సూర్య హీరోగా నటించిన సినిమా ‘గజిని’. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే, ఈ సినిమాను సూర్య చేయడానికి ముందు 12 మంది హీరోలు రిజెక్ట్ చేశారు. ఇంతకీ ఆ 12 మంది హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం! ముందుగా ఈ సినిమా కథ అజిత్ కు చెప్పాడు మురుగదాస్. ఆయన రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత మాధవన్ కు కథ చెప్పాడు. తను కూడా నో చెప్పాడు. టాలీవుడ్ హీరో మహేష్ బాబు కు స్టోరీ వినిపించాడు. తను కూడా చేయలేను అన్నాడు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కథ విని, తనూ అంగీకరించలేదు. తమిళ హీరో విజయ్ కి కూడా కథ చెప్పాడు మురుగదాస్. తనూ కూడా ఒప్పుకోలేదు. విక్రమ్, రజనీకాంత్, వెంకటేష్, శింబు, అజయ్ దేవగణ్, సైఫ్ అలీఖాన్, మోహన్ లాల్ రిజెక్ట్ చేశారు. చివరకు ఈ సినిమా కథ సూర్యకు చెప్పాడు మురుగదాస్. సూర్యకు కథ బాగా నచ్చడంతో ఓకే చేశాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీని హిందీలోకి అమీర్ ఖాన్ రీమేక్ చేశాడు. Photos Credit: Surya/twitter