కృష్ణ మరణంతో ఘట్టమనేని ఫ్యామిలీ విషాదంలో ఉంది. ఆయన్ను తలుచుకుంటూ ఉద్వేగానికి లోనవుతున్నారు. కృష్ణ మరణం తర్వాత... ఆయన గురించి మనవరాలు సితార ఎమోషనల్ పోస్ట్ చేశారు. తాతయ్య ఎన్నో విలువైన విషయాలు నేర్పించారని, నవ్వించారని, ఇప్పుడు అవన్నీ జ్ఞాపకాలుగా గుర్తుంటాయని సితార అన్నారు. ఇప్పుడు వీకెండ్ గెట్ టుగెథెర్, లంచ్ ఇంతకు ముందులా ఉండవని సితార ఉద్వేగానికి లోనయ్యారు. తాతయ్య తన హీరో అని చెప్పిన సితార, ఆయన గర్వపడే స్థాయికి చేరుకుంటానని చెప్పారు. మిస్ యు తాత గారు అంటూ సితార చేసిన పోస్ట్ నెటిజన్స్ హృదయాన్ని కదిలించింది. నానమ్మ ఇందిరా దేవి మరణించిన సమయంలో కూడా సితార ఎమోషనల్ అయ్యారు. వెక్కి వెక్కి ఏడ్చారు. 'ఎప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తుంటా తాతయ్యా... మిస్ యు' అని మహేష్ కుమారుడు గౌతమ్ పోస్ట్ చేశారు. కృష్ణ అంతిమ కార్యక్రమాల దగ్గర గౌతమ్, సితార ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మామగారు కృష్ణకు నివాళులు అర్పిస్తున్న మహేష్ బాబు సతీమణి నమ్రత