Shiva Re Release - 'శివ' రీ రిలీజ్: నాగార్జున, వర్మ కల్ట్ క్లాసిక్ మళ్ళీ థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందంటే?
Nagarjuna Akkineni: కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన కల్ట్ క్లాసిక్ 'శివ'. ఇప్పుడు ఆ సినిమాను మళ్ళీ థియేటర్లలోకి తీసుకు రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కథానాయకుడిగా నటించిన సినిమాలలో 'శివ' (Shiva 4k Movie) సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. తెలుగు సినిమా తీరును మార్చిన ఘనత ఆ చిత్రానికి దక్కుతుంది. తాను దర్శకుడిగా పరిచయమైన సినిమాతో ట్రెండ్ సెట్ చేశారు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma). ఆ సినిమా అతి త్వరలో మళ్లీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది.
సెప్టెంబర్‌లో థియేటర్లలోకి మళ్ళీ 'శివ'!
Shiva Re Release Date 2025: 'శివ' సినిమాను 4కే ఫార్మాట్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'కుబేర' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'శివ' రీ రిలీజ్ గురించి అక్కినేని నాగార్జున మాట్లాడారు. 'శివ'ను 4కే కన్వర్ట్ చేస్తున్నట్లు తెలిపారు. 'కుబేర' విడుదల సమయంలో నాగ చైతన్యకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఏడాది ఆ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడం గ్యారెంటీ అని చెప్పారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...
సెప్టెంబర్ నెలలో 'శివ' సినిమాను మళ్ళీ థియేటర్లలోకి తీసుకు వచ్చేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ రెడీ అవుతోంది. రీ రిలీజ్ డేట్ అతి త్వరలో కన్ఫర్మ్ కానుంది. సెప్టెంబర్ నెలాఖరున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన 'ఓజీ' విడుదల కానుంది కనుక అంత కంటే ముందు 'శివ' రీ రిలీజ్ కావచ్చు. సెప్టెంబర్ రెండో వారంలో సినిమాను ప్రేక్షకులు ముందుగా తీసుకు రావడానికి ప్లాన్ చేశారట.
Also Read: పవన్ కళ్యాణ్ హిట్ సినిమాలు ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు - మూవీస్ లిస్ట్ & స్ట్రీమింగ్ డీటెయిల్స్
The rage of KING Fans 🥵🥵🥵🥵🥵🥵
— King Nagarjuna Fans (@NAGSOLDIERS) July 18, 2025
Path-breaker is coming in September😎#WeWantShiva4K #NagarjunaAkkineni pic.twitter.com/6G4MwizqV4
తెలుగు సినిమాలలో యాక్షన్ సన్నివేశాలను తీసే తీరును మార్చిన ఘనత 'శివ' సినిమాకు దక్కుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. పాటల సైతం కొత్తగా ఉంటాయి. ఇప్పుడు ఆ సినిమా దగ్గర ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read: ప్రభాస్ డూప్‌తో కాదు, ఆయనతో నటించా... 'ది రాజా సాబ్'పై నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు





















