Sunil Shetty: ఎప్పుడూ విలనే... అందుకే సౌత్ సినిమాలు చేయట్లేదు - సునీల్ శెట్టి వైరల్ కామెంట్స్
సునీల్ శెట్టి దక్షిణాది సినిమాలను తిరస్కరించడానికి కారణం చెప్పారు. బాలీవుడ్ నటులకు విలన్ రోల్స్ ఇవ్వడమే అందుకు కారణమని ఆయన తెలిపారు.

బాలీవుడ్ నటులు చాలా మంది దక్షిణాది చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ నుండి బాబీ డియోల్, జాన్వీ కపూర్ వరకు చాలా మంది బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ సునీల్ శెట్టి దక్షిణాది సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపడం లేదు. ఆయన స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. దక్షిణాది సినిమాలను తిరస్కరిస్తున్నానని చెప్పారు.
హిందీలో ఓ మీడియాకు ఒక ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి మాట్లాడుతూ... ''నాకు దక్షిణాది సినిమాల్లో నెగెటివ్ రోల్స్ వస్తున్నాయి. వాటిని తిరస్కరిస్తున్నాను'' అని చెప్పారు. దురదృష్టవశాత్తు తనకు విలన్ పాత్రలే వస్తున్నాయని, వారు హిందీ హీరోలను విలన్ కోణంలో చూపించాలని అనుకుంటున్నారని, అది ప్రేక్షకులకు బాగుంటుంది కానీ తనకు నచ్చనిది అదేనని తెలిపారు.
ఇంతకు ముందు సునీల్ శెట్టి ఓ దక్షిణాది సినిమాలో నటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్షన్ థ్రిల్లర్ 'దర్బార్'లో నెగెటివ్ రోల్ చేశారు. ఆ సినిమా 2020లో విడుదలైంది. అందులో నయనతార కూడా నటించింది. ఈ నేపథ్యంలో సునీల్ శెట్టి 'దర్బార్'లో నటించడానికి గల కారణాన్ని కూడా వివరించారు. తాను ఆ సినిమాను కేవలం రజనీకాంత్ కోసం మాత్రమే చేశానని ఆయన వెల్లడించారు. సునీల్ మాట్లాడుతూ... ''నేను రజనీ సర్ తో ఒక సినిమా చేశాను. ఎందుకంటే నేను ఆయనతో కలిసి పనిచేయాలని అనుకున్నాను'' అని చెప్పారు.





















