అన్వేషించండి

Coolie Movie: రజనీకాంత్‌-లోకేష్‌ కనగరాజ్‌ మూవీలో స్టార్‌ హీరోయిన్‌ - ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌, సర్‌ప్రైజ్‌ చేస్తున్న కొత్త అప్‌డేట్‌! 

Coole Movie Update: రజనీకాంత్‌ కూలీ మూవీ నుంచి మరో సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో స్టార్‌ హీరోయిన్‌ నటిస్తున్నట్టు తాజాగా ప్రకటన ఇచ్చింది మూవీ టీం.

Shruti Haasan Joins in Rajinikanth Coolie Movie: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'కూలీ'. సన్‌పిక్చర్స్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఇతర ఇండస్ట్రీలోకి చెందని స్టార్స్‌ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇందులో కన్నడ రియల్‌ స్టార్‌ ఉపేంద్ర ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున కూడా ఈ సినిమా కీ రోల్‌ పోషిస్తున్నారు.

నిన్న ఆగష్టు 29న ఆయన పుట్టిన రోజు సందర్భంగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. అంతేకాదు ఇందులో నాగార్జున సైమన్‌ అనే పవర్ఫుల్‌ రోల్‌ పోషిస్తున్నారట. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో కొత్త పాత్రను పరిచయం చేశారు మేకర్స్‌. ఇందులో టాలెంటెడ్‌ హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ కూడా నటిస్తోంది. ఇందులో ఆమె ప్రీతి అనే పాత్రలో కనిపించనుంది. తాజాగా దీనిపై సన్‌పిక్చర్స్‌ అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు. 

ఇందులో శ్రుతి చేతిలో ఇనుప రాడు పట్టుకుని కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఇలా ఈ సినిమా నుంచి వస్తున్న వరుస అప్‌డేట్స్‌ మూవీపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. దక్షిణాదికి చెందిన అగ్ర నటీనటులు కూలీలో భాగం అవుతుండటంతో మూవీపై రోజురోజుకు మరింత బజ్ పెరుగుతోంది. అలాగే ఈ సినిమాలో కన్నడ నటి రచిత రామ్‌ కూడా నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా కోలీవుడ్‌ యంగ్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే 'జైలర్‌' చిత్రంతో రజనీకాంత్‌ సూపర్‌ హిట్‌ కొట్టారు. ఇక విక్రమ్‌, లీయో సినిమాలతో దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ బ్లాక్‌బస్టర్‌ అందుకున్నారు.

Also Read: బన్నీపై పవన్‌ అలాంటి కామెంట్స్‌! 'పుష్ప' నిర్మాత స్పందన - బర్త్‌డేకు 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' నుంచి సర్‌ప్రైజ్‌

దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా అనగానే ఆడియన్స్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఫ్యాన్స్‌లో అయితే ఈ మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నారు. పైగా మూవీ నుంచి వస్తున్న అప్‌డేట్స్‌, ఇందులో నటిస్తున్న భారీ తారాగణం చూస్తుంటే మూవీపై విపరీతమైన బజ్‌ నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌ మంచి రెస్పాన్స్‌ అందుకుంది. ఈ టీజర్‌లో గోల్డ్ స్మగ్లింగ్ చేసే వ్యక్తుల డెన్ (గూడౌన్)లో అడుగు పెట్టిన హీరో.. బంగారు గడియారాలతో ఒక గొలుసు చేసి దాంతో అక్కడ ఉన్న రౌడీలను తుక్కు తుక్కుగా కొట్టిన విజువల్స్ అభిమానులకు విపరీతంగా నచ్చింది. ఇక ఈ సినిమాలోని రజనీ లుక్‌కి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రాన్ని 2025లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Also Read: లైంగిక వేధింపులపై నోరు విప్పిన నటి షకీలా - టాలీవుడ్‌ పైనా షాకింగ్ కామెంట్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Embed widget