Yodha Review by Umair Sandhu: సిద్ధార్థ్ మల్హోత్రా 'యోధ' అంత వరస్టా - షాక్ ఇచ్చేలా దుబాయ్ క్రిటిక్ రివ్యూ
Sidharth Malhotra's Yodha Review: సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన 'యోధ' ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఈ చిత్ర బృందానికి షాక్ ఇచ్చేలా దుబాయ్ బేస్డ్ క్రిటిక్ రివ్యూ ఇచ్చారు.
Yodha Movie Review In Telugu: బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన కొత్త సినిమా 'యోధ'. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్. ఈ శుక్రవారం (మార్చి 15న) థియేటర్లలోకి వస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. అయితే, 'యోధ' చిత్ర బృందంతో పాటు ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు షాక్ ఇచ్చేలా దుబాయ్ బేస్డ్ క్రిటిక్ ఉమైర్ సందు ఫస్ట్ రివ్యూ ఇచ్చారు.
'యోధ' డిజాస్టర్ అంటోన్న ఉమైర్ సందు!
Umair Sandhu Review On Yodha: 'యోధ' ఫస్ట్ రివ్యూ అంటూ బుధవారం ఉమైర్ సందు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఎక్స్ (X)లో ట్వీట్ చేశారు. సినిమా డిజాస్టర్ అని పేర్కొన్నారు. ''నటీనటుల పెర్ఫార్మన్స్ చెత్తగా ఉంది. వీఎఫ్ఎక్స్, డైరెక్షన్ కూడా బాలేదు. ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రా కెరీర్ ఫినిష్ అయిపోతుంది'' అని ఉమైర్ సందు తెలిపారు.
Also Read: జగపతి బాబుకు సల్మాన్‌తో ఫ్లాప్... బావమరిదితో లెక్క సెటిల్ చేయాల్సిన టైమ్!
First Review : #Yodha
— Umair Sandhu (@UmairSandu) March 13, 2024
Disaster !! Bad Performances, VFX & Direction. @SidMalhotra Career will be Finished after this CRAP 💩.
1⭐️/5⭐️
తనకు తాను దుబాయ్ బేస్ సెన్సార్ సభ్యుడిగా చెప్పుకొంటున్న ఉమైర్ సందు సినిమాలు చూడకుండా రివ్యూలు ఇస్తారని విమర్శలు ఉన్నాయి. ఫేక్ రివ్యూలు ఇస్తూ పాపులారిటీ కోసం ట్రై చేస్తున్నాడని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. 'యోధ'తో పాటు ఈ శుక్రవారం విడుదల అవుతున్న అదా శర్మ 'బస్తర్' సినిమా సైతం డిజాస్టర్ అని ఉమైర్ సందు పేర్కొన్నాడు. ఏప్రిల్ 5న విడుదల కానున్న 'ఫ్యామిలీ స్టార్' సైతం ఫ్లాప్ అని ట్వీట్ చేయడంతో అతనిపై విజయ్ దేవరకొండ అభిమానులు మండిపడుతున్నారు.
సిద్ధార్థ్ మల్హోత్రా జోడీగా రాశీ ఖన్నా!
Yodha Trailer Review In Telugu: 'యోధ'లో తండ్రిని చూసి ఆర్మీ అధికారి అయిన యువకుడిగా సిద్ధార్థ్ మల్హోత్రా నటించారు. దేశం కోసం ప్రాణాలకు తెగించిన అతడిని ఉన్నతాధికారులు ఎందుకు సస్పెండ్ చేశారు? తీవ్రవాదులు కొందరు విమానాన్ని హైజాక్ చేస్తారు. ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమాలో చూడాలి.
Also Read: యాదాద్రి టెంపుల్‌లో షణ్ముఖ్ పూజలు - కేసులు గట్రా నుంచి బయట పడేందుకు!?
'యోధ'లో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన రాశీ ఖన్నా నటించారు. ఎయిర్ హోస్టెస్ క్యారెక్టర్ చేశారు దిశా పాట్నీ. ఆ క్యారెక్టర్లలో ముగ్గురు ఎలా చేశారు? అనేది ఈ వారం థియేటర్లలో చూడాలి.
Taking #Yodha across cities and hearts, and now even through the first of its kind Comic Book, launching it before the release! ❤️
— Sidharth Malhotra (@SidMalhotra) March 13, 2024
Indore, thanks for making it even more special! 🙏🏻
Book your tickets here:
BMS - https://t.co/K0HbQCuJxk
Paytm - https://t.co/scovTVrNyI
Amazon -… pic.twitter.com/haAMy6XVXh