అన్వేషించండి

Gopichand 32 : గోపీచంద్ 32 షూటింగ్ షురూ - ఈ సినిమాతోనైనా దర్శకహీరోలు సరైన సక్సెస్ సాధిస్తారా?

హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో #Gopichand32 సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటలీలో ప్రారంభమైంది. 

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది గోపీచంద్ కెరీర్ లో 32వ చిత్రం. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా ఇటీవలే ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. అయితే తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ ను దర్శకుడు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

ప్రస్తుతానికి #Gopichand32 అనే వర్కింగ్ టైటిల్ తో పిలబడుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటలీలో ప్రారంభమైంది. ఇటలీ, మిలాన్ లోని కొన్ని అద్భుతమైన లోకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతున్నట్లు తెలుపుతూ శ్రీను వైట్ల ఓ వీడియోని షేర్ చేశారు. ఈ షెడ్యూల్ లో హీరో గోపీచంద్ తో పాటు ఇతర తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది.

'గోపీచంద్32' చిత్రాన్ని భారీ బడ్జెట్‌ తో లావిష్ గా రూపొందిస్తున్నారు. సినిమాలో చాలా భాగం విదేశాల్లో షూటింగ్ జరుపుకోనుంది. గతంలో శ్రీను వైట్ల తెరకెక్కించిన దూకుడు, నమో వెంకటేశ, బాద్ షా, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ లాంటి సినిమాలు ఫారిన్ లోకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకున్నాయి. ఇప్పుడు గోపీచంద్ తో తీస్తున్న మూవీని కూడా ఎక్కువ భాగం విదేశాల్లోనే ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

Also Read: ‘లియో’ ట్రైలర్ రివ్యూ: విజయ్ ఒక్కడు కాదట, ఇవి గమనించారా?

ఓవైపు మాస్, మరోవైపు ఫ్యామిలీస్ ని సమానంగా మెప్పించే యాక్షన్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ లను తెరకెక్కించడంలో శ్రీను వైట్ల సిద్ధహస్తుడనే చెప్పాలి. హీరో గోపీచంద్ సైతం తన సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరూ తొలిసారిగా కలిసి చేస్తున్న ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది.

Gopichand32 ఒక హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ అని తెలుస్తోంది. ఇంతకు ముందు చేయని పూర్తి భిన్నమైన పాత్రలో గోపీచంద్‌ ను చూపించడానికి శ్రీను వైట్ల ప్రయత్నం చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ సినిమాతో ప్రొడ్యూసర్ గా మారుతున్నారు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై అత్యుత్తమ ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ స్టాండర్డ్స్‌ తో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

స్టార్ కాస్టింగ్, పాపులర్ టెక్నిషియన్స్ ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారు. శ్రీను వైట్లతో కలిసి పలు బ్లాక్‌ బస్టర్స్‌ చిత్రాలకి వర్క్ చేసిన రచయిత గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. 'దూకుడు' సినిమాకి పని చేసిన కెమెరామెన్ కెవి గుహన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.

నిజానికి గత కొంతకాలంగా గోపీచంద్, శ్రీను వైట్ల కెరీర్ ఆశించిన విధంగా సాగడం లేదు. ఇద్దరూ వరుస పరాజయాలు ఎదురుకుంటూ వస్తున్నారు. సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న దర్శక హీరోలు.. గోపీచంద్32 చిత్రంతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని అభిమానులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.

Also Read: 'సలార్' to 'దేవర' - రెండు భాగాలుగా తెరకెక్కుతున్న తెలుగు సినిమాలివే!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Crime News: విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
AI Tools: ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Crime News: విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
AI Tools: ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
Kerala: హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకపోతే 24 సార్లు కత్తితో పొడిచేస్తారా ?  తప్పు కదా ?
హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకపోతే 24 సార్లు కత్తితో పొడిచేస్తారా ? తప్పు కదా ?
Andhra Pradesh News: తల్లికి వందనం, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
Health Emergency in China : చైనాలో పెరుగుతోన్న కొత్త వైరస్ కేసులు - హెల్త్ ఎమర్జెన్సీ విధించారంటోన్న నెటిజన్లు
చైనాలో పెరుగుతోన్న కొత్త వైరస్ కేసులు - హెల్త్ ఎమర్జెన్సీ విధించారంటోన్న నెటిజన్లు
Andhra News: కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్‌లో అపశ్రుతి - పరుగు పందెంలో అస్వస్థతకు గురై యువకుడు మృతి
కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్‌లో అపశ్రుతి - పరుగు పందెంలో అస్వస్థతకు గురై యువకుడు మృతి
Embed widget