Supriya Prithviraj Sukumaran: ‘సలార్’ షూటింగ్ ఫోటోలను షేర్ చేసిన పృథ్విరాజ్ భార్య - ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్
Prithviraj Sukumaran: ‘సలార్’ చిత్రంలో వరద రాజా మానార్ పాత్రలో నటించిన పృథ్విరాజ్ సుకుమారన్.. భార్య ఈ మూవీ షూటింగ్ ఫోటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.
Salaar Movie: ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘సలార్ పార్ట్ 1 సీజ్‌ఫైర్’ డిసెంబర్ 22న థియేటర్లలో విడుదలయ్యి ప్రేక్షకుల చేత పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదలకు ముందు ‘సలార్’ టీమ్ పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. ఇందులో లీడ్ రోల్స్ చేసిన ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్‌తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ కలిసి రాజమౌళితో ఒకేఒక్క ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులోని చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అదే సమయంలో తన భార్య తరచుగా ‘సలార్’ సెట్స్‌కు వచ్చేదని పృథ్విరాజ్ రివీల్ చేశాడు. వెంటనే చాలామంది నెటిజన్లు.. పృథ్విరాజ్ భార్య సుప్రియను సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. దీంతో తన ఇన్‌స్టాగ్రామ్‌లోని ‘సలార్’ షూటింగ్ ఫోటోలు అంతటా వైరల్ అయ్యాయి.
షూటింగ్ ఫోటోలు..
తన భర్త పృథ్విరాజ్ సుకుమారన్.. ప్రభాస్‌లాంటి స్టార్‌తో నటిస్తున్నందుకు, ‘సలార్’లాంటి పాన్ ఇండియా మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నందుకు సుప్రియ సంతోషం వ్యక్తం చేసింది. అదే సంతోషంతో తను ‘సలార్’ షూటింగ్‌కు వెళ్లిన ఫోటోలను ఒక రీల్‌గా చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘‘సలార్ షూటింగ్ లొకేషన్‌లో ప్రభాస్, టిన్ను ఆనంద్, నా అమేజింగ్ భర్త పృథ్విరాజ్‌తో అందమైన థ్రోబ్యాక్ ఫోటోలు. డిసెంబర్ 22న ఈ మ్యాజిక్‌ను స్క్రీన్‌పై చూడడానికి ఎదురుచూస్తున్నాను. ఈ యాక్షన్ డ్రామాను మిస్ చేయకండి’’ అంటూ విడుదలకు ముందు ఫోటోలతో పాటు క్యాప్షన్‌ను షేర్ చేసింది సుప్రియ పృథ్విరాజ్. అంతే కాకుండా విడుదల తర్వాత కూడా మరికొన్ని ఫోటోలను షేర్ చేస్తూ తన భర్తను ప్రశంసల్లో ముంచేసింది.
View this post on Instagram
ఇది మీ ప్రపంచం..
‘‘నా ఫేవరెట్ వరద రాజా మానార్‌తో’ అంటూ పృథ్విరాజ్ సుకుమారన్‌తో ఫోటోలు షేర్ చేసిన సుప్రియ.. ‘సలార్’ గురించి అద్భుతంగా క్యాప్షన్ పెట్టింది. ‘సలార్’ను చూస్తున్నంతసేపు చాలా ఆనందంగా అనిపించింది. అందరి పర్ఫార్మెన్స్‌లు చాలా అద్భుతంగా ఉన్నాయి. మ్యూజిక్, ఆర్ట్ డైరెక్షన్, సినిమాటోగ్రాఫీ అందంగా ఉన్నాయి. ప్రశాంత్ నీల్ సార్‌కు ధన్యవాదాలు. ఇది మీ ప్రపంచం.. మేమంతా అందులో జీవిస్తున్నాం. ప్రభాస్ గారు అయితే జస్ట్ వావ్. అందరూ తమ దగ్గర ఉన్న థియేటర్లలో ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను’’ అంటూ సుప్రియ పథ్విరాజ్ పోస్ట్‌ను షేర్ చేసింది.
View this post on Instagram
ప్రభాస్‌తో సమానంగా..
‘సలార్’ కోసం ‘ఖాన్సార్’ అనే సిటీని సృష్టించాడు ప్రశాంత్ నీల్. మూవీ షూటింగ్ అంతా దాదాపుగా ఆ సెట్‌లోనే జరిగింది. ఇక సుప్రియ షేర్ చేసిన ఫోటోలు కూడా ఖాన్సార్ సెట్ నుండే అని అర్థమవుతోంది. సుప్రియ మాత్రమే కాదు.. ఈ సినిమా చూసిన చాలామంది ప్రేక్షకులు.. ప్రభాస్‌తో పృథ్విరాజ్ సుకుమారన్ పర్ఫార్మెన్స్‌ను కూడా ప్రశంసిస్తున్నారు. మలయాళంలో వర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న పృథ్వికి ‘సలార్’ వల్ల తెలుగులో కూడా ఫ్యాన్స్ ఏర్పడుతున్నారు. దేవగా ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత బాగుందో.. వరద రాజా మానార్‌గా పృథ్విరాజ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అంతే ప్రభావం చూపిస్తుందని సినిమా చూసిన ఆడియన్స్ రివ్యూ ఇస్తున్నారు. చాలాకాలం తర్వాత తమ అభిమాన హీరోకు హిట్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
Also Read: ఆ మూడు చిత్రాల రికార్ట్స్‌ను బ్రేక్ చేసిన ‘సలార్’, ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?