By: ABP Desam | Updated at : 04 Mar 2022 03:44 PM (IST)
సురేఖా వాణి (Image courtesy - @artist_surekhavani/Instagram)
ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో సురేఖా వాణి ఒకరు. సినిమాల్లో మాత్రమే కాదు, సోషల్ మీడియాలోనూ ఆమె సందడి చేస్తుంటారు. అమ్మాయి సుప్రీతతో కలిసి రీల్స్ చేస్తుంటారు. మోడ్రన్ దుస్తుల్లో హల్ చల్ చేస్తుంటారు. ప్రేక్షకుల్లో ఆమెకు ఉన్న క్రేజ్ క్యాష్ చేసుకోవాలని ఓ కేటుగాడు వలపు వల వేయడం ప్రారంభించాడు. ఆమె పేరుతో కొందరికి వాట్సాప్ మెసేజ్ లు పంపించాడు. ఈ విషయం తెలిసిన సురేఖా వాణి ప్రజలను అలర్ట్ చేశారు.
"దయచేసి ఈ నంబర్ నుంచి ఫోనులు, మెసేజ్ లు వస్తే స్పందించకండి. ఇది నా నంబర్ కాదు. ఎవరో సోషల్ మీడియాలో కొన్ని పేజీలకు నా పేరుతో మెసేజ్ చేసి పర్సనల్ డీటెయిల్స్ అడుగుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. మీ పర్సనల్ నంబర్స్ గానీ, నా పర్సనల్ నంబర్ గానీ షేర్ చేయకండి. ఎటువంటి ట్రాన్సాక్షన్స్ (డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం) వంటివి చేయవద్దు. బీ అలర్ట్" అని సురేఖా వాణి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొన్నారు.
Also Read: ముద్దులు, హగ్గులతో చాలా ఇబ్బంది పడ్డా - సురేఖా వాణి కుమార్తె సుప్రీత రియాక్షన్
ఫేస్ బుక్, ట్విట్టర్‌లో తనకు అకౌంట్స్ లేవని, తన పేరు మీద ఉన్న ఖాతాలను ఫాలో అవ్వవద్దని ప్రేక్షకులను సురేఖా వాణి అలర్ట్ చేశారు. గతంలో కూడా ఈ విషయం చెప్పానని, మరోసారి చెబుతున్నానని ఆమె పేర్కొన్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ పేజీలకు రెస్పాండ్ అవ్వవద్దని ఆమె కోరారు.
Also Read: 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' రివ్యూ: ఫస్టాఫ్ హిట్టు - సెకండాఫ్ గురించి మీకు అర్థమవుతోందా?
Godse Movie Release Date: సత్యదేవ్ 'గాడ్సే' రిలీజ్ డేట్ మారింది!
Major Movie: 'మేజర్' నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ - విన్నారా?
Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు
Anil Ravipudi: ఎన్టీఆర్ తో సినిమా - అనిల్ రావిపూడి ఏమన్నారంటే?
Prey Teaser: ‘ప్రే’ టీజర్ చూశారా? మరింత భయానకంగా ప్రిడేటర్ ప్రీక్వెల్
Konaseema District: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం - కోనసీమ జిల్లా పేరు మార్చాలని నిర్ణయం, కొత్త పేరు ఏంటంటే !
KKR vs LSG Preview: గెలిచి ప్లేఆఫ్స్ వెళ్తారా? ఓడి టెన్షన్ పడతారా!
Divorce Case: భార్య సంపాదిస్తున్నా భరణం ఇవ్వాల్సిందే- విడాకుల కేసులో బొంబాయి హైకోర్టు సంచలన తీర్పు
YSRCP Rajya Sabha: తెలంగాణ వ్యక్తుల్ని రాజ్యసభ పదవుల నుంచి తొలగించండి - సీఎం జగన్‌కు ఏపీ నిరుద్యోగ జేఏసీ నిరసన సెగ