Simhadri Re Release : 'సింహాద్రి' రీ రిలీజ్ - 1210 షోలతో ఎన్టీఆర్ సరికొత్త రికార్డు
రాజమౌళి, జూ. ఎన్టీఆర్ కాంబోలో 2003లో వచ్చిన 'సింహాద్రి' సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇవాళ(మే 20న) తారక్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ రీరిలీజ్ కానుంది.
టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ కోనసాగుతోంది. ఇప్పటికే పలువురు అగ్ర హీరోల సినిమాలు రీ రిలీజై,సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ సైతం రీ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఎన్టీఆర్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అయిన 'సింహాద్రి' ఇవాళ(మే 20న) రీరిలీజ్ అవుతుంది. 20 సంవత్సరాల క్రితం వచ్చిన 'సింహాద్రి' రీ రిలీజ్ కి 1200 పైగా షోలు ఉండడంతో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. ఇప్పటి వరకు ఓ రీ రిలీజ్ సినిమాకి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇదే తొలిసారి. ఈ రికార్డ్ కేవలం ఎన్టీఆర్ 'సింహాద్రి' మూవీకి మాత్రమే దక్కింది.
1210 షోలతో ‘సింహాద్రి’ సరికొత్త రికార్డు
ఇక ‘సింహాద్రి’ మూవీ ని 4k, డాల్బీ, అట్మాస్ వెర్షన్ లో విడుదల చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోనే సుమారు 150 కి పైగా థియేటర్స్ లో ఈ సినిమాని ప్రదర్శించబోతున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాకు లేనన్ని షోలో(1210) ప్రదర్శించనున్నారు. అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ అయిన మెల్ బోర్న్ ఐమాక్స్ థియేటర్ లోనూ ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగింది.
రీ రిలీజ్ కలెక్షన్లతో పేద ఎన్టీఆర్ అభిమానులకు సాయం
ఇక ‘సింహాద్రి’ సినిమా రిరిలీజ్ కు వచ్చిన కలెక్షన్స్ లోని లాభాలను ఓ మంచి పని కోసం ఉపయోగించాలని భావిస్తున్నారట మేకర్స్. పేదరికంతో బాధపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ సినిమా కలెక్షన్స్ ద్వారా వచ్చిన డబ్బుని అందించబోతున్నారు. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్స్ సూచించిన అభిమానులకు ఈ సాయం అందనుంది.
కలెక్షన్స్ లో ‘సింహాద్రి’ సరికొత్త రికార్డు
దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘సింహాద్రి’ సినిమా అప్పట్లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన అంకిత, భూమిక హీరోయిన్స్ గా నటించారు. నాజర్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, భానుచందర్ కీలకపాత్ర పోషించారు. ఎంఎం కీరణవాణి సంగీతం అందించిన ఈ చిత్రం 2023 లో విడుదలైన, సుమారు రూ.30 కోట్లకు పైగా వసూలు చేసి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ మూవీగా నిలిచింది. అంతేకాదు. ఆ సంవత్సరం టాలీవుడ్ లోనే మోస్ట్ హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు రీ రిలీజ్ లోను 'సింహాద్రి' మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని అంటున్నారు అభిమానులు.
Also Read : ఎన్టీఆర్ కాకుండా మరో హీరో అయితే 'టెంపర్' క్లైమాక్స్, 'కొమురం భీముడో' సాంగ్ చేసేవారా?
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరాటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అటు బాలీవుడ్ లోకి ఎన్టీఆర్ అడుగు పెట్టబోతున్నారు. ‘వార్ 2‘లో నెగెటివ్ రోల్ చేయబోతున్నారు.
Read Also: ముంబైలో 4 ఫ్లాట్లు, 417 ఎకరాల భూమి - షారుఖ్ కొడుకును అరెస్ట్ చేసిన అధికారి ఆస్తులు ఇవేనట