Allu Arjun: నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా... అల్లు అర్జున్ టీ షర్ట్ మీద క్యాప్షన్ చూశారా? బ్రహ్మి ఫోటోలతో నెట్టింట రచ్చ రచ్చ
Nellore Pedda Reddy Taluka t shirt: 'ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ' - కామెడీ కింగ్ బ్రహ్మానందం చెప్పిన ఈ టైంలో ఎంత పాపులర్ తెలిసిందే. అల్లు అర్జున్ వల్ల మరోసారి వైరల్ అవుతోంది.

'నేను ఎవరో తెలుసా మీకు? నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా... మీకు నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియదా? ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ' - అనగనగా ఒక రోజు సినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం చెప్పిన ఈ డైలాగ్, ఆ సీన్ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ఇప్పటికీ ఆ కామెడీ సీన్ చూసే వాళ్ళు ఉన్నారు. ఇక మీమ్స్, ట్రోల్స్ చేసే క్రియేటర్ల వాడకం మామూలుగా ఉండదు. అది వైరల్ కంటెంట్. ఇప్పుడు మరొకసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వల్ల వైరల్ అవుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్...
కేరాఫ్ నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా!
వేవ్స్ సమ్మిట్ 2025లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. ముంబైలో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత హైదరాబాద్ వచ్చారు. ఫ్లైట్ జర్నీలో ఆయన నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని రాసిన టీ షర్ట్ ధరించారు. దాని మీద బ్రహ్మానందం ఫోటోలు కూడా ఉన్నాయి. దాంతో ఒక్కసారిగా సోషల్ మీడియా అంతా రచ్చ రచ్చ మొదలైంది. ఇక్కడ రచ్చ అంటే పాజిటివ్ సెన్స్.
Also Read: కిస్ నుంచి బెడ్, హగ్ వరకూ... విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్'లో మొదటి పాట 'హృదయం లోపల...' చూశారా?
Look At The Tshirt 😂🤍@AlluArjun #AlluArjun pic.twitter.com/8QyTrPX9OT
— C/o.AlluArjun (@CareOfAlluArjun) May 2, 2025
#AlluArjun - C/O Nellore Pedda Reddy. pic.twitter.com/SKVUk7mKQt
— Telugu Chitraalu (@TeluguChitraalu) May 2, 2025
View this post on Instagram
అట్లీ దర్శకత్వంలో బన్నీ...
ముంబైలో పూజ జరిగిందా?
'పుష్ప 2 ది రూల్' విజయం తర్వాత అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముంబైలో ఆ సినిమా పూజా కార్యక్రమం సింపుల్‌గా చేశారని సమాచారం. ఆ సినిమా విజువల్ ఎఫెక్ట్ వర్క్స్ కోసం దర్శకుడు అట్లీతోపాటు అల్లు అర్జున్ అమెరికాలోనే లాస్ ఏంజెల్స్ సిటీ వెళ్లి వచ్చిన సంగతి తెలిసింది. అక్కడ వీఎఫ్‌ఎక్స్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి వచ్చారు. వేసవి తర్వాత చిత్రీకరణ ప్రారంభించే అవకాశం ఉందని తెలిసింది.
Also Read: హిట్ 3... రెట్రో... రెండిటి కథ ఒక్కటేనా... ఎందుకీ కంపేరిజన్స్? ఈ రెండు సినిమాల్లో ఏముంది?





















