Single Box Office Collections Day 3: శ్రీ విష్ణు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ 'సింగిల్' - 3 రోజుల్లో కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Sree Vishnu Single Movie Day 3 Collections: శ్రీ విష్ణు లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'సింగిల్' బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. 3 రోజుల్లోనే రూ.16.3 కోట్ల వసూళ్లు సాధించింది.

Sree Vishnu's Single Movie Day 3 Box Office Collections: శ్రీ విష్ణు లేటెస్ట్ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ 'సింగిల్' కలెక్షన్ల జోరు కొనసాగిస్తోంది. తొలి రెండు రోజుల్లానే మూడో రోజు కూడా అదే జోష్ మెయింటెయిన్ చేసింది. శ్రీ విష్ణు కెరీర్‌లోనే రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది.
3 రోజుల్లో కలెక్షన్లు ఎంతంటే?
తొలి 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.16.3 కోట్ల వసూళ్లు సాధించినట్లు మూవీ టీం వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఫస్ట్ డే రూ.4.15 కోట్లు, రెండో రోజు రూ.7.05 కోట్లు, మూడో రోజు రూ.5.1 కోట్ల వసూళ్లు సాధించింది. శ్రీ విష్ణు (Sree Vishnu) కెరీర్‌లోనే మరో భారీ హిట్‌గా నిలిచింది. అతి త్వరలోనే రూ.20 కోట్ల క్లబ్‌లోకి చేరుతుందని మూవీ టీం ధీమా వ్యక్తం చేసింది. ఇదే జోరు కొనసాగితే రికార్డు వసూళ్లు రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
గత 24 గంటల్లో 66 వేలకు పైగా టికెట్లు సేల్ అయినట్లు ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ యాప్ 'బుక్ మై షో' (Bookmyshow) వెల్లడించింది. మొత్తం టికెట్ల సంఖ్య 2 లక్షలు దాటేసింది. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ భారీగా కలెక్షన్లు సాధిస్తోంది. మూడు రోజుల్లో USAలో $400K మార్క్ దాటేసి.. అర మిలియన్ మార్క్ వైపు దూసుకెళ్తోంది.
#Single Blazes Past $400K+ at the USA Box Office🔥🇺🇸
— V Cinemas (@VcinemasUS) May 12, 2025
Don’t miss this BLOCKBUSTER laugh riot…catch it in theatres now!❤️🔥
Grand USA Release by @VcinemasUS @sreevishnuoffl @GeethaArts @KalyaFilms pic.twitter.com/ZJU3oiMjdt
#Single 3 Days official poster 💥💥
— Tollywood Box Office (@Tolly_BOXOFFICE) May 12, 2025
Film has entered into profits in all areas 👍
Heading towards blockbuster 👌
@sreevishnuoffl @caarthickraju @TheKetikaSharma @i__ivana_ #AlluAravind @vennelakishore pic.twitter.com/k3l0MHVfjt
ఎప్పుడూ డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ యాక్టింగ్‌తో మెప్పించే శ్రీ విష్ణు.. 'సింగిల్' మూవీలో తనదైన కామెడీ టైమింగ్, పంచులు, డైలాగ్స్‌తో అదరగొట్టారు. వెన్నెల కిశోర్‌తో కలిసి చేసిన కామెడీకి ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్, యూత్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. ఈ మూవీకి కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించగా... కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. గీతా ఆర్ట్స్ అధినేత, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిలిమ్స్ సంస్థతో కలిసి విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు వచ్చిన లాభాల్లో సగం సైనికులకు ఇవ్వనున్నట్లు అల్లు అరవింద్ ఇదివరకే ప్రకటించారు.
ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉండడంతో కామెడీ జర్నీ కొనసాగుతుందని ఆడియన్స్ ఖుష్ అవుతున్నారు. 'సింగిల్' హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు మంచి కలెక్షన్లు రాబడుతుండడంతో మూవీ టీం ఆనందం వ్యక్తం చేస్తోంది.






















