Sivaji: ఎవడో ఒకడిని కొట్టేసి వస్తా అనుకున్నారు, ఎంత పెద్దోడైనా కేర్ చేయను - నాగార్జునతో శివాజీ
Bigg Boss Sivaji: నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగ’ ప్రమోషన్స్ కోసం శివాజీతో ఇంటర్వ్యూలో హోస్ట్ చేయించారు మేకర్స్. ఇందులో శివాజీ, నాగార్జున కలిసి బిగ్ బాస్ గురించి చర్చించుకున్నారు.
Sivaji and Nagarjuna about Bigg Boss: కింగ్ నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగ’ మూవీ జనవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీలో నాగార్జునతో పాటు రాజ్ తరుణ్, అల్లరి నరేశ్ కూడా సెకండ్ హీరోలుగా నటించారు. టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా ఉన్న విజయ్ బిన్నీ.. ‘నా సామిరంగ’తో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇక ఈ మూవీ విడుదలకు దగ్గరవుతుండడంతో శివాజీతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూను ప్లాన్ చేశారు మేకర్స్. అందులో ముందుగా శివాజీ, నాగార్జున కలిసి బిగ్ బాస్ రోజులను గుర్తుచేసుకున్నారు. బిగ్ బాస్ హోస్ట్‌గా నాగార్జున ఎంత డెడికేషన్ చూపించేవారో.. రాజ్ తరుణ్ బయటపెట్టాడు.
బిగ్ బాస్ చాలా గొప్ప షో..
‘‘బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు ప్రతీ వీకెండ్ మీరు హోస్ట్. ఈరోజు మా బాస్‌కు నేను హోస్ట్. నాకు గర్వంగా ఉంది. చాలా హ్యాపీ ఫీలింగ్’’ అంటూ ముందుగా తన సంతోషాన్ని బయటపెట్టాడు శివాజీ. బిగ్ బాస్ తర్వాత లైఫ్ ఎలా ఉందని శివాజీని ప్రశ్నించారు నాగార్జున. ‘‘బిగ్ బాస్‌ను మిస్ అవుతున్నాను. ఒక రియాలిటీ నుండి రెగ్యులర్ లైఫ్‌లోకి వచ్చినట్టుంది. అంటే అబద్ధాలు మాట్లాడుకుంటూ, అరుచుకుంటూ, ఫోన్‌లో ఎమోషన్స్ ఫీలవుతూ, ఏదో అత్యాశ.. అవన్నీ బిగ్ బాస్‌లో కట్. నేను బ్రతికి ఉన్నంతకాలం బిగ్ బాస్‌ను ప్రమోట్ చేస్తూనే ఉంటా. చాలా గొప్ప షో. నేను అక్కడ ఉన్నప్పుడు చెప్పాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చెప్తున్నాను. నేను ఏ ఇంటర్వ్యూలకు వెళ్లినా ఇదే మాట. బిగ్ బాస్ గురించి మాట్లాడితే.. వాడు ఎంత పెద్దోడు అయినా నేను కేర్ చేయను’’ అని బిగ్ బాస్ గురించి మరోసారి గొప్పగా మాట్లాడాడు శివాజీ.
సండే మాత్రం ఫోన్‌కు దూరం..
‘‘ప్రతీరోజు ఫోన్ చూడకుండా ఉండలేం. కానీ సండే మాత్రం ఫోన్ పక్కన పెట్టేస్తున్నా. ఎవరినీ కలవను, చూడను. ఆ ఒక్కరోజు మెదడుకు రిలీఫ్ వస్తుంది’’ అని బయటపెట్టారు నాగార్జున. అయితే అది మంచి విషయమని, అలాగే కంటిన్యూ చేయమని శివాజీ సలహా ఇవ్వగా.. అది కష్టమని నాగ్ తేల్చిచెప్పారు. ‘‘నాకు సైట్ ఉంది. ఒట్టేసి చెప్తున్నా బిగ్ బాస్ హౌజ్ నుంచి వచ్చిన తర్వాత చూస్తే తగ్గింది. ఎప్పుడైతే వచ్చి ఫోన్ చూశానో మళ్లీ కళ్లద్దాలు పెట్టుకోవాల్సి వచ్చింది చదవడానికి. ఆర్టిస్టులకు రిక్వెస్ట్ చేస్తున్నా బిగ్ బాస్‌కు అవకాశం వస్తే నాలుగు, అయిదు వారాలు అయినా ఉండి రండి’’ అంటూ అల్లరి నరేశ్‌కు సలహా ఇచ్చాడు శివాజీ. ఆ సలహా విని అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ నవ్వుకున్నారు.
కిలోమీటర్ దూరంలోనే ఇల్లు
‘‘అందరూ నన్ను అదే అనుకున్నారు. వీడు ఎవడో ఒకడిని వేసేసి వస్తాడు. ఎవడో ఒకడిని కొట్టేసి వస్తావు. అక్కడ అంతా డిస్టర్బెన్స్‌లాగా ఉంటుంది అని మా ఆవిడే అంది. అలా జరగలేదు. అదొక అద్భుతం’’ అని శివాజీ బయటపెట్టాడు. అయితే ‘నా సామిరంగ’ను ప్రమోట్ చేయడానికి కాసేపు బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లినందుకే తన గుండె గట్టిగా కొట్టుకుందని, ఇబ్బంది అనిపించిందని రాజ్ తరుణ్ గుర్తుచేసుకున్నాడు. షూటింగ్ సెట్‌లో సమయం దొరికినప్పుడల్లా నాగార్జున ప్రతీ బిగ్ బాస్ ఎపిసోడ్ చూసేవారని, హోస్ట్‌గా బాధ్యతను తీసుకున్నప్పుడు అది పూర్తిగా నిర్వర్తించాలని ఆయన చెప్పేవారని తెలిపాడు. ‘‘నేను బిగ్ బాస్‌లోకి వెళ్లగానే నన్ను సీక్రెట్ రూమ్‌లోకి పంపిస్తే ఆ ఇబ్బంది ఉంటుందేమో ఎలా అని టెన్షన్ ఉంది. అదేరోజు రాత్రి నేను ఏమనుకున్నానంటే మా ఇల్లు కిలోమీటర్ దూరంలోనే ఉంది కదా. నేనెందుకు భయపడాలి. పక్కనే ఉన్నాం కదా. ఎందుకలా గుహల్లోకి వెళ్లిపోతున్నట్టు భయపడడం అనుకున్నాను’’ అని శివాజీ.. బిగ్ బాస్‌లోకి వచ్చేముందు ఎలా ఫీల్ అయ్యాడో తెలిపాడు. అంతే కాకుండా నాగార్జున హోస్ట్‌గా లేనిదే బిగ్ బాస్ లేదన్నాడు.
Also Read: వాళ్లకి అన్నీ తెలుసు, థియేటర్లలోకి ‘#90స్’, టెన్షన్ అవసరం లేదు - శివాజీ