Prasanna Vadanam Movie: ఓటీటీకి వచ్చేస్తున్న రీసెంట్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
Prasanna Vadanam OTT Details: యాక్టర్ సుహాన్ నటించిన రీసెంట్ హిట్ మూవీ 'ప్రసన్న వదనం' అప్పుడే ఓటీటీకి రాబోతుంది. మే 3న రిలీజైన ఈ సినిమా ఈ ఓటీటీలోకి రాబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది.

Suhas Prasanna Vadanam Movie OTT Streaming Details: ఈ మధ్య తెలుగులో టాలంటెడ్ నటుడు సుహాస్ పేరు బాగా వినిపిస్తుంది. సైలెంట్‌గా సినిమాలు చేస్తూ బాక్సాఫీసు వద్ద సక్సెస్‌తో రిసౌండ్ చేస్తున్నాడు. స్టార్ హీరో చిత్రాల్లో సహానటుడి పాత్రల చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా హీరోగా మెప్పిస్తూ బ్లాకబస్టర్ హిట్స్ కొడుతున్నాడు. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టిన సుహాస్ లేటెస్ట్‌గా ప్రసన్న వదనం చిత్రంతో మరో హిట్ కొట్టాడు. ఇటీవల థియేటర్లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అయ్యింది.
ఫేస్ బ్లైండ్‌నెస్ అనే సరికొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం ఓ వర్గం ఆడియన్స్‌కి కనెక్ట్ కాలేకపోయింది. దీంతో బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ రివ్యూస్ తెచ్చుకున్న 'ప్రసన్న వదనం' మూవీ కలెక్షన్స్ మాత్రమే బాగానే చేసింది. దీంతో ఈ సినిమాతోనూ సుహాస్ మరో విజయం అందుకున్నాడు. క్రైం థ్రిల్లర్ డ్రామాగా మే 3న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో విడుదల కాబోతుంది. మే 24 నుంచి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీనిపై ఆహా అధికారిక ప్రకటన ఇచ్చింది. విడుదలైన మూడు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీకి రావడం విశేషం.
View this post on Instagram
స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్‌గా పనిచేసిన అర్జున్ వై కె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మణికంఠ, టీఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్లుగా నటించారు. క్రైం, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ట్విస్ట్స్, సస్పెన్స్ బాగున్నాయని ఆడియన్స్ నుంచి రివ్యూ వచ్చింది. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయిందంటూ రివ్యూస్ వచ్చాయి. మొట్ట మొదటి సారిగా ఫేస్ బ్లైండ్‌నెస్ అనే సరికొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాపై విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక థియేటర్లో మిక్స్‌డ్ రివ్యూస్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
Before You Go
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
ట్రెండింగ్ వార్తలు






















