By: ABP Desam | Updated at : 13 Feb 2023 05:38 PM (IST)
Alia Bhatt
కియరా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి ఇటీవలే ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట ముంబయిలో రిసెప్షన్ నిర్వహించారు. బాలీవుడ్ ప్రముఖులంతా ఈ రిసెప్షన్‌కు హాజరై వధువరులను ఆశీర్వదించారు. ఈ ఈవెంట్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా బ్లాక్ సూట్‌తో, కియరా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ డ్రెస్‌లో అదిరిపోయింది.
వీరి రిసెప్షన్‌కు బాలీవుడ్ నటి అలియా భట్ కూడా హాజరైంది. అయితే, ఆమె భర్త రణ్‌బీర్ కపూర్ మాత్రం గైర్హాజరయ్యాడు. అలియా సిద్ధార్థ్ మల్హోత్రాలు ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’, ‘కపూర్ అండ్ సన్స్’ చిత్రాల్లో కలిసి నటించారు. అంతేకాదు, వీరిద్దరూ కొన్నాళ్లు డేటింగులో కూడా ఉన్నారని వదంతులు వచ్చాయ్.
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ మూవీ ఇద్దరికీ మొదటి చిత్రమే. దీంతో వారి మధ్య స్నేహం పెరిగింది. ఆ మూవీ హిట్ కొట్టడంతో ఇద్దరూ పార్టీలు, ఈవెంట్‌లకు హాజరయ్యేవారు. అలియా సిద్ధార్థ్‌తో ప్రేమగా ఉన్నప్పటికీ.. అతడు మాత్రం మరో హీరోయిన్ తో క్లోజ్ గా ఉండేవాడని వార్తలు వచ్చాయి. దీంతో అలియా, సిద్ధార్థ్ మధ్య బ్రేకప్ అయింది. అలియా, రణ్‌బీర్‌ను పెళ్లి చేసుకోవడంతో ఆ వార్తలకు పుల్‌స్టాప్ పడింది. మాజీ ప్రియుడి రిసెప్షన్‌కు అలియా రాకపోవచ్చని అంతా భావించారు. కానీ, ఆమె సింగిల్‌గా వచ్చి.. కొత్త జంటకు విష్ చేసి మరీ వెళ్లింది. అయితే, ఆమె భర్త రణ్‌బీర్ వెంట రాకపోవడంతో.. నెటిజన్స్ ‘‘వేర్ ఈజ్ రణ్‌బీర్’’ అని టీజ్ చేస్తున్నారు.
సిద్ధార్థ్ మాజీ ప్రియుడనే ఉద్దేశంతోనే రణ్‌బీర్ రిసెప్షన్‌కు గైర్హాజరై ఉంటాడని నెటిజన్స్ అంటున్నారు. ప్రస్తుతం ఆమె రిసెప్షన్‌కు హాజరైన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో సిద్ధార్థ్-కియారా వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ జంట వారి వివాహానికి సంబంధించి ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగానే.. అలియా కూడా వాటిని ఆమె ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో యాడ్ చేసింది. అంతే కాదు వారికి విషెస్ కూడా తెలిపింది. ఇక సిద్ధార్థ్-కియారా రిసెప్షన్ కి ఆయుష్ శర్మ, సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్, శిల్పాశెట్టి, కరీనా కపూర్, దిశా పటాని, ఆదిత్య కపూర్, వరుణ్ ధావన్, రణవీర్ సింగ్, ఆకాష్ అంబానీ, అనుష్క రంజాన్, కాజోల్, కరణ్ జోహార్, అలియా భట్, నీతూ కపూర్, విద్యా బాలన్, అజయ్ దేవగణ్, అనుపమ్ ఖేర్, రాశి ఖన్నా, కృతి సనన్, జెనీలియా, రితేష్ దేశముఖ్, విక్కీ కౌశల్, రకుల్ ప్రీత్ సింగ్, అనన్య పాండే, నేహా ధూపియా.. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. దీంతో ఒకేచోట ఇంత మంది స్టార్స్ ని చూడడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండవ్వుతున్నాయి.
Read Also: ‘సీతారామం’ బ్యూటీపై దారుణమైన ట్రోలింగ్స్, నేనూ మనిషినే అంటూ ఆవేదన!
Ajith Kumar: అజిత్ ఇంటికి నేరుగా వెళ్లి పరామర్శించిన విజయ్ - పోటీ బాక్సాఫీస్ దగ్గరే, పర్సనల్ లైఫ్‌లో కాదు!
Akshay Kumar: మూవీ షూటింగ్లో గాయపడ్డ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్
New Music Directors in Tollywood: సరికొత్త ట్యూన్స్‌తో అదరగొడుతున్న చిన్న సంగీత దర్శకులు - ఒక్క ఛాన్స్ ఇవ్వండి గురూ!
Nikhil Wife Pallavi Varma: సాడ్ స్టోరీలు చెప్పి నన్ను పడేశాడు: నిఖిల్ భార్య పల్లవి
Bhishma Combo Repeat: నితిన్, రష్మిక మూవీకి మెగాస్టార్ క్లాప్ - ‘భీష్మ’ త్రయంపై ఫ్యాన్స్ ఆశలు
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల