అన్వేషించండి

Uppu Kappurambu: తెలుగులో వేమన పద్యం చెప్పిన కీర్తి సురేష్ - శ్మశానం ఫుల్.. ఎవరూ చావొద్దండి.. ఆసక్తికరంగా 'ఉప్పు కప్పురంబు' ట్రైలర్

Uppu Kappurambu Trailer: కీర్తి సురేష్, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఉప్పు కప్పురంబు' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా కీర్తి తెలుగులో వేమన పద్యం చెప్పడం మరింత అట్రాక్షన్‌గా నిలిచింది.

Keerthy Suresh Recited Uppu Kappurambu Poem: మహానటి కీర్తి సురేష్, యంగ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'ఉప్పు కప్పురంబు'. ఈ మూవీ ఎక్స్‌క్లూజివ్‌గా 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో జులై 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. గురువారం హైదరాబాద్‌లో ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా.. ఈవెంట్‌లో కీర్తి సురేష్, సుహాస్‌తో పాటు మూవీ టీం పాల్గొన్నారు.

తెలుగులో పద్యం చెప్పిన కీర్తి

ఈ సందర్భంగా మూవీ స్టోరీ గురించి చెబుతూ కీర్తి సురేష్.. 'ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు..' అంటూ వేమన పద్యాన్ని అలవోకగా తెలుగులో చెప్పారు. ఈ పద్యం లాగే తమ స్టోరీ ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కీర్తి తెలుగులో చక్కగా మాట్లాడతారని తెలుసని.. అయితే.. పద్యాలు కూడా చాలా బాగా చెబుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమెలో ఈ టాలెంట్ కూడా ఉందా? అంటూ ప్రశంసిస్తున్నారు.

Also Read: 'కుబేర' ఓటీటీ: ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసిన బిచ్చగాడి కథ... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

శ్మశానం ఫుల్.. ఎవరూ చావొద్దు

ఫుల్ సెటైరికల్ కామెడీ జానర్‌లో 'ఉప్పు కప్పురంబు' మూవీని తెరకెక్కించగా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 1990ల నాటి చిట్టి జయపురం గ్రామంలో శ్మశాన స్థలం కోసం జరిగిన పోరాటాన్ని కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు ట్రైలర్ బట్టి తెలుస్తోంది. గ్రామానికి సర్పంచ్‌గా కీర్తి సురేష్ కనిపించగా.. గ్రామంలో చనిపోయిన వారి మృతదేహాలు పూడ్చిపెట్టేందుకు స్థల సమస్య వస్తుంది. కేవలం నలుగురిని మాత్రమే పూడ్చి పెట్టేందుకు ఊరిలో ఖాళీ ఉంటుంది.

వాటి కోసం గ్రామస్థులు చేసే పోరాటం, లాటరీ తీయడం, ఘర్షణ పడడం, చివరకు ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ అని తెలుస్తోంది. ఓ సామాజిక సమస్యను సెటైరికల్, కామెడీ ఎంటర్‌టైనర్‌లో చూపించారు.

ఈ మూవీకి ఐవీ శశి దర్శకత్వం వహించగా.. ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధిక లావు నిర్మించారు. కీర్తి సురేష్, సుహాస్‌లతో పాటు బాబు మోహన్, శత్రు, తుల్లూరి రామేశ్వరి, శుభలేఖ సుధాకర్, విష్ణు, శివన్నారాయణ, దువ్వాసి మోహన్ కీలక పాత్రలు పోషించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో మూవీ అందుబాటులో ఉండనుంది.

డిఫరెంట్ స్టోరీ..

ఇప్పటివరకూ చాలా డార్క్ కామెడీ సినిమాలు వచ్చినా.. ఈ మూవీ అన్నింటి కంటే చాలా డిఫరెంట్‌గా ఉంటుందని అన్నారు కీర్తి సురేష్. ఫ్యామిలీ మొత్తం ఇంట్లో కూర్చుని హాయిగా నవ్వుకుంటూ సినిమా చూడొచ్చని.. ఓ సీరియస్ విషయాన్ని చాలా ఫన్నీగా చెప్పామన్నారు. విజయ్ దేవరకొండతో మూవీ చేస్తారా? అనే ప్రశ్నకు దిల్ రాజ్ సార్ చెబుతారంటూ ఆన్సర్ ఇచ్చారు కీర్తి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Railway Rules : రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
Embed widget