Manju Warrier: పబ్లిక్‌లో హీరోయిన్ నడుము గిల్లేశాడు... నలుగురిలో నటికి చేదు అనుభవం
Manju Warrier mobbed video: ఆకతాయిలు అమ్మాయిలను ఏ విధంగా ఏడిపిస్తారు, ఇబ్బంది పెడతారు అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. పబ్లిక్‌లో హీరోయిన్ నడుము గిల్లేశాడో ఆకతాయి. ఆ వీడియో వైరల్ అవుతోంది.

ఆకతాయిల చేతిలో ప్రతి రోజూ ఇబ్బందులు పడుతున్న ఆడ పిల్లలు ఎంతో మంది! నాలుగు గోడల మధ్య ఉన్నామా? నలుగురి మధ్య ఉన్నామా? అనేది ఆకతాయిలకు అనవసరం. ఆడ పిల్లలు కనిపిస్తే ఏదో ఒకటి చేస్తున్నారు. సగటు సాధారణ అమ్మాయిలకు మాత్రమే కాదు... సెలబ్రిటీలకు సైతం వేధింపులు తప్పడం లేదు. అందుకు ఉదాహరణ ఇది.
నలుగురిలో హీరోయిన్ నడుము గిల్లేశాడు
మంజు వారియర్... తెలుగులోనూ కొంతమంది ప్రేక్షకులకు ఈ హీరోయిన్ తెలుసు. మలయాళంలో అయితే ఆవిడ స్టార్. తమిళంలోనూ పలు హిట్ సినిమాలు చేశారు. తెలుగు ప్రేక్షకులకు వెంటనే గుర్తుకు రావాలంటే... మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన 'లూసిఫర్', 'ఎల్ 2 ఎంపురాన్' సినిమాలలో సిస్టర్ రోల్ చేశారు.
మంజు వారియర్ ఒక షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి వెళ్లారు. స్టార్ హీరోయిన్ కావడంతో ఆవిడను చూసేందుకు అభిమానులు, కేరళ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. కార్యక్రమం అయిన తర్వాత అక్కడి నుంచి వెళ్లే ముందు కారు దగ్గర నిలబడి అందరికీ అభివాదం చేసే సమయంలో... ఒక ఆకతాయి మంజు వారియర్ నడుము గిల్లాడు. కెమెరాలో గనక రికార్డ్ అవ్వకపోతే ఆ విషయం చెప్పినా ఎవరూ నమ్మేవారు కాదేమో. హీరోయిన్ కావాలని ఆరోపించినట్టు ఉండేది. ఆ వీడియో కింద ట్వీట్‌లో చూడండి.
Awful behaviour from the crowd having no sense of boundary or respect towards the actress !#ManjuWarrier pic.twitter.com/6YYEpCDUQu
— Mollywood BoxOffice (@MollywoodBo1) May 2, 2025
నలుగురిలో తనకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైనా సరే... ముఖంలో చిరునవ్వు చెరగనివ్వలేదు మంజు వారియర్. ఒక్కరు చేసిన పనికి అక్కడ ఉన్న అందరిపై ఆగ్రహం వ్యక్తం చేయడం సబబు కాదు అనుకున్నారో? లేదంటే మిగతా వాళ్లను ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకున్నారో? నవ్వుతూ నిలబడ్డారు. ఆ తరువాత కూడా కొంతమంది అభిమానులు సెల్ఫీలు అడిగితే వాళ్ల ఫోన్ తీసుకుని మరి ఫోటోలు దిగి ఇచ్చారు. మంజు వారియర్‌కు ఎదురైన చేదు అనుభవం, వేధింపుల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: కిస్ నుంచి బెడ్, హగ్ వరకూ... విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్'లో మొదటి పాట 'హృదయం లోపల...' చూశారా?





















