అన్వేషించండి

Hit 3 - Retro: హిట్ 3... రెట్రో... రెండిటి కథ ఒక్కటేనా... ఎందుకీ కంపేరిజన్స్‌? ఈ రెండు సినిమాల్లో ఏముంది?

Hit 3 Vs Retro: 'హిట్ 3', 'రెట్రో' సినిమాలు బాక్సాఫీస్ బరిలో థియేటర్లను, వసూళ్లను పంచుకుంటున్నాయి. అంతే కాదు... కథను సైతం హీరోలు షేర్ చేసుకున్నారని కొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు.

'హిట్ 3' విజయం సాధించాలని కోలీవుడ్ స్టార్ సూర్య ఆకాంక్షించారు. మరో వైపు 'రెట్రో' హిట్ అవ్వాలని న్యాచురల్ స్టార్ నాని కోరుకున్నారు. సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలలో పాటు సోషల్ మీడియాలోనూ ఒకరికొకరు బెస్ట్ విషెస్ చెప్పుకోవడం చూసే ఉంటారు. విషెష్ మాత్రమే కాదు... స్టోరీలు కూడా షేర్ చేసున్నారా? అనే రెండు సినిమాలు చూసినోళ్లకు సందేహం కలుగుతోంది.

ఒక్కటే కథను ChatGptలో వేస్తే రెండు వెర్షన్స్ (హిట్ 3, రెట్రో) వచ్చాయా? అని కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఎందుకు రెండు కథల మధ్య కంపేరిజన్స్ వస్తున్నాయి? రెండిటిలో కామన్ పాయింట్స్ ఏం ఉన్నాయి? అని చూస్తే... 

సూర్య... నాని... ఆ నవ్వు ఏది?
'నువ్వు నవ్వితే బావుంటావ్' - 'రెట్రో' సినిమాలో పారి (హీరో సూర్య)తో తల్లి చెప్పే మాట. ఆ మాటను ప్రేయసి రుక్మిణి (పూజా హెగ్డే) కూడా చెబుతుంది. పారి ముఖంలో అసలు ఎప్పుడూ నవ్వు కనిపించదు. 'హిట్ 3'కి వస్తే... అర్జున్ సర్కార్ (నాని) కూడా నవ్వడు. అతని ముఖంలో ఎప్పుడూ ఒక బరువైన భావన మనకు కనిపిస్తుంది. 

'హిట్ 3'లో ఏసీపీ అర్జున్ సర్కార్ పాత్రలో నాని నటిస్తే... 'రెట్రో'లో పారి అలియాస్ జడాముని పాత్రలో సూర్య లవర్ / గ్యాంగ్‌స్టర్ రోల్ చేశారు. అయితే... ఆ రెండు క్యారెక్టరైజేషన్స్ మధ్య సిమిలారిటీస్ ఉన్నాయి. ఆ రెండు పాత్రలూ తల్లి ప్రేమకు దూరంగా పెరిగినవే. సీరియల్ కిల్లింగ్స్ ఆపడం ద్వారా దేశంలో ప్రజల రక్షణ కోసం అర్జున్ సర్కార్ ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తే... బంగారు చేపలను దేశం దాటి వెళ్లకుండా చేయడం ద్వారా పరోక్షంగా సూర్య కూడా దేశ రక్షణకు కృషి చేశారు. అవినీతి మంత్రిని అరెస్ట్ చేయించారు. 

'హిట్ 3'లో క్యాప్చర్... టార్చర్... కిల్...
'రెట్రో'లో రబ్బర్ కల్ట్... రెండూ ఒక్కటే!
'హిట్ 3', 'రెట్రో' సినిమాల మధ్య మరో సిమిలారిటీ... విలన్స్! 'హిట్ 3'లో ప్రతీక్ బబ్బర్ విలన్ రోల్ చేయగా... 'రెట్రో'లో కింగ్ మైఖేల్ పాత్రలో విధు ప్రతాప్ విలనిజం చూపించారు. ఆల్మోస్ట్ ఆల్ ఇద్దరి క్యారెక్టరైజేషన్స్ ఒక్కటే.

'హిట్ 3'లో అమాయకుల ప్రాణాలు తీసిన కొందరిని డార్క్ వెబ్ ద్వారా తన 'సీటీకే' (క్యాప్చర్... టార్చర్... కిల్) గ్యాంగ్ మెంబర్లుగా చేసుకుంటాడు విలన్. ఏడాదికి ఓసారి అందరిని ఒక్క చోటుకు చేర్చి అమాయకుల ప్రాణాలు తీసే వికృత క్రీడ పెడతాడు. తద్వారా సైకిక్ ఆనందాన్ని పొందుతాడు. 'రెట్రో'లో విలన్ చేసేది కూడా అదే. 'రబ్బర్ కల్ట్' అని క్లబ్ పెట్టి, ఒక దీవిలో అమాయకులకు - వివిధ జైళ్లలో గొడవలు పడిన ఖైదీలను తీసుకొచ్చి రెండు గ్రూపుల మధ్య పోటీ పెడతాడు. ఎవరైతే ఓడిపోతారో, ఆ గ్రూపులో సభ్యుడు ఒకరిని ఎంపిక చేసి రక్తం వచ్చేలా కొట్టి చివరికి మొసలికి ఆహారంగా వాడతాడు. మధ్యలో బాణాలు గట్రా వంటివి ఉంటాయి. విలన్ రోల్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అన్నట్టు ఉన్నాయి.

Also Readప్రవస్తి ఆరాధ్య ఏమిట్లు? కాంట్రవర్సీలోనూ కులం గోల... గూగుల్ చేస్తున్న నెటిజన్లు

'హిట్ 3', 'రెట్రో' సినిమాల్లో టైమ్ పీరియడ్ వేరు. ఒకటి యాక్షన్ నేపథ్యంలో తీసిన క్రైమ్ థ్రిల్లర్ అయితే... మరొకటి గ్యాంగ్‌స్టర్ / మాఫియా నేపథ్యంలో తీసిన ప్రేమ కథ. క్రైమ్ అరికట్టడం కోసం ఒకరు, ప్రేమ కోసం మరొకరు యుద్ధం చేశారు. కానీ, ఆ యుద్ధం చేసే క్రమంలో, కథా గమనంలో కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. 'రెట్రో' ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటే... 'హిట్ 3' సూపర్ హిట్ టాక్, భారీ వసూళ్లతో ముందుకు వెళుతోంది.

Also Read: పూజా హెగ్డే కాదు... రుక్మిణి - Retro సినిమాలో BTS ఫోటోలు షేర్ చేసిన బుట్టబొమ్మ

టాప్ హెడ్ లైన్స్

Lokesh Kanagaraj DC : హీరోగా లోకేశ్ కనగరాజ్ - రొమాంటిక్ యాక్షన్ డ్రామా DC సెన్సార్ రివ్యూ... న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
హీరోగా లోకేశ్ కనగరాజ్ - రొమాంటిక్ యాక్షన్ డ్రామా DC సెన్సార్ రివ్యూ... న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Poonam Pandey : హీరోయిన్‌ను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోబోయిన ఫ్యాన్ - నెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ
హీరోయిన్‌ను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోబోయిన ఫ్యాన్ - నెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ
Ragini 3 : బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో మిల్కీ బ్యూటీ - ఫస్ట్ డే షూటింగ్... 12 ఏళ్ల తర్వాత...
బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో మిల్కీ బ్యూటీ - ఫస్ట్ డే షూటింగ్... 12 ఏళ్ల తర్వాత...
Fauzi Release Date: ఫౌజీ రిలీజ్ డేట్... డిసెంబర్‌లో థియేటర్లలోకి ప్రభాస్ సినిమా
ఫౌజీ రిలీజ్ డేట్... డిసెంబర్‌లో థియేటర్లలోకి ప్రభాస్ సినిమా

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
హీరో ఎక్స్‌ట్రీమ్ 250R లేదా KTM 250 డ్యూక్? ధర, పనితీరు, ఫీచర్లలో ఏ బండి బెస్ట్‌?
హీరో ఎక్స్‌ట్రీమ్ 250R వర్సెస్‌ KTM 250 డ్యూక్ - 250ccలో ఏ స్ట్రీట్ బైక్ బెస్ట్? ఫుల్‌ కంపారిజన్‌
Breaking News: హైదరాబాద్‌లో విద్యార్థులకు మతపరమైన హోంవర్క్.. స్కూల్ టీచర్‌పై వేటు
హైదరాబాద్‌లో విద్యార్థులకు మతపరమైన హోంవర్క్.. స్కూల్ టీచర్‌పై వేటు
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
Embed widget