News
News
వీడియోలు ఆటలు
X

Mosagallaku Mosagadu Rerelease: కృష్ణ అభిమానులకు గుడ్‌న్యూస్ - 4K క్వాలిటీతో ‘మోసగాళ్లకు మోసగాడు’ రీరిలీజ్, ఎప్పుడో తెలుసా?

దివంగత టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ నటించిన తొలి తెలుగు కౌబాయ్ చిత్రం 'మోసగాళ్లకు మోసగాడు'. మే 31న ఆయన జయంతి సందర్భంగా ఈ మూవీ రీరిలీజ్ కాబోతోంది.

FOLLOW US: 
Share:

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు దివంగత సూపర్ స్టార్ కృష్ణ. టాలీవుడ్ లో ఆయన ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. తెలుగు సినిమాలకు సరికొత్త టెక్నాలజీ హంగులు తీసుకొచ్చిచ్చారు. తొలిసారి తెలుగు తెరకు కౌబాయ్ చిత్రాన్ని పరిచయం చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. సుమారు 5 దశాబ్దాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది.  పద్మాలయా స్టూడియోస్  బ్యానర్ మీద నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

మే 31న ‘మోసగాళ్లకు మోసగాడు’ రీరిలీజ్

తెలుగునాట ఓ ప్రత్యేక సంతరించుకున్న 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రం రీరిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నెల 31న ఆయన జయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 4K టెక్నాలజీతో ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు నిర్మాత ఆది శేషగిరిరావు. ''పద్మాలయ సంస్థకు ఫౌండేషన్ ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా. మా బ్యానర్‌ లో ఎన్ని సినిమాలు తెరకెక్కాయి. చాలా సినిమాలు అద్భుత విజయాలను అందుకున్నాయి. ఎన్ని సినిమాలు వచ్చినా, ఎంత అద్భుత విజయాలు అందుకున్నా, ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా చాలా ప్రత్యేకం. కృష్ణ గారి జయంతికి నివాళిగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నాం” అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ్, బి గోపాల్, అశ్వినిదత్, నిర్మాత రామలింగేశ్వర రావు పాల్గొన్నారు.  తదితరులు  పాల్గొన్నారు.

63 దేశాల్లో సంచలన విజయం సాధించిన చిత్రం ఇది

‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం ఐదు దశాబ్దాల క్రితమే తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి చాటి చెప్పింది. అప్పట్లోనే ఈ సినిమా ఏకంగా 63 దేశాల్లో విడుదలైంది. అంతకు ముందు భారతీయ సినీ పరిశ్రమలో ఏ హీరోకు సంబంధించిన చిత్రం అన్ని దేశాల్లో విడుదల కాలేదు. కృష్ణ సినీ కెరీర్ తో పాటు దేశ సినీ చరిత్రలోనే అరుదైన ఘనత సాధించింది. ఈ  కౌబాయ్ సినిమాను ‘మేకనస్ గోల్డ్’ అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా రూపొందించారు. వసూళ్ల పరంగా ఈ సినిమా అద్భుతాలు చేసింది. అప్పటి వరకు తెలుగు సినిమా అంటే జానపద, పౌరాణిక చిత్రాలు ఉండేవి. ఒక్కసారిగా హాలీవుడ్ రేంజి సినిమాను చూపించారు సూపర్ స్టార్ కృష్ణ. ఈ సినిమాను వెండి తెరపై చూసి ప్రేక్షకులు మైమరిచిపోయారు.

ఇక ఈ సినిమాను అప్పట్లో రూ. 8 లక్షల బడ్జెట్ తో తెరకెక్కించారు. కేవలం 28 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ముందుగా 35 సెంటర్లలో విడుదలై అద్భుత విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ సినిమాను హిందీతో పాటు తమిళ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేశారు. అక్కడ కూడా కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకుంది.  ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా 63 దేశాలలో ఈ చిత్రం విడుదలై సరికొత్త రికార్డులు నెలకొల్పింది.

Read Also: ఖరీదైన బ్యాగ్‌తో కనిపించిన మహేష్ బాబు, దాని ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవ్వాల్సిందే!

Published at : 01 May 2023 04:47 PM (IST) Tags: SuperStar Krishna Krishna Birth Anniversary Mosagallaku Mosagadu Movie Mosagallaku Mosagadu Re-Release

సంబంధిత కథనాలు

శ్రీకాంత్ అడ్డాల సెన్సేషనల్ ప్రాజెక్ట్ 'పెదకాపు' - ఆసక్తికరంగా ఫస్ట్ లుక్!

శ్రీకాంత్ అడ్డాల సెన్సేషనల్ ప్రాజెక్ట్ 'పెదకాపు' - ఆసక్తికరంగా ఫస్ట్ లుక్!

మంచువారి రూ.100 కోట్ల సినిమా, మెగా ఇంట పెళ్లి భాజాలు - ఇంకా మరెన్నో సినీ విశేషాలు

మంచువారి రూ.100 కోట్ల సినిమా, మెగా ఇంట పెళ్లి భాజాలు - ఇంకా మరెన్నో సినీ విశేషాలు

Ram Charan: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం - రామ్ చరణ్ స్పెషల్ ట్వీట్

Ram Charan: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం - రామ్ చరణ్ స్పెషల్ ట్వీట్

Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్

Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్

Bhola Mania Song Promo : భోళా శంకరుడి మేనియా షురూ - ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

Bhola Mania Song Promo : భోళా శంకరుడి మేనియా షురూ - ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !

YS Viveka Case  : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ -  సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే   !

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం