Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హిట్ సినిమాలు ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు - మూవీస్ లిస్ట్ & స్ట్రీమింగ్ డీటెయిల్స్
Pawan Kalyan Hit Movies: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాతిక సినిమాలకు పైగా చేశారు. హిట్స్, బ్లాక్ బస్టర్స్ చాలా ఉన్నాయి. టాప్ 5 ఫిలిమ్స్ ఫ్రీ స్ట్రీమింగ్ ఎక్కడనేది తెలుసుకోండి.

Pawan Kalyan Hit Movies Telugu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖాతాలో బ్లాక్ బస్టర్స్, హిట్స్ ఉన్నాయి. అందులో అభిమానులతో పాటు ప్రేక్షకులు అందరూ మెచ్చిన ఐదు సినిమాలను ఎటువంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా చూడొచ్చు. ఆ మూవీస్ స్ట్రీమింగ్ వివరాలు, లింక్స్ డీటెయిల్స్ తెలుసుకోండి.
'గబ్బర్ సింగ్' స్ట్రీమింగ్ ఫ్రీ - ఎక్కడంటే?
Watch Gabbar Singh Full Movie: వీరాభిమాని హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా 'గబ్బర్ సింగ్'. హిందీ హిట్ 'దబంగ్' కథకు హరీష్ తన స్టైల్ మార్పులు - చేర్పులతో తెరకెక్కించారు. పవన్ సరసన శృతి హాసన్ నాయికగా నటించిన ఈ సినిమా వంద కోట్ల క్లబ్బులో చేరిన తొలి తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. 'గబ్బర్ సింగ్'ను యూట్యూబ్‌లో ఫ్రీగా చూడటం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
పవన్ కళ్యాణ్ జల్సా స్ట్రీమింగ్ కూడా ఫ్రీ!
Jalsa movie OTT streaming platform: ఇప్పుడు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆప్త మిత్రులు. వీళ్ళిద్దరి కాంబోలో ఫస్ట్ సినిమా 'జల్సా'. 'ఖుషి'తర్వాత పవన్ ఫిల్మ్స్ ఆశించిన రీతిలో ఆడలేదు. అభిమానులు కోరుకునే విధంగా త్రివిక్రమ్ సినిమా తీశారు. ఇలియానా, పార్వతి మెల్టన్, కమలినీ ముఖర్జీ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. 'జల్సా' సినిమా ఫ్రీ స్ట్రీమింగ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పవన్ చేసిన 'ఖుషి'ని చూస్తారా? అదీ ఫ్రీయే!
పవన్ కళ్యాణ్ కెరీర్‌లో హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఎన్ని అయినా ఉండొచ్చు. అయితే, 'ఖుషి' సినిమా అభిమానులతో పాటు ప్రేక్షకులకు స్పెషల్ ఫిల్మ్. ఎస్.జె. సూర్య దర్శకత్వం వహించిన ఆ సినిమాలో భూమిక హీరోయిన్. ప్రేమకథలకు కొత్త ట్రెండ్ సెట్ చేసిన సినిమా అది. దానిని కూడా ఫ్రీగా చూడొచ్చు. 'ఖుషి' సినిమా స్ట్రీమింగ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
'తమ్ముడు' స్ట్రీమింగ్ కూడా ఫ్రీయే... ఎక్కడంటే?
పవన్ కళ్యాణ్ కిక్ బాక్సర్‌గా నటించిన స్పోర్ట్స్ డ్రామా 'తమ్ముడు'. అందులో ప్రీతి జంగియాని, అదితి గోవారికర్ హీరోయిన్లు. పవన్ నటన నుంచి పాటల వరకు పలు అంశాల్లో సినిమా ట్రెండ్ సెట్ చేసింది. యూత్‌లో సినిమా బాగా పాపులర్ అయింది. ఇప్పటికీ ఈ సినిమాకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. 'తమ్ముడు' సినిమాను యూట్యూబ్‌లో ఫ్రీగా చూసేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి.
కల్ట్ హిట్ 'బద్రి'ని యూట్యూబ్‌లో ఫ్రీగా చూడొచ్చు!
పూరి జగన్నాథ్ దర్శకత్వం పవన్ కళ్యాణ్ నటించిన రొమాంటిక్ సినిమా 'బద్రి'. రేణు దేశాయ్, అమీషా పటేల్ హీరోయిన్లుగా నటించారు. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. కల్ట్ హిట్ అని చెప్పవచ్చు. తెలుగులో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన అతికొద్ది సినిమాల్లో ఇదొకటి. ఈ సినిమాను యూట్యూబ్‌లో ఫ్రీగా చూడవచ్చు. 'బద్రి' సినిమా యూట్యూబ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పవన్ కళ్యాణ్ పాతిక సినిమాలకు పైగా చేశారు. అందులో 'గబ్బర్ సింగ్', 'జల్సా', 'బద్రి', 'తమ్ముడు' సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక 'ఖుషి' గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించే ఐదు సినిమాలను ఓసారి చూడండి.





















