ చేసిన సూర్య దర్శకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.
With pride and Excitement, we present the title of #Suriya45: 'KARUPPU'. A name that embodies the soul of our story, shaped by heart, spirit, and purpose. #கருப்பு #Karuppu💥
— DreamWarriorPictures (@DreamWarriorpic) June 20, 2025
Wishing a very Happy Birthday to our director @RJ_Balaji 💐@Suriya_offl @trishtrashers #Indrans… pic.twitter.com/xW3DD94Wfs
Also Read: హిట్ కాంబో రిపీట్ - 'హాయ్ నాన్న' డైరెక్టర్‌తో నేచురల్ స్టార్ నాని?.. ఎన్టీఆర్‌తో అనుకున్నారు కానీ..
20 ఏళ్ల తర్వాత సూర్యతో..
ఈ మూవీ సూర్య సరసన బ్యూటీ త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటే శివద, స్వాసిక, యోగిబాబు, నట్టి సుబ్రహ్మణ్యం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా మేకర్స్ మూవీ టైటిల్ అనౌన్స్ చేయడం సహా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చేతిలో ఆయుధంతో ఓ రహస్య ప్రదేశం మధ్యలో సూర్య నిలబడి ఉన్నట్లు పోస్టర్‌లో ఉండడం హైప్ క్రియేట్ చేస్తోంది.
ఈ ఏడాది చివర్లో రిలీజ్?
గతేడాది పొల్లాచ్చి సమీపంలోని ఆనైమలై ప్రాంతంలో ప్రసిద్ధ మాసానీ అమ్మన్ టెంపుల్‌లో పూజా కార్యక్రమాలతో మూవీ ప్రారంభమైంది. ఇప్పటికే షూటింగ్ జరుగుతుండగా.. తాజాగా టైటిల్ రిలీజ్ చేశారు. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఏడాదికి పైగా ఈ మూవీ స్క్రిప్ట్‌పై వర్క్ చేసినట్లు మూవీ టీం ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
రేడియా జాకీగా కెరీర్ ప్రారంభించిన ఆర్జే బాలాజీ.. యాక్టింగ్, సింగింగ్‌లోనే కాకుండా డైరెక్టర్‌గానూ సత్తా చాటారు. నయనతారతో 'మూకుత్తి అమ్మన్' (తెలుగులో అమ్మోరుతల్లి) తెరకెక్కించి మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత సత్య రాజ్‌తో 'వీట్ల విశేషం' మూవీ తీసి సక్సెస్ సాధించారు. ఇప్పుడు స్టార్ హీరో సూర్యతో 'కరుప్పు'తోనూ హ్యాట్రిక్ విజయం సాధించాలని చూస్తున్నారు. అటు.. సూర్య ఫస్ట్ తెలుగు మూవీ వెంకీ అట్లూరితో చేస్తున్నారు. కెరీర్ పరంగా మళ్లీ సరైన హిట్ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు.






















