Shraddha Srinath In Saindhav : వెంకటేష్ 'సైంధవ్'లో శ్రద్ధా శ్రీనాథ్ - ఫస్ట్ లుక్ చూశారా?
Saindhav Movie Update - Shraddha Srinath First Look : వెంకటేష్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'సైంధవ్'లో శ్రద్దా శ్రీనాథ్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ రోజు ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
![Shraddha Srinath In Saindhav : వెంకటేష్ 'సైంధవ్'లో శ్రద్ధా శ్రీనాథ్ - ఫస్ట్ లుక్ చూశారా? Shraddha Srinath As Manognya From Venkatesh, Sailesh Kolanu's Saindhav Movie Shraddha Srinath In Saindhav : వెంకటేష్ 'సైంధవ్'లో శ్రద్ధా శ్రీనాథ్ - ఫస్ట్ లుక్ చూశారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/15/617e31cc4b05ef740a3d6bb57326ad4e1681538294534313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati) కథానాయకుడిగా 'హిట్' దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమా 'సైంధవ్' (Saindhav Movie). ప్రస్తుతం విశాఖ పట్టణంలో చిత్రీకరణ చేస్తున్నారు. కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో ఈ సినిమా అనౌన్స్ చేశారు.
'సైంధవ్'లో శ్రద్దా శ్రీనాథ్
Shraddha Srinath First Look : 'జెర్సీ'లో నేచురల్ స్టార్ నానికి జోడీగా నటించిన 'శ్రద్ధా శ్రీనాథ్ ఉన్నారు కదా! తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ సినిమా కంటే ముందు కన్నడలో కొన్ని సినిమాలు చేశారు. 'యూ టర్న్' నటిగా ఆమెకు మంచి పేరు తెచ్చింది. 'జెర్సీ' తర్వాత తెలుగులో 'జోడీ', 'కృష్ణ అండ్ హిజ్ లీల' సినిమాలు చేశారు. 'సైంధవ్'లో ఆమె లీడ్ రోల్ చేస్తున్నట్టు తెలిపారు.
'సైంధవ్' సినిమాలో మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath New Telugu Movie) నటిస్తున్నట్లు దర్శక - నిర్మాతలు తెలిపారు. అభినయానికి ఆస్కారమున్న పాత్ర అని చెప్పారు. సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ లుక్ కూడా విడుదల చేశారు. కారులో కూర్చుని బాక్సులో ఫుడ్ తింటూ కనిపించారు. చీరకట్టులో ఆమె చాలా చక్కగా ఉన్నారు. ఏదో ఆలోచనలో ఉన్నట్టు అర్థం అవుతోంది. మూడేళ్ళ విరామం తర్వాత శ్రద్ధా శ్రీనాథ్ చేస్తున్న తెలుగు చిత్రమిది.
Also Read : 'శాకుంతలం' రివ్యూ : సమంత సరిగా చేయలేదా? గుణశేఖర్ బాగా తీయలేదా?
View this post on Instagram
డిసెంబర్ 22న పాన్ ఇండియా రిలీజ్
నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి భారీ స్థాయిలో 'సైంధవ్' సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 22న సినిమాను విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం వెల్లడించారు.
వెంకటేష్ 75వ చిత్రమిది. ఫస్ట్ లుక్ చూస్తే... ఆయన రగ్గడ్ లుక్, ఇంటెన్సిటీ బావున్నాయి. ఇందులో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్ర చేస్తున్నారు. ఆయనకు తొలి తెలుగు చిత్రమిది. రహానీ శర్మ సైతం కీలక పాత్ర చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే, ఆమె సినిమాలో ఉన్నారా? లేదా? అనేది ఇంకా చిత్ర బృందం తెలుపలేదు. గత కొన్నేళ్ళుగా ప్రతి సినిమాలోనూ వెంకటేష్ దాదాపు ఒకే తరహా లుక్ మైంటైన్ చేస్తున్నారు. మధ్యలో సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్ లో కనిపించినా... చాలా రోజులుగా హెయిర్ స్టైల్ చేంజ్ చేయలేదు. 'సైంధవ్' కోసం ఆయన హెయిర్ స్టైల్ చేంజ్ చేసినట్టు ఆల్రెడీ విడుదల చేసిన లుక్ చూస్తుంటే తెలుస్తోంది.
Also Read : 'విడుదల' రివ్యూ : అంచనాలు పెంచిన విజయ్ సేతుపతి, వెట్రిమారన్ - పార్ట్ 1 ఎలా ఉందంటే?
విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా కానుంది. ‘శ్యామ్ సింగ రాయ్’ తర్వాత నీహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న రెండో సినిమా ఇది. హిట్‌వర్స్ కాకుండా కొత్త కథతో శైలేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా, సినిమాటోగ్రఫీ : ఎస్. మణికందన్, ఎడిటింగ్ : గ్యారీ బీహెచ్, సంగీత దర్శకుడు : సంతోష్ నారాయణన్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)