Sonia Agarwal: ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి వచ్చేస్తున్న సోనియా అగర్వాల్ - ‘7/జీ’ ఫస్ట్ లుక్ రిలీజ్
‘7/జీ బృందావన్ కాలనీ’తో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సోనియా అగర్వాల్, తనకు కలిసొచ్చన టైటిల్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఒకప్పుడు హీరోయిన్స్‌గా సూపర్ హిట్ సినిమాల్లో నటించిన నటీమణులంతా ఇప్పుడు కంటెండ్ ఓరియెంటెడ్ చిత్రాలను ఎంచుకునే పనిలో ఉన్నారు. చాలా మంది సీనియర్ హీరోయిన్స్ పర్సనల్ లైఫ్‌పై దృష్టిపెడుతూ... ప్రొఫెషన్‌ను పక్కన పెట్టేశారు. అలాంటి వారంతా కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలతో ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకరు సోనియా అగర్వాల్. ఒకప్పుడు కోలీవుడ్‌లో హీరోయిన్‌గా వెలిగిపోయిన సోనియా... సినిమాలకు పూర్తిగా దూరం అవ్వకుండా చిన్న పాత్రల్లో అయినా కనిపిస్తూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఆవిడ లీడ్ రోల్‌లో ఒక థ్రిల్లర్ మూవీ రాబోతోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విజయ్ సేతుపతి రివీల్ చేశారు.
ఎవర్‌గ్రీన్ లవ్ స్టోరీ టైటిల్‌తో..
ప్రస్తుతం సోనియా అగర్వాల్ చేతిలో మూడు చిత్రాలు ఉండగా.. మరో సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదలయ్యింది. అదే ‘7/జీ’. 2004లో సోనియా అగర్వాల్, రవి కృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఎవర్‌గ్రీన్ లవ్ స్టోరీ ‘7/జీ బృందావన్ కాలనీ’ టైటిల్‌లో నుండి ‘7/జీ’ని తీసుకొని సోనియా తరువాతి మూవీకి టైటిల్‌గా పెట్టారు. అయితే బృందావన్ కాలనీలాగా ఇది ప్రేమకథ కాదు అని ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతోంది. ఈ పోస్టర్‌లో సోనియా.. కోపంతో ఎవరినో చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక తనతో పాటు ‘7/జీ’లో లీడ్ రోల్ చేస్తున్న మరో హీరోయిన్ కూడా స్మృతి వెంకట్ కూడా ఈ పోస్టర్‌లో భాగమయ్యింది. సోనియా అగర్వాల్, స్మృతి వెంకట్ ఎక్స్‌ప్రెషన్స్, ఫస్ట్ లుక్‌లోని బ్యాక్‌గ్రౌండ్ చూస్తుంటే ఇది పూర్తిస్థాయి థ్రిల్లర్ అని అర్థమవుతోంది.
సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్..
‘7/జీ’ సినిమాకు ‘ది డార్క్ స్టోరీ’ అని ట్యాగ్ లైన్‌ను పెట్టారు మేకర్స్. అంటే సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉంటాయేమో అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాను హరూన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో సోనియా అగర్వాల్, స్మృతి వెంకట్‌తో పాటు రోషన్ బషీర్, సుబ్రహ్మణ్య శివ కూడా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. డ్రీమ్ హౌజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ‘7/జీ’ తెరకెక్కనుంది. ఈ థ్రిల్లర్ సినిమాకు తనదైన స్టైల్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడానికి సిద్ధమవుతున్నాడు సిద్ధార్ విపిన్. ఇక ‘7/జీ’ ఫస్ట్ లుక్‌ను సోనియా అగర్వాల్ కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫ్యాన్స్ అంతా ఈ మూవీ కోసం తనకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.
Here is the First Look of 7/G#7G #7GFirstLook #7Gmovie@Haroon_FC @soniya_agg @smruthi_venkat @sidvipin @DirectorS_Shiva #SnehaGupta #Roshan @biju_v_donbosco #KannanDop @Lyricist_Mohan @KskSelvakumaar @rajinkrishnan @teamaimpr pic.twitter.com/ed1a9fpcSl
— Sonia aggarwal (@soniya_agg) January 3, 2024
సినిమాలు, సిరీస్‌తో బిజీ..
ఇక సోనియా అగర్వాల్ ఖాతాలో రెండు తమిళ సినిమాలు, ఒక మలయాళ చిత్రం ఉన్నాయి. ఇవన్నీ దాదాపుగా 2024లోనే విడుదల కానున్నాయి. ప్రస్తుతం ఈ మూడు చిత్రాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి. తమిళంలోని ‘కాదలై తేడీ నిత్యానంద’తో పాటు ‘ష్’ చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించనుంది సోనియా అగర్వాల్. ఇక మలయాళంలో ‘బిహైండ్’ అనే చిత్రంలో కూడా ఒక చిన్న రోల్ ప్లే చేస్తోంది. సినిమాల మధ్య ఎక్కువగా గ్యాప్ ఇచ్చినా కూడా ప్రతీ ఏడాది కనీసం ఒక్క మూవీతో అయినా ప్రేక్షకులను పలకరిస్తోంది సోనియా. చిన్న పాత్ర అయినా, గెస్ట్ రోల్ అయినా తనకు నచ్చిందంటే వెంటనే ఓకే చెప్పేస్తోంది. ఇక సినిమాలతో పాటు ప్రస్తుతం సోనియా అగర్వాల్ చేతిలో ‘క్వీన్ 2’ అనే ఒక వెబ్ సిరీస్ కూడా ఉంది.
Also Read: ఒక్క హగ్ కోసం రజినీకాంత్ అంత గలాటా చేశారు - రంభ షాకింగ్ కామెంట్స్