అన్వేషించండి

Mama Mascheendra OTT Release: రిలీజైన రెండు వారాలకే OTTకి వచ్చేస్తున్న మూవీ.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఇదే

సుధీర్ బాబు హీరోగా నటించిన 'మామా మశ్చీంద్ర' సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశ పరిచింది. అయితే ఈ చిత్రాన్ని రెండు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు.  

సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'మామా మశ్చీంద్ర'. నటుడు, రచయిత హర్షవర్ధన్ ఈ యాక్షన్ థ్రిల్లర్​కి దర్శకత్వం వహించారు. గత శుక్రవారం థియేటర్స్​లోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రమోషన్స్ పెద్దగా చేయకపోవడం, మౌత్ టాక్ కూడా ఏమంత బాగాలేకపోవడంతో ఓపెనింగ్స్ మరీ దారుణంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండు వారాలు అవ్వకుండానే డిజిటల్ స్ట్రీమింగ్​కు రెడీ అయిపోతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్​గా మారింది. 
 
'మామా మశ్చీంద్ర' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్​ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకుంది. తాజాగా ఈ మూవీ ప్రీమియర్ డేట్​ను అనౌన్స్ చేశారు. దసరా ఫెస్టివల్ స్పెషల్​గా అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా అక్టోబర్ 6వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అంటే సరిగ్గా రెండు వారాలకే డిజిటల్ వేదిక మీదకు వచ్చేస్తోందన్నమాట. ప్రైమ్​తో పాటుగా ఆహా వీడియో ఓటీటీలోనూ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. 

డిజిటల్ హక్కుల రేట్లు పెరగడం, ఓటీటీల హవా మొదలైన తర్వాత సినిమాలను కాస్త ఎర్లీగా స్ట్రీమింగ్‌ చేయడం మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో దాదాపు అన్ని చిత్రాలూ నాలుగు వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఏవో ఒకటీ అర భారీ బడ్జెట్ బ్లాక్ బస్టర్ సినిమాలు మాత్రం 8 వారాలకు డిజిటల్ రిలీజ్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు 'మామా మశ్చీంద్ర' చిత్రాన్ని కేవలం 15 రోజుల్లోనే స్ట్రీమింగ్​కు రెడీ అవుతుండటం.. అది కూడా థియేటర్ అయిన మూడు రోజుల్లోనే ఓటీటీ ప్రీమియర్ డేట్ ఇవ్వడం, పైగా ఈ సినిమా నిర్మాత ఎన్నో థియేటర్లు కలిగిన ప్రముఖ ఎగ్జిబిటర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. 

Also Read: నేను రాసిన దానికంటే బాలయ్య 1000 రెట్లు అద్భుతంగా నటించారు: అనిల్‌ రావిపూడి

సుధీర్ బాబు కెరీర్​లో 15వ చిత్రం 'మామా మశ్చీంద్ర'. ఒకే పోలిక‌ల‌తో ఉన్న ముగ్గురు వ్య‌క్తుల క‌థ‌తో ఈ సినిమాను రూపొందించారు. ఇందులో సుధీర్ మూడు విభిన్నమైన పాత్రలలో నటించి ఆకట్టుకున్నారు. అయితే అతని కష్టానికి తగిన ఫలితం దక్కలేదు. న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కినా స్టోరీ జనాలకు కనెక్ట్ కాకపోవడం, స‌రైన ప్ర‌మోష‌న్స్ లేక‌పోవ‌డంతో మూడు రోజులు కూడా థియేట‌ర్ల‌లో నిల‌బ‌డ‌లేక‌పోయింది. రెండో రోజు నుంచే థియేటర్ ఆక్యుపెన్సీ పూర్తిగా పడిపోవడంతో చాలా షోలు క్యాన్సిల్ చెయ్యాల్సి వచ్చింది. దీంతో సుధీర్ కెరీర్​లో మరో జీరో షేర్ కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచిపోయింది. అంతటి డిజాస్టర్​ కాబట్టే ఈ చిత్రాన్ని రెండు వారాలకే ఓటీటీలోకి తీసుకొస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

'మామా మశ్చీంద్ర' చిత్రంలో మృణాళిని రవి, ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటించారు. హర్ష వర్ధన్, అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి కిరణ్, తదితరులు ఇతర పాత్రలు పోషించారు. నారాయణదాస్ నారంగ్ & సృష్టి సెల్యులాయిడ్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. థియేటర్లలో నిరాశ పరిచిన ఈ సినిమాకి ఓటీటీలో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

Also Read: 'నా లైఫ్​లో లేని అనుభవాలను బాలయ్యగారు ఇచ్చారు'

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Hemant Soren: ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Bachhala Malli Teaser: 'బచ్చల మల్లి' టీజర్ వచ్చేసింది... నచ్చినట్టు బతుకుతా - మాసీ యాక్షన్ రోల్‌లో నరేష్ ఉగ్రరూపం
'బచ్చల మల్లి' టీజర్ వచ్చేసింది... నచ్చినట్టు బతుకుతా - మాసీ యాక్షన్ రోల్‌లో నరేష్ ఉగ్రరూపం
Embed widget