టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. పాన్ ఇండియన్ స్టార్ గా సత్తా చాటుతున్నాడు. తాజాగా ఆయన నటించిన ‘పుష్ప‘ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ప్రస్తుతం ‘పుష్ప2‘ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. అల్లు అర్జున్ దగ్గర ఎన్నో ఎక్స్ పెన్సివ్ థింగ్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి జాగ్వార్ XJ L కారు. వైట్ కలర్ లో ఉండే ఈ లగ్జరీ కారు ఖరీదు రూ. 1.25 కోట్లు. బన్నీ దగ్గరున్న మరో ఖరీదైన కారు రేంజ్ రోవర్ వోగ్. బీస్ట్ అని పిలుచుకునే దీని ధర రూ. 2 నుంచి రూ. 4 కోట్లు ఉంటుంది. అల్లు అర్జున్ దగ్గరున్న అత్యంత ఖరీదైన వెహికల్ ఫాల్కన్ వ్యానిటీ వ్యాన్. ఇది ఫుల్లీ కస్టమైజ్డ్ వెహికల్. ఈ వ్యాన్ లోపల ఇంట్లో మాదిరిగానే అన్ని సదుపాయాలుంటాయి. దీని ఖరీదు రూ. 7 కోట్లు. బన్నీ దగ్గరున్న మరో ఖరీదైన థింగ్ జూబ్లీహిల్స్ లోని ఆయన ఇల్లు. గార్డెన్, స్విమ్మింగ్ పూల్ సహా సకల సదుపాయాలతో కస్టమైజ్డ్ గా నిర్మించిన ఈ ఇల్లు ఖరీదు రూ. 100 కోట్లు Photos Credit: Allu Arjun/twitter