అన్వేషించండి

Vettaiyan Shooting: కడపలో రజనీకాంత్ సందడి, ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండ్ లో 'వెట్టయాన్' యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

కడప జిల్లాలో రజనీకాంత్ ‘వెట్టయాన్‘ మూవీ షూటింగ్ కొనసాగుతోంది. తాజాగా ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండ్ లో యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారు. సినిమా షూటింగ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.

Rajinikanth Vettaiyan Movie Shooting in Kadapa: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన తాజాగా నటించిన ‘లాల్ సలాం‘ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ‘వెట్టయాన్‘ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సౌత్ నుంచి నార్త్ వరకు పలువురు స్టార్ హీరోలు కీలక పాత్రలు పోషించబోతున్నారు. తెలుగు నుంచి రానా ద‌గ్గుబాటి ఈ మూవీలో నటిస్తుండగా, మ‌లయాళం నుంచి ఫ‌హాద్ ఫాజిల్‌ కనిపించనున్నారు. ఈ చిత్రంలో మంజూ వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నుంచి లెజెండ‌రీ న‌టుడు అమితాబ‌చ్చ‌న్, విశ్వనటుడు కమల్ హాసన్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. పలువురు అగ్ర తారలు ఈ సినిమాలో భాగస్వామ్యం కావడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

కడప జిల్లాలో ‘వెట్టయాన్’ షూటింగ్

ప్రస్తుతం ‘వెట్టయాన్‘ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఏపీలోని కడప జిల్లాలో గత కొద్ది రోజులుగా  సినిమా చిత్రీకరిస్తున్నారు. తాజాగా ప్రొద్దుటూరు బస్టాండ్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. బస్టాండ్ లోకి పోలీస్ వాహనం వచ్చి ఆగినట్లు చూపించారు.  సూపర్ స్టార్ సినిమా చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆయన  అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సినిమా షూటింగ్ కోసం జనవరి 30న రజనీకాంత్ ఆంధ్రపదేశ్ కు వచ్చారు. తొలి రోజు జమ్మలమడుగులో షూటింగ్ కొనసాగించారు. ఆ తర్వాత ఎర్రగుంట్ల ప్రాంతంలో ఉన్న గ్రానైట్ క్వారీలో సినిమాను షూట్ చేశారు. రజనీకాంత్, ఫహాద్ ఫాజిల్, రితిక సింగ్, కృష్ణుడు మీద కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అక్కడికి వచ్చిన అభిమానులకు రజనీకాంత్ చెయ్యి ఊపుతూ అభివాదం చేశారు. అందరికీ నమస్కారం పెట్టారు.  

రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా టైటిల్ టీజర్ విడుదల

ఇప్పటికే రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా  టైటిల్ టీజర్ ను విడుదల చేశారు.  ఈ సినిమాకు ‘వెట్టయాన్‘ అనే పేరును ఖరారు చేశారు. ‘వెట్టయాన్‘  అంటే తెలుగులో వేటగాడు అని అర్థం. నిమిషం పాటు ఉన్న ఈ టైటిల్ టీజర్ లో రజనీ తన మార్క్ నటనతో మెస్మరైజ్ చేశారు.  “వేట మొదలైనప్పుడు వేటాడ్డం తప్పదు” అంటూ రజనీ చెప్పే డైలాగ్   ఆకట్టుకుంటుంది.  ఇక ఈ సినిమా ఓ బూటకపు ఎన్ కౌంటర్ కథాంశంతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. 

‘వెట్టయాన్’పై భారీ అంచనాలు

రజనీకాంత్, జ్ఞానవేల్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జైలర్’ మూవీతో రజనీకాంత్, ‘జైభీమ్’ సినిమాతో జ్ఞానవేల్ మంచి విజయాలను అందుకున్నారు. వీరిద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులలలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్‌ను సంగీతం అందిస్తున్నారు. 

Read Also: బూట్‌కట్ బాలరాజు రివ్యూ: సోహైల్ ఏడ్చారు, మోకాళ్ల మీద కూర్చుని రిక్వెస్ట్ చేశారు - మరి, సినిమా ఎలా ఉంది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tiger Attacked In Komaram Bheem District: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger Attacked In Komaram Bheem District: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
Embed widget