అన్వేషించండి

Actor Ashwath Bhatt: ‘సీతారామం’ నటుడిపై దొంగల దాడి - ఇస్తాంబుల్‌లో షాకింగ్ ఘటన!

వెకేషన్ కోసం ఇస్తాంబుల్‌‌కు వెళ్లిన ‘సీతారామం’ నటుడు అశ్వత్ భట్‌కు షాకింగ్ ఘటన ఎదురయ్యింది. ప్రముఖ పర్యాటక కేంద్రం గలాటా టవర్ దగ్గర దొంగలు ఆయనపై దాడి చేశారు.

Actor Ashwath Bhatt Assaulted By Robber In Istanbul: ‘రాజీ’, ‘సీతారామం’, ‘హైదర్’, ‘మిషన్ మజ్ను’ లాంటి సినిమాల్లో అద్భుత నటనతో ఆకట్టుకున్న యాక్టర్ అశ్వత్ భట్ కు టర్కీలో ఊహించని ఘటన ఎదురైంది. వెకేషన్ లో భాగంగా ఆయన ప్రస్తుతం ఇస్తాంబుల్ లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. ఆగష్టు 4 నాడు ఇస్తాంబుల్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం గలాటా టవర్ ను చూడాలనుకున్నారు. తను బస చేసిన హోటల్ నుంచి అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్తుండగా, ఊహించని పరిణామం ఎదురైంది. గలాటా టవర్‌కు కొద్ది దూరంలో ఆయనపై దొంగలు దాడి చేయడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. తాజాగా ఈ విషయాన్ని ఆయన ఓ జాతీయ చానెల్ తో పంచుకున్నారు.

ఇంతకీ గలాటా టవర్ ముందు ఏం జరిగిందంటే?

గలాటా టవర్ ముందు తనపై దొంగలు దాడి చేసి, బ్యాగ్ లాక్కెళ్లేందుకు ప్రయత్నించారని అశ్వత్ భట్ చెప్పారు. “నేను గలాటా టవర్ వైపు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. అతని చేతిలో గొలుసు ఉంది. నేను అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక ముందే, అతడు నన్ను వీపు మీద కొట్టాడు. నేను తేరుకోక ముందే, నా బ్యాగ్ ని లాక్కెల్లేందుకు ప్రయత్నించాడు. దూరంగా ఓ దొంగల ముఠా ఉన్నట్లు అర్థం అయ్యింది. కానీ, వాళ్లు నా దగ్గరికి రాలేదు. ఒక్కడే నా బ్యాగ్ తీసుకెళ్లేందుకు ట్రై చేశాడు. ఇంతలోనే అక్కడిని ఓ క్యాబ్ డ్రైవర్ వచ్చాడు. అతడిని చూసి దొంగ అక్కడి నుంచి పారిపోయాడు. క్యాబ్ డ్రైవర్ నా గాయం కావడాన్ని గమనించాడు. వెంటనే నన్ను పోలీసుల దగ్గరికి వెళ్లమని చెప్పాడు” అని వివరించాడు.

పర్యాటక ప్రాంతంలో ఇలా జరగడం దురదృష్టకరం- అశ్వత్ భట్

టర్కీలో జేబు దొంగలు ఉంటారని విన్నానని, పర్యాటక ప్రాంతంలో ఇలా జరుగుతుందని ఊహించలేదని అశ్వత్ భట్ చెప్పారు. “టర్కీలో జేబు దొంగలు ఉంటారని విన్నాను. కానీ, నాకే ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. ముఖ్యంగా ఇలాంటి పర్యాటక ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం. టర్కీలో చాలా మంది రొమాంటిక్ గా ఉంటారని విన్నాను. కానీ, ఇలా జరగడంతో షాకయ్యాను. నేను మిడిల్ ఈస్ట్, ఈజిప్ట్ తో పాటు ఐరోపాలోని చాలా ప్రాంతాలకు వెళ్ళాను. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కానీ, టర్కీలో జీవితంలో మర్చిపోలేని ఘటన జరిగింది” అని అశ్వత్ భట్ తెలిపారు.  

సంఘటన జరిగిన తర్వాత తాను పోలీస్ పెట్రోలింగ్ కారు దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పినట్లు అశ్వత్ భట్ తెలిపారు. ఈ విషయంపై కంప్లైంట్ ఇవ్వాలని కోరారని చెప్పారు. అయితే, ఇంతకీ తను ఫిర్యాదు ఇచ్చారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.  

Read Also: 'దసరా' నటుడికి అరుదైన వ్యాధి - ADHDతో బాధపడుతున్న షైన్‌ టామ్‌ చాకో, ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే!

Also Read: పవన్‌ కళ్యాణ్‌-రవితేజతో మల్టీస్టారర్‌ - క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన హరీశ్‌ శంకర్‌

టాప్ హెడ్ లైన్స్

Vaishnav Tej Hanuman 2 : హనుమాన్ సీక్వెల్‌లో మెగా హీరో - బిగ్ సర్ప్రైజ్‌తో పాటు ట్విస్ట్ కూడా...
హనుమాన్ సీక్వెల్‌లో మెగా హీరో - బిగ్ సర్ప్రైజ్‌తో పాటు ట్విస్ట్ కూడా...
Drishyam The Conclusion OTT : ఓటీటీలోకి 'దృశ్యం 3' - అజయ్ దేవగణ్ క్రైమ్ థ్రిల్లర్ అఫీషియల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి 'దృశ్యం 3' - అజయ్ దేవగణ్ క్రైమ్ థ్రిల్లర్ అఫీషియల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Anirudh Kavya Maran : ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్ - కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్... పెళ్లి వేడుక సందర్భంగా బిగ్ సర్ప్రైజ్
ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్ - కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్... పెళ్లి వేడుక సందర్భంగా బిగ్ సర్ప్రైజ్
OM Day 1 Collections : 'O.M' ఫస్ట్ డే కలెక్షన్స్ - ధనుష్ యాక్షన్ థ్రిల్లర్ తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
'O.M' ఫస్ట్ డే కలెక్షన్స్ - ధనుష్ యాక్షన్ థ్రిల్లర్ తొలి రోజు వసూళ్లు ఎంతంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
TG Bharath: ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్
IND VS NZ 1st Test Highlights: వెల్లింగ్టన్ టెస్టులో భారత టాప్ 5 బ్యాటర్ల సరికొత్త చరిత్ర.. సేనా దేశాల్లో తొలిసారి ఐదుగురు యాభైకి పైగా పరుగులు
వెల్లింగ్టన్ టెస్టులో భారత టాప్ 5 బ్యాటర్ల సరికొత్త చరిత్ర.. సేనా దేశాల్లో తొలిసారి ఐదుగురు యాభైకి పైగా పరుగులు
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Embed widget