SSMB29: మహేష్ - రాజమౌళి సినిమాపై క్యాస్టింగ్ రూమర్స్... క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమా గురించి చక్కర్లు కొడుతున్న ఒక వార్తపై ప్రొడ్యూసర్ క్లారిటీ ఇచ్చారు.
Casting Rumors for SS Rajamouli & Mahesh Babu's Upcoming Film: సూపర్ స్టార్ మహేష్ బాబు, 'బాహుబలి' & 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాలతో భారతీయ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లి తెలుగు చిత్రసీమకు ఎంతో గౌరవం తెచ్చిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కలిసి ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమా క్యాస్టింగ్ గురించి జాతీయ మీడియా సంస్థ ప్రచురించిన ఓ వార్త మీద ప్రొడ్యూసర్ క్లారిటీ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
వీరేన్ స్వామితో సంబంధం లేదు!
మహేష్, రాజమౌళి సినిమా సంగతి పాన్ వరల్డ్ ప్రేక్షకులకు తెలుసు. ఆ సినిమా ఎప్పుడు మొదలు పెడతారా? ఆ సినిమాకు సంబంధించి ప్రకటన ఎప్పుడు వస్తుందా? అని ఆడియన్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో నటీనటులు, సాంకేతిక నిపుణుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకు పని చేసే అవకాశం వస్తుందేమో అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఓ వార్త అందరి దృష్టిని ఆకర్షించింది.
SSMB29 సినిమాకు వీరేన్ స్వామి క్యాస్టింగ్ డైరెక్టర్ అని జాతీయ ఆంగ్ల పత్రిక ఓ కథనం ప్రచురించింది. అతడి చియాన్ విక్రమ్ 'అపరిచితుడు' సహా మహేష్ 'వన్ నేనొక్కడినే' సినిమాకూ పని చేశారని ఆ కథనంలో వివరించింది. ఈ నేపథ్యంలో ప్రొడక్షన్ హౌస్ శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత, చిత్ర నిర్మాత కెఎల్ నారాయణ (లక్ష్మీ నారాయణ కాజా) వివరణ ఇచ్చారు. వీరేన్ స్వామితో తమకు గానీ తమ సినిమాకు గానీ సంబంధం లేదని తెలిపారు. సినిమాకు సంబందించిన సమాచారం ఏదైనా ఉంటే ప్రొడక్షన్ హౌస్ తెలియజేస్తుందని పేర్కొన్నారు. అదీ సంగతి!
Official Clarification on Casting Rumors for SS Rajamouli & Mahesh Babu's Upcoming Film. pic.twitter.com/LKKFCMJ40p
— Vamsi Kaka (@vamsikaka) May 17, 2024
కృష్ణ జయంతికి అప్డేట్ ఇస్తారా?
మహేష్ బాబు అభిమానులు, ఘట్టమనేని ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ ఈ నెల 31వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రోజు సూపర్ స్టార్ కృష్ణ జయంతి. ప్రతి ఏడాది తండ్రి జన్మదినం సందర్భంగా తన కొత్త సినిమాకు సంబధించి ఏదో ఒక అప్డేట్ ఇవ్వడం మహేష్ బాబుకు అలవాటు. ఆయన కొత్త సినిమా రాజమౌళి దర్శకత్వంలో కనుక ఆ సినిమా అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read: థియేటర్లలో విడుదలైన ఏడు రోజులకే ఓటీటీలో కృష్ణమ్మ రిలీజ్... షాక్ ఇచ్చిన సత్యదేవ్!
'గుంటూరు కారం' తర్వాత మహేష్ మరో సినిమా ఏదీ ప్రారంభించలేదు. ఆస్కార్ అవార్డుల్లో 'నాటు నాటు...'కు ఉత్తమ గీతంగా పురస్కారం రావడంతో 'ఆర్ఆర్ఆర్' ఖ్యాతి గురించి అందరికీ తెలిసింది. ఆ సినిమా తర్వాత రాజమౌళి కొత్త సినిమా కూడా ప్రారంభం కాలేదు. జక్కన్న దర్శకత్వంలో మహేష్ చేయబోయే సినిమా ఇద్దరికీ లేటెస్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్! గ్లోబ్ ట్రాంటింగ్ జానర్ అని దర్శక ధీరుడు ఆల్రెడీ చెప్పారు.